8
గీ1 ననిన దూర దృష్టిని గనునదియుఁ గూడ
దనుచు మణికంధరుని జూచి వినుము నీవు
కం॥ ' అని మణికంధరు గనుకొని కళాపూర్ణోదయం IV _155. వినుచుండుడు మునుపు నిన్ను 'వేమఱు నిచ్చో టన దూర శ్రవణబలం బున నీయన నీదుగానము విని పొగడ
'భూత భవద్భావిభువన వస్తువులెల్ల నిజయోగ దృష్టిచే నెమకీ 'కాంచి, ' IV. 166. IV_170.
మనుచరిత్రయందు యోగీశ్వరుఁడు కాలికేదో యొక యోషధిప సరు పూసికొని వియత్పథమున హిమవద్గిరి కేఁగ గల్గెననియుఁ బ్రవరుఁడట్లు చేయుటయు మనము విన్న సంగతియే. తొమ్మిదవ శతాబ్దము వాడగు ' మురారి ' మహాకవి తన 'అనర్ఘ రాఘవ ' మను సంస్కృతనాటక మున శ్రీరాముడు విమానయానమున నియన్మార్గమున సంచరించుచుఁ జంద్ర లోకముననుండ, సయోధ్యలో నభిషేక సంభారములు సిద్ధపరుపబడి యున్నవని త్వరితముగ వేంచేయుఁడని హనుమంతుఁ డయోధ్య నుండి నుడివిన వాక్యముల నాలకించి తోడ్తో దిగివచ్చెనని వ్రాసెను. ఇవి యన్నియు నెట్లు సాధ్యములనవచ్చును. స్థూలముగా జూడ మనకందఱకు పై విషయములు అనుభవమున లేకపోవుటచే నిట్టి విషయము లసత్యము లనియు నసంభావ్యములనియు నవిశ్వసనీయములనియు ననిపించును. కాని మనకందని విషయములలో నిట్టి యభిప్రాయములఁ గలిగి యుండుట,