పుట:అహల్యాసంక్రందనము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాల్లో, సారస్వతవిహారాల్లో తనను మీరేవారు, ఆకాలంలో మరొకరు లేరనిపించాడు. సామ్రాజ్యపోషణలో అప్రమత్తుడుగా కళాసామ్రాజ్యాన్ని కూడా తోడునీడల్లో వర్ధిల్లచేశాడు. దేశంలో ప్రజల కన్నులూ మనసులూ ఆనందంతో విప్పారించాడు.

సముఖ మేకటకృష్ణప్పనాయకుడు[1] చొక్కనాథుని దళవాయి. కావ్యగీతావినోదాల్లో అతనితో సరిసమానుడుగా అరమరికెలు లేకుండా

  1. .........జైమిని భారతమునందుగూడ నీతనివంశావతార మభివర్ణింపఁబడియుండును గాని, పరిషత్తునకు దొరికిన ప్రతులయందు నవతారికాభాగము పోయినది. శేషము వేంకటపతికవి తనవంశావతారమును వర్ణించినట్లుగా నొక్కరీతిగా సారంగధరచరిత్రయందు, నహల్యాసంక్రందనమునందును, వర్ణించుకొనిన యాతని వంశక్రమ మిట్లని తెలియుచున్నది.

    కేశవప్పనాయడు (మూలపురుషుడు)
    |
    వేంకటనాయడు
    |
    పెదగురవప్పనాయడు
    |
    ఎల్లి సెట్టినాయడు
    |
    వేంకటనాయుడు = వేంకటాంబ
    |
    మీనాక్షినాయడు = అలమేలమ్మ
    |
    వేంకటకృష్ణప్పనాయడు.

    —జైమిని భారతభూమితే, ఆం. సా. పరిషత్.