9
దోషమే యగుకు, మనకు తెలియనంత మాత్రమున నవి సత్యదూరముల కానేరవు. అనంతమగు శాస్త్రజాలము లపారముగా విజ్ఞానమును నానా ముఖములఁ జూటుచుండ నల్పజ్ఞులమగు మనకు తెలియని యంశము లెన్నీ యో ప్రపంచమునఁ గలవు. ' న హి సందేహాద లక్షణ'మ్మని పరిభాషేందు శేఖరమున నుడివినట్లు మనకు సందేహము గలిగినంత మాత్రమున నవి యబద్ధము లనగాదు.
మన యోగీశ్వరులు తమ భౌతికశరీరములను యోగాభ్యాస సాధనములచే స్వాధీనములుగఁ గావించికొని పై నుడివిన శక్తులే గాక యద్భుతములగు ననేక శక్తులు ననంతముగ సాధించిరి. ప్రకృతము సర్వశక్తి సంచాలనమునకు విద్యుచ్ఛక్తియే గదా కారణము, అట్టి విద్యుచ్ఛక్తి 'కావశ్యకములు సన్నని రాగితీఁగెలు మున్నగునవి. బాహ్యశక్తుల పై నాధారపడు వారికీ సన్న నిరాగితీఁగెలు చాల ముఖ్యములు. అటులే యాంత రశక్తుల సాధించు భారతీయ యోగి పుంగవులకు తమ శరీరములందలి సూక్ష్మాతి సూక్ష్మములగు నాడులత్యంతోపకారకములు. ఈ నాడీ సము దాయమునకే నాడీమండల మందురు. ఈ నాడీమండలమును శుద్ధము- గావించికొని కొన్ని ప్రక్రియల మూలమున నాయా యోగసిద్ధుల సాధించి పై కార్యములఁ గావించుచుండిరి. ఈ యోగసాధనము అంతర సాధనమే. బాహ్యపదార్థములు వీరికంతగా నవసరములు గావు. ఈ యోగమునకు ఎనిమిది యంగములు గలవు. కావుననే దీనికి అష్టాంగయోగమని పేరు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులను నవియే యెనిమిది యంగములు. ఈ యష్టాంగముల నను భవమున గురుముఖమున సాధించి కాయశుద్ధి, నాడీశుద్ధి గావించికొనిన పిదప ఖేచర త్వాది సిద్ధు లవలీలగ గలుగునని యందురు. మన యార్య విజ్ఞానము అంతర్ముఖత్వమునే బోధించి పారమార్థిక జీవనమునకు దారిఁ