పుట:అహల్యాసంక్రందనము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తత్వార్థాధిగమనము ఇక విరమించి, ప్రస్తుతముగా వేంకటకృష్ణప్పనాయకుని శిల్పాన్ని పరిశీలించనౌను. అతడు కవిమాత్రము కాకుండా దర్శకచాతుర్యములు కూడా అలవరుచుకొన్న విన్నాణి. అహల్యను ప్రజాపతి సృష్టి చేయవలసిన అవసరం కల్పించేందుకు ఇంద్రసభలో,ఋషులందరిచేత ఒకనాటకం ఆడించుతాడు. తగవులతో మొదలు పెట్టినకథ చివరవరకూ అలాగే నడవడం, మునుల శృంగారకళాభిప్రాయాలను పురస్కరించుకొని వచ్చిన అహల్యారూపకల్పన, తుదకు, మునిమండలిలో ఒక అమాయకునకు విషప్రాయం కావడం, తపసుకు ఫలంగా అనుభవించుతూన్న స్వర్గవిలాసినుల ప్రోడతనాల హెచ్చుతగ్గులమీద వాదాలు తెగని మౌనుల ప్రచ్ఛన్నశృంగారప్రకటనలకు ఫలితం గౌతమునికి గార్హస్థంలో శృంగారసాహచర్యం కొన్నియుగాలవరకూ లోపించడం. విధి నిర్ణయక్రమంలో ఒడిదుడుకులు- భర్తమీద భక్తి, పరాయివానిమీద అంతరక్షోభ;వలపూ, రెండూ సరితూగినప్పుడు హృదయం ఉన్న కామిని అనుభవించే ఇవన్నీ - కావ్యం చదువుతూన్నప్పుడు భావనను గిలిగింతలు చేస్తూ తోచే సన్నివేశాలు. ఇలా అనుకునేందుకు ఆస్కారం కలిగించే రచనాప్ర్రాగల్భ్యం వేంకటకృష్ణప్పనాయకుని సొమ్మైనది. స్థూలంగా, ఆలోచించినప్పుడు, ఇంత తోచదు. నాలుగువందలపద్యాలతో మూడాశ్వాసములుగా, చక్కనికవిత్వముతో ప్రబంధము నిర్మించినాడు అనే అనిపించినా, మానసికంగా, కావ్యరసాన్ని అనుభవంలోనికి రా జేసుకున్నప్పుడు, కవి కల్పనలో వుండేసత్తా, ప్రయోగాలు చిగిరించే అర్థశక్తి ద్యోతకమౌతుంది. అర్థవైభవం కలిమిగా ఉన్న మహాకవి, శబ్దాడంబరమును లక్ష్యము చేయడు అనడానికి 'అహల్యాసంక్రందనము' ప్రమాణము.

ఈ కథనే తీసుకుని సంగమేశ్వరుడు 'అహల్యాసంక్రందనవిలాసం' అనే ప్రబంధాన్ని రచించినాడు. అతడు ఇంద్ర అహల్యా సంగమముతో కథను, తా ననుకొనినటుల మంగళాంతముగా, గౌతముడు స్నానానంతరము సూర్యోదయమగుదాకా ఎక్కడో గడిపి యింటికి తిరిగివచ్చి, గొడవలేమీ తెలియకుండా, తెలుసుకోకుండా, సుఖంగా ఉంటూన్నాడు, అని