పుట:అహల్యాసంక్రందనము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాలుగొంటూండే నెచ్చెలి. స్వయముగా కవి, కవుల కాశ్రయము.[1] నిరంతరం రాజసముఖాననే ఉండటంవల్ల తిరుమలేంద్రుని కొలువులో,

  1. ఇక్కవి యైదాశ్వాసముల జైమినిభారత వచనకావ్యమునే గాక సారంగధరచరిత్రమను మూఁడాశ్వాసముల వచనగ్రంథమును, అహల్యాసంక్రందనమను మూఁడాశ్వాసముల శృంగారప్రబంధమును, రాధికాసాంత్వనమనియెడి యేకాశ్వాసశృంగారప్రబంధమును రచియించెను. ఇందు మొదటిది, పాండ్యమండలాధీశ్వరుఁడగు విజయరంగచొక్కనాథున కంకితమొనర్చి మిగిలినవానిని శ్రీరంగస్వామికిఁ గృతి యొసంగెను. ఇందు జైమినిభారతము నైదాశ్వాసముల యాద్యంతములందును,

    శ్రీరాధావరచరణాం
    భోరుహభృంగాయమానభుజకరవీరా
    ధారాఖండితశాత్రవ
    శూరా శ్రీవిజయరంగచొక్కవజీరా!

    ఇత్యాదిగాఁ గృతినాయకవర్ణనపద్యంబులును, బ్రత్యాశ్వాసాంతమునను,

    'ఇది శ్రీపాండ్యమండలాధీశ్వర శ్రీవిజయరంగచొక్కనాథ మహీనాథ కరుణా కటాక్షసంపాదిత గజతురంగ మాందోళికాప్రముఖనిఖల సంపత్పారంపరీ సమేధమాన సముఖమీనాక్షీనాయక తనూభవ....' ఇత్యాదిగా గద్యములు నుండుటంబట్టి యితడు విజయరంగచొక్కభూపాలునకు సమకాలికుఁడై యాతనికిఁ గృతినిచ్చిన కేవలకవి యనియే కాక, యహల్యాసంక్రందనములో శేషము వేంకటపతికవి చెప్పినట్లుగాఁ దన్ను వర్ణించుకొనిన, 'ధైర్యమా శౌర్యమా ... శౌర్యసాంద్ర!' (1-40) అనుపద్యముంబట్టి యితఁడు పాండ్యభూనాథుని యాస్థానమందలి ముఖ్యసామాజికులలో నొకఁడైనట్లును దెలియుచున్నది. —మఱియు

    తే. ...'రంగధరపతి నేను సారంగధరచ
           రిత్ర వచనము చేసి తత్కృతిని నాకు
           నంకితము సేయుము శుభంబు లగును నీకు

    (సారంగధర ప్రస్తావన)

    శా. 'వాసిన్ రంగవిభుండ నేను .. ... నీకు మేలౌనిఁకన్.

    (అహల్య 1–15)

    —'అని యానతిచ్చుటయు నేనును దోడన మేల్కాంచి పురోహితభృత్యామాత్యసామాజికవర్గంబులు గొలువం గూర్చుండి యుభయభాషాకవితావిశేషులైన శేషము వేంకటపతి, బుణిగె శ్రీకృష్ణకవీంద్రులు మాకాప్తసఖులు గావునం బిలిపించి, యాశుభస్వప్నంబు వినిపించుటయు ' అని సారంగధరచరిత్రమునందు, నహల్యాసంక్రందనమునందును దనకుఁ గూడ భృత్యామాత్యసామాజికవర్గము గలదని వ్రాసికొనుటంబట్టి పూర్వగద్యములో వ్రాయబడినట్లుగా నీతఁడు విజయరంగచొక్కనాథుని దయచే సామంతరాజై కొన్నిగ్రామముల కధిపతియైనట్లు కూడఁ దెలియుచున్నది.

    శ్రీవిజయరంగచొక్కనాథుఁడు 1704-31 నడుమఁ బాండ్యమండల మేలినవాఁడగుటచే (ఆo. సా. ప. ప, సంపు: 2- 220) మన కవికూడ నక్కాలముననే యుండెననుట స్పష్టము.

    [—జైమినిభారతం పీఠికలో మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు.]