పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గళావర్తముగల తురంగరత్నమును భీతిలేక యెవడు తనయింట నుంచుకొనునో యాతనియింట మృత్యుదేవత నిలుచుననుట కేమాత్రమును సందియము లేదు.


గీ.

కర్నహీను జేయగాదేని రవుతును
కర్ణరోగబాధకలితు జేయు
చెవుల సుళ్ళు వాజి జిట్టని యెవ్వారు
నెక్కనేల వగల సొక్కనేల.

72


చెవులయందు సుడిగల తురంగము త న్నధిరోహించువానిని కర్నరోగముచే పీడించబడువానిగా నొనర్చును లేకున్న చెవులు లేనివానిగా జేయును. (చెముడు వచ్చును.)


గీ.

కుష్టికముల జంఘల గళ కూర్చ జంఘ
......సుళ్ళు గల్గు వాజి జొనిపి
యెక్కబోవువాడు జమునిపొడ గాన
బోవువా డనిరి శాస్త్రవిదులైనఘనులు.

73


గ్రంథపాతమున నర్ధము స్ఫురింపదు.


క.

తనపతియు దాను నిక్కము
ననిలోపల నణగునని నహర్తి హయం
బును దూషించిరి త్రికతల
మన సుడిగలవాజి చందమున కంపనృపా.

74


నహవర్తియను సుడిగల తురంగము తన పతితోగూడ యుద్ధభూములందు గూలుదురని పెద్దలు వచించిరి. త్రికతలమున సుడి యున్నవాజిగూడ నట్టియవస్థనే పొందును. త్రికతలము - పృష్టభాగము.

ఇవి క్షేత్రకాలఫలములు.

క.

మేలుదెస గీడి సుళ్లును
మేలు ధృవుల్ గీడుచోటు మేల్కొనియున్నన్