పుట:అహల్యాసంక్రందనము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

పరిషత్భాండాగారమునుండి, రాధికాసాంత్వనము, సారంగధర, జైమినీభారత భాగములను, శ్రమపడి, వ్రాసి యొసఁగినారు. సాహిత్యపరిషత్ గౌరవ కార్యదర్శి యగు శ్రీకొత్తపల్లి సూర్యారావుగారు, మాకు వలసిన గ్రంథములు వ్రాయించుకొనుటకు, తగిన సదుపాయములు చేసినారు. ఈసారస్వతజీవను లందరకు మావినతులు మఱి యొకమా రెఱుకపఱచుచున్నాము.

ఆంధ్రసాహిత్యపరిషత్తు భాండాగారమునందలి,
సారంగధర చరిత్ర వచనము (శిధిలమైన ప్రతి) నెం. 62
అహల్యాసంక్రందనము (అసమగ్రము) నెం. 2
వచన జై మిని భారతము నెం. 142, 308
రాధికాసాంత్వనము నెం. 177
ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమునందలి,
రాధికాసాంత్వనము కాగిత ప్రతి నెం. R 199
అహల్యాసంక్రందనము కాగిత ప్రతి నెం. D 386
                           తాళపత్ర ప్రతి నెం. D 887

—పై వాని ఆధారమున, ముఖ్య ప్రబంధమును, అనుబంధములును బరిష్కృతములై ముద్రణము నందినవి. సారస్వతాభిమానులయొద్ద నింక పాఠభేదములుగల ప్రతులున్న మాకు దెలియఁజేసిన ద్వితీయముద్రణమున వానిఁ జేర్చెదము మఱియు నిటువలె నుత్తమశ్రేణికి జెందిన యముద్రిత ప్రబంధములను సాహితీపరులు మాకు దయతో నొసఁగిన వానిఁ బ్రకటించుట కెల్లప్పుడును సంసిద్ధులము.

చదువరులు, మాకృషికిఁ దగిన దోహదమును సర్వదా యొసఁగుచు నితోధికముగా మాచే నాంధ్రవాణి నర్చనల నోలలాడించి చరితార్థతం బ్రసాదింతురుగాక, యని మనవి.

వ్యవస్థాపకుఁడు.