పుట:అహల్యాసంక్రందనము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీనాక్షినాయకుని[1] యింటిపేరు సముఖమని మారి అప్పటినుంచీ ఆకోవకు అదే నిలిచిపోయిందని వాడుక. నిశ్చయించే ఆధారాలు స్పష్టంగా

  1. మీనాక్షీ నాయకుడు ... తిరుమలనాయకుని మంత్రిగా నుండెననియొకప్రతీతి కలదు. వేంకటకృష్ణప్పనాయకుడు తిరుమలనాయకుని మనుమని మనుమడగు విజయరంగచొక్కనాథుని యాస్థానమున నుండెను. దీనినిబట్టి తండ్రికిని గుమారునికిని నడుమ నంతర మధికముగా గనుపట్టుచున్నది. వెంకటకృష్ణప్పనాయకుడు మీనాక్షినాయకుని వృద్ధదశలో బుట్టినవాడనియు, విజయరంగచొక్కనాథుని రాజ్యకాలమునందు వేంకటకృష్ణప్పనాయకుడు కూడ వృద్ధుడుగా నుండెననియు నూహించినచో నీయంతర మత్యధికముగా దోపకపోవచ్చును, గాని, వేంకటకృష్ణప్పనాయకుని తల్లియగు అలమేలక్క 'మంగమ్మసాకుడుకూతు' రను ప్రతీతి యుండుటచే, నామెభర్తయగు మీనాక్షినాయకుడు విజయరంగచొక్కనాథుని పితామహి యగు మంగమ్మదేవిక్రింద మంత్రిగా నుండెనని యూహించుటయే సమంజసముగా గన్పట్టుచున్నది. ఈ మంగమ్మదేవి, 1689–1704 వరకు విజయరంగచొక్కనాథుని సంరక్షణకర్త్రిగా రాజ్యము చేసెను. మీనాక్షినాయకుడు మధురమీనాక్షి యాలయమున కెదుట నొకమండపమును గట్టించి, యఖండదీపముగూడ నిల్పెనట, విజయరంగచొక్కనాథు డనేకధర్మకార్యములు చేసెను. శొంఠిగున్నయ్య యను నాంధ్రబ్రాహ్మణున కొకయగ్రహార మిచ్చెనట. ఈబ్రాహ్మణునిసంతతివా రిప్పటికిని నాయగ్రహార మనుభవించుచు పెరియకొళ గ్రామమందున్నారు. విజయరంగచొక్కనాథుడు గతించినపిదప నాతనిభార్య మీనాక్షమ్మ 5, 6 సంవత్సరములు మాత్రమె రాజ్యము చేసెను. అనంతరము దేశము తురుష్కాక్రాంతమాయెను. అప్పుడు వేంకటకృష్ణప్పనాయకుని కుటుంబమువారు తమ బంధువగు వడగరై జమీందారు నాశ్రయించి, యచ్చటనే నివసించిరి ...'

    —జైమినిభారత భూమికలో జయంతి రామయ్యపంతులుగారు.