పుట:అహల్యాసంక్రందనము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలుక తగ్గించి, ఆతప్పు కాయించడమే కాకుండా, ఉత్తరత్ర ఒకటి రెండలాటి తప్పటడుగులు పడినా, సహించేటట్టు మాటపుచ్చుకుని, తిరిగి వెళ్లిపోతాడు. కొంతకాలానికి, గౌతమునికి అహల్య అంజన అనే ఒకకూతురిని కంటుంది. ఆపిల్లను, ఇంద్రుడికి మొదట కన్న, వాలి అనేపిల్లవాణ్ణీ పెంచుకుంటూ, ఆదంపతులు ఖులాసాగా సంసారం చేస్తూండగా, ఒకనాడు ఋతుస్నాత అయి, కొలనుఒడ్డున తల తడి ఆరబెట్టుకుంటూ నిలుచున్న అహల్యమీద, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడికన్ను పడుతుంది. అతడికీ మనసు చెదిరి, రథం ఆకాశంలో విడిచి, చల్లగా క్రిందకు వచ్చి, ఇంద్రుని తాత ననిపించి పోతాడు. ఆప్రణయం పండి సుగ్రీవుడు పుడతాడు. మౌనికి ఈసంగతి తెలుస్తుంది, కాని అన్నమాట తప్పేందుకు వీలు లేదుకనుక, సూర్యుడికి శాపం శాపమోక్షం మర్యాదలు జరిగించినా అహల్యవిషయంలో చూసీచూడనట్లు ఊరుకుంటాడు. తర్వాత కొంతకాలానికి, ఇంద్రుడికి అహల్యమీద మళ్లీ మనసు మళ్లి, కోడికూత కూసి ఆమెతో కోరిక తీర్చుకుంటాడు. ఈ విషయం పసిది అంజన కనిపెట్టి తండ్రి స్నానము చేసి రాగానే ఆయనకు చెపుతుంది. అహల్య, తాను మనఃపూర్వకంగా వృభిచరించలేదనీ, గౌతమవేషంలో వచ్చి యింద్రుడు మోసగించటంవల్ల, ఒగ్గడంలో, పాతివత్యం నెరపుతూన్నానన్న సదభిప్ర్రాయమేకాని, వేరు యోజన లేదనీ, చెప్పి కోపగించవలదని మగనిని వేడుకుంటుంది. కాని లాభము ఉండదు. భార్యను శిల అయిపొమ్మని శపించి, ఆధూకుడులో ఔచిత్యము మరచిపోయి, వాలిసుగ్రీవులను, వానరులుగా పుట్టవలసిందని అనేస్తాడు. దీనివల్లనే ఇంతకు మూడిందికదా అని, వాలీ అహల్యా కలసి అంజనను కోతిరూపై పోతావని శపించి వాళ్లకసి యిలా తీర్చుకుంటారు. సుగ్రీవుడు, చెల్లెలిని ఆదరించి, భయం తీరేమాటలు చెపుతాడు.

ఇంద్రునివల్ల అహల్యకు రెండోసారి కలిగిన కొడుకు శతానందుడు. ఆకుర్రవాణ్ని గౌతముడు వెంటబెట్టుకుని వెళ్లి జనకుడియింటి పౌరోహిత్యం కుదిర్చి, అక్కడనుంచి తపస్సు చేసుకునేందుకు హిమాలయాల్లోకి వెళ్లిపోతాడు. — ఈ కథ నిజంగా కవులు అవలంబనముగా తీసుకో