పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రంగ నవరత్నవిభవా
సంగత మొగి నిల్ప సర్వసంపద లొసగున్.

29


అంగదనామము గలిగినటువంటి తురంగములకు బాహువులందు సుళ్లున్న యెడల నానావిధరత్నభూషణములగు సర్వసంపద లొసగును.


క.

దేవమణి దేవమణియును
మానవుని గళంబు జేరి మహినుండుట న
ద్దేవమణి గల్గుతురగము
దేవేంద్ర శ్రీయొసంగు కృతిగరిం నృపా!

30


సీ.

ప్ర్రాసాదతోరణవరత్రింశ...........
             సరసిజవేదికాస్వస్తికములు
త్రేతాగ్నియమళనిశ్రేణికా శ్రీవృక్ష
             చాతురంతికగదాచక్రములును
కలశాంగలశుక్తి ఖర్జూరఖండేందు
             వజ్రయూపాంకుశకల్పకములు
అశ్వత్థవర్ణ సూర్యాష్టపదాంబుజ
             పాంచజన్యంబుల పగిది నుండు
ధృవు లురముపై నుండె నొసలిపై నొండె గల్గు
తురగరత్నంబు నెక్కిన నరవరేణ్యు
డరుల నిర్జించి తద్రాజ్య మనుభవించు
రాజకులదీప యౌభళ రాజకంప.

31


సీ.

కటికంఠనాసికాపుటగండకరమూల
             జానుమాన్యాహనుస్కంధములను
అలీఢసృక్సిండపాలాశ్రుతాండవ
             కుక్షివాలస్థూలక్రోడములను