పుట:అహల్యాసంక్రందనము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాడు.[1] వీటన్నింటినీ మించే మరోగౌరవం పొందాడు. వాగ్గేయకారుడు క్షేత్రయ వేంకటకృష్ణప్పనాయకునిమీద పదములు రచించాడు.[2] ఈవిషయంలో మహారాజుకన్న కూడా ధన్యుడు.

ఈతడు విజయరంగచొక్కనాథునివల్ల సమస్తమర్యాదలూ పొందుతూ, మహావైభవంగా రాజు సెబాసనే ఠీవితో అతనికి కుడిభుజమై ఉండేవాడు.

వచన జైమినీభారతము వేంకటకృష్ణుని రచనలలో మొదటిది. తరువాత సంకల్పించిన అహల్యాసంక్రందనంలో దీనిప్రశంస ఉంది. నరాంకితము చేసిందల్లా దీనిని ఒకదానినే: కృతిపతి, విజయరంగచొక్కనాథుడు.

అహల్యాసంక్రందనమును కోరి కృతిపుచ్చుకున్నది, కులదైవము ప్రభువుతో నామసారూప్యమున్న, ప్రభువుల ప్రభువు - శ్రీరంగనాథుడు సారంగధర, ఆదేవునకే.

  1. ఈ ప్రశంస కూడా, వేంకటకృష్ణప్పనాయకుని గ్రంథములలోకి ఎక్కకుండా, చరిత్రాంశంగానే నిలిచిపోవడం చూస్తే, విజయరాఘవుని జయించడంతో కాని, సంగరసవ్యసాచి సంగరకిరీటి బిరుదములు రాలేదేమో; అప్పటికే గ్రంథములు రచించడం ముగిసి చాలా కాలమైందేమో?
  2. 'రమ్మనవే. సముఖానరాయబారమేటికే' మొదలైన మూడు నాలుగు పదాలు 'వేంకటకృష్ణప్పనాయకునిమీద క్షేత్రయ చెప్పాడని వినికిడి. తిరుమలేంద్రుని ఆస్థానాన్ని ఆమహాకవి పావనంచేస్తూ మధురలో నివసించుతూండేనాటికి, వేంకటకృష్ణుడు అప్పుడే అంకురించిన యౌవనంలో విలాసవిహారాలకు కాలు దువ్వుతూండటం; ఆతనిచక్కని విగ్రహం అంతకన్న చక్కని రాసిక్యం, గమనిస్తూ క్షేత్రయ ముగ్ధుడై పోయి, ఆతనిమీద పదము లల్లడం విని, పండుముదుసలి అయిన తిరుమలేంద్రుడు ఎంతో మెచ్చుకుని, మీనాక్షీనాయడు ఏమీ కంటగించుకోకుండా సర్ది చెప్పాడనీ, దక్షిణదేశంలో భరతాభినయవిదుల సంప్రదాయంలో నిలిచిపోయినకథ.