పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మానకచో వైరినృపమార్గణరోగవిషాణ్నిలదా
ధీనుని జేసి రాజ్యసుఖహీనుని జేయుట తధ్య మేరికిన్.

40


మోకాళ్లను సుళ్ళుగల తురగము నెక్కినవాడు శోకదవానలమందు జిక్కి యుండును. అట్టిగుర్రము ఎవనిశాలలో నుండునో యాతడు చొంగల చేతను శత్రురాజులచేతను రోగాదులచేతను పీడించబడి రాజ్యసుఖదూరు డగును.


క.

వెన్నున సుడిగలతురగము
కన్నంతనె విడక యెక్క నడగుట యెల్లన్
మున్నుగొని బహ్మరాక్షను
దున్న మహీజంబు నెక్క నుబ్బుట తలపన్.

41


వెన్నుపై సుడిగల తురగమును చూచినంతనే విడిచి పెట్టక ఎక్కుటచూడగా బహ్మరాక్షసుడు నివసించియున్న మహీజమును ఎక్కుటవంటిది.


చ.

హరికకుదప్రదేశముల నశ్వము రొమ్మున వాజి వెన్నునన్
తురగము జానుదేశముల దోచినసుళ్లు మహోగ్రదోషవి
స్ఫురణను దాని..........జూచి జలంబుల గ్రుంకు నట్టి భూ
సురులకు దానమిచ్చి పరిశుద్ధుడు గావలె కంపభూవరా.

42


క.

బటువై యావర్తంబులు
కటముల రెండెడల గల్గు గంధర్వము లు
త్కటదోషకారి యది దా
కటకటమున పతిని జమునికడ కనుపుజుమీ.

43


గండభాగములందు రెండుప్రదేశముల సుళ్ళుగల తురగములు ఎక్కువయైన దోషములు కలిగించవనియు శీఘ్రకాలంబున రౌతును యామ్యదిశానాథునిపురమున కంపును.