7
లోని వివిధపదార్థములపై నాధారపడవలసియున్నది. మోటారు, దూరశ్రవణము, విమానము మున్నగునవి యనుభవింపవలయుననిన సన్ననిరాగితీఁగెలు, విద్యుద్ఘటములు, చమురు, మున్నగు వస్తుసముదాయము కావలసియున్నది. అది చెడిపోయినచో కార్యము సిద్ధింపదు. మన ఆర్యవాఙ్మయమునందును తత్తత్ప్రాంతభాషలందును గలవాఙ్మయమున మనవారును దూరశ్రవణ వ్యోమయానాదులు సాధించికొనినట్లు తెలియుచున్నది. వారికి పాశ్చాత్యులకు కావలసినన్ని బాహ్యపరికరములసాయము లేకయే యోగమే సాధనోపాయమని తెలియుచున్నది.
జలాంతర్గమనము భారతమున దుర్యోధనుఁడు భీమునితో గదాయుద్ధమునకు వచ్చుటకు మున్ను కొలనిలో జలస్థంభనవిద్యచే డాఁగియుండెననియు నాతఁడు దురభిమాని గావున భీముఁడు ఈసడింపుమాటలు పలుకగా సైఁపలేక కొలనినుండి వెలుపలికి వచ్చినట్లును తెలియుచున్నది. మహాభారతము శల్యపర్వమున "అని చెప్పి యట నున్న ద్వైపాయనహ్రదంబునం బ్రవేశించి తనమాయావిద్యాప్రభావంబున జలంబులు తన్నంటకుండ స్థంభనంబు గావించికొని.” (శ్రీకృష్ణభారతము - శల్యపర్వం - ద్వితీయాశ్వాసము 176.)
దూరశ్రవణ దూరదృష్టులను గురించిన విషయము కళాపూర్ణోదయమున మణికంధరుఁడు తటాకమున జలస్థంభనాదివిద్యల నెఱింగిన సిద్దునివిషయము కలభాషిణితో నుడువునపుడు.
| సీ. | ..................... | |