పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నెన్నోసలుమీద చాతురంతికమను సుడియున్న తురగమును మహోత్సవకరమైన ధరణీరాజ్యసుఖంబుల నిచ్చునని విలుతురు.


క.

నిశ్రేణితఫాలంబున
విశ్రుతమగు ఘోటకంబు విశ్వములోనన్
అశ్రీనిలసత్పరిరంభో
గశ్రేయవిభవ మిచ్చు గంపమహీశా.

25


నిశ్రేణికయను నామధేయముగలసుళ్ళు ఫాలభాగముపై నేయశ్వమున కుండునో అది విభవైశ్వర్యముల నొసగును.


మ.

పదిలం బారగ సుళ్ళునాలుగు నురోభాగంబునం దిక్కులం
గదియంగాదగు రోచమానము సుముఖ్యస్థానమం దుండెనా
నది శ్రీవక్షకి నామధేయమగు నాయశ్వంబు చేకూర్చు స
మ్మదలక్ష్మీశయభోగభాగ్యవిలసన్మాన్యప్రతాపోన్నతుల్.

26


ఉ.

నాలుగురోమజాతముల నాలుగుమూలల పేరురంబు పై
దాలిచియున్న తేజి ప్రమదంబున నెక్కెడి మానవేశ్వరుం
డాలయలోన శత్రునిచయంబు నణంచి తదీయ ల
క్ష్మీలలనావిశేషసుడి కేరిగనున్ మహికంపభూవరా.

27


గీ.

సోలిమరముమీద శుక్తులుమూడుండు
సైంధవంబు సర్వసౌఖ్యదంబు
దాని నెక్కి శత్రుసేనల జెండాడి
విభుడు మగుడి దివ్యవిభవు డగును.

28


ఉరముమీదను మూడుసుళ్ళుగల తురగము సర్వసౌఖ్యములను ఇచ్చును. అట్టిగుర్రము నెక్కినవాడు శత్రు సేనల చెండాడి అధికవిభవము కలవాడగును.


క.

అంగద నామముగల్గుతు
రంగము బాహువులు సుళ్లు ప్రఖ్యాతముగా