పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గోశావర్తమను సుడిగల తురంగము పలువిధములైన క్లేశముల నొందించి యజమానులకు నాశనము గావించునని పెద్దల పల్కులు కలదు గావున యట్టితురంగములను కొనరాదు.


క.

నందనులు దాను పరమా
నందంబున నుండదలచు నరనాథుడు దా
ముందును వెనుకల
నందిరువుల సుళ్లున్నహయల నవనిం గొనునే.

68


సులభసాధ్యము.


తక్కక మోకాళ్ళను నిరు
పక్కల నుళ్ళున్ననాజి
దెక్క విజయము గలదై యనుపుని
విక్రమబడి ఘ్రోన్నమెల్ల నిరుపమకీర్తీ.

69


పద్యమునందు లక్ష్యము తప్పుగా నున్నది. అర్ధము స్పురించలేదు.


క.

వాసముల సుళ్లు హరులం
దోషంబులు పుట్టుననుచు తొల్లిటి పెద్దల్
వ్రాసిరి గావున దానిని
దోసం బెంచగ నెక్కరాదు రతిరాజనిభా.

70


ముక్కుమీదను సుళ్లుగల హయమువలన దోషము లధికముగా జన్మించుననుచు పెద్దలు వచించియుండిరి కావున దాని నెక్కవలదు.


క.

చెనటి గళావర్తపుహరి
గొని వెరుపక యింట గట్టుకొని యుండెడి యా
తనియింట మృత్యుదేవత
యనయము కాపురము నిలుచు నది సంశయమే.

71