పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

శంఖావర్తతురంగము
సంఖ్యాతబలంబుగల్గు జనపతిసేనన్
పుంఖానపుంఖశరముల
ప్రేంఖితుగా జేసి యతని పెంపణగించున్.

43


శంఖావర్తనమను సుడిగల తురగమునెక్కిన రౌతుయొక్క చతురంగసేనలను చంపి అతనియొక్క పెంపు సంపద నశింపజేయును.


క.

శోకావర్తతురంగము
భీకరహాయకరిపదాతిబృందమునైనన్
జీకాకు సేయుగానం
గైకొన రత్తేజి రాయగండరగాలీ.

44


శోకావర్తననును సుడిగల తురగము గలిగియున్న సేన పరరాజులచే చీకాకునొందింపబడునని రాజులు అట్టిహయంబులు కొనరు.


క.

పండితులు ఘోటకంబులు
గండములనైనసుళ్ళు కర్తలకు మహా
గండము లని హయవేదులు
పండితసమ్మదము జూపి పల్కిరి మొదలన్.

45


గుర్రములకు గండభాగములందు సుళ్ళుండినయెడల యజమానునకు గండమగునని హయవేదులు జెప్పిరి.


క.

దండముసుడి గల తురగము
భండనమున నమ్ముతోడ బలుదెస ననుపున్
చండమరీచీవలస
న్మండలమధ్యప్రదేశమార్గము దూరన్.

46


క.

క్రోడావర్తతురంగము
వేడుక నెక్కంగగోరు వెఱ్ఱికి నోరున్