పుట:అహల్యాసంక్రందనము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంజనేయుని కథలన్నీ ఒకచోట కూర్చిన పుష్పగిరి తిమ్మన్న సమీరకుమారవిజయంలో అహల్యవృత్తాంతం చిత్రంగా చెపుతాడు. ఏలాగంటే.

బ్రహ్మ, అహల్యను నిర్మించి, గౌతమమునికి భార్యగా యిచ్చిన కొంతకాలానికి ఇంద్రుడు చీకటితప్పు చేసి, భంగపడుతాడు. గౌతముడు భార్యమీద నిప్పులు చెరగడం మొదలు పెట్టడం ప్రజాపతికి తెలిసి ఆశ్రమానికి పరుగెత్తుకుంటూ వచ్చి, కొంతచమత్కారప్రసంగం చేసి [1]అల్లుడి

  1. మ. పవడంపున్ జిగివాతెఱన్ సుధయు, రంభామోహనస్ఫూర్తి యూ
         రువులన్, మందగతిన్ సితేభవిభుతీరున్, దంతసంపత్తి వ
         జ్రవిలాసంబు దగన్ స్వవస్తుచయవిశ్రాంతిన్ సురాధ్యక్షుఁ డీ
         నవలా మేకోనె నేరికేల కినియన్ నాతప్పెగా కింతయున్.

    సీ. వదనలోచన కైతవమున రాకాచంద్ర
                        కమలంబులకు బొండు కలుగఁజేయ
         మందస్మితోష్ణదంభంబున జంద్రికో
                        దయరాగములకు బాంధవ్య మునుప
         గమనలీలావలగ్నఛ్ఛలంబునను మ
                        త్తకరికేసరులకు సఖ్యంబు నెఱప
         సరసభాషారదచ్ఛద్మ౦బునను శుకీ
                        దాడిమీబీజాళి దగులు పఱఫ
    తే. నేఁ బ్రయత్నంబు చేసి యీ యిందువదన
         సృజన చేయుట దెలియక జేసెదలుక
         కుమ్మరికి నొక్కయేడును గుదియ కొక్క
         పె ట్టనెడుమాట నిజము గాన్పించె నిపుడు.

    తే. మందయానల డెందంబు మంద మలుకఁ
         జెందనేటికి నాపల్కుఁ జిత్తగించి
         యువిద కిదిగాక నేరంబు లొకటిరెండు
         గావుము...

    —సమీరకుమారవిజయం, ప్రథమాశ్వాసము 182-84