పుట:అహల్యాసంక్రందనము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరోమారు చదువరుల నోరూరించే సాధుప్రయత్నమేకాని, ఆ రసమోహిని ప్రతిభను కళంకితము చేయాలని కాదు, అని సమాధానపడవలసి ఉంటుంది.

సారంగధరచరిత్రము

పడుచుతనంలో ఉండే కుమారుడికి సంసారసౌఖ్యం కలిగించడానికి పూనుకుని, ఆ ఉత్సాహం ఆత్మీయంగా విషమంగా అనువదించుకుని, భంగపాటు వచ్చినప్పడు, చెదరినమనసులతో, యౌవనులైన వృద్ధులు ఇహపరదూరు లయేటట్టుగా చేసే హంగామాలో కవుల కల్పనకు తులతూగకలిగిన ఇతివృత్తలక్షణం తరతరాలుగా, మనదేశంలో, విలాయతీ సారస్వతాల్లో అనేకరూపాలలో గోచరమౌతూనే ఉన్నది. ప్రకృతికి విరుద్ధగమనం తీర్చడానికి యత్నించిఇందువల్ల రేగే ప్రళయజ్వాలలు సారంగధరకథలో ప్రత్యక్షమౌతూన్నవి.

ఈకథంతా మనదేశంలోనే జరిగిందా. ఇంతపరిహాసపాత్రమైన పని, తెలుగువారికి భారతం ప్రసాదించడానికి పూనుకున్న రాజనరేంద్రుడు చేసి ఉంటాడా? నమ్మేవీలులేదు - నమ్మవలసిన అవసరమున్నూ లేదు. చరిత్రలో రాజనరేంద్రుడి కుటుంబంలో, సారంగధరలో వచ్చే పేరు లున్నవారే లేరు. పోనీ, ఇదేమంత చరిత్రలోకి ఎక్కతగిన ఉత్తమసందర్భం అని, సారస్వతంలో నిలిచిపోలేదేమో అనుకుందామన్నా, భారతం ఉపక్రమణికలో కాకపోయినా, వచనగ్రంథముగా అన్నా వెలయకుండా మానేదా? అప్పకవికి పూర్వం ఎవరూ ఈఘటనను తలపెట్టనేలేదు. అతని మాటల్లో నిజాయితీ ఉండేదీ లేనిదీ, తనకు నన్నయభట్టీయం సిద్ధప్రసాదమని తేల్చడంకోసం అసందర్భంగా ఆతడు ఆడిన అబద్ధాలే ఋజువు చేస్తూన్నవికదా? తెలుగులో, ఈకథను పద్యకావ్యంగా రచించి, తంజావూరు రఘునాథరాయలకు అంకితంచేసిన చేమకూర వెంకన్న కథ మాళవదేశానికి సంబంధించింది కాని, తెలుగునాట జరిగింది కాదనీ, చిత్రాంగి రాజనరేంద్రుని భోగస్త్రీకాని, మహిషి కాదనీ చెపుతూండటంలేదా? వంగదేశంలో ప్రచారంలో ఉన్న, కథలో, సారంగధరుడు, పూర్ణుడనేభక్తుడు: చిత్రాంగి, లూనా అనే ఛమర