పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చెవి గూబలయుదున్న సుడికి వృషభావర్తం బనంబడును. వృషభావర్తంబుగల తురంగమును హయలక్షణశాస్త్రసంపన్నులు అధికవిభవంబుల నిచ్చునని త్వరితముగ నిలుతురు. (కొందురు).


సీ.

నలుమూలలనుండు నాల్గురోమజముల
             బాతురంతికమను ! సౌంజ్ఞ దనరి
ముమ్మూలలందుండు మూడురోమజములు
             త్రేతాగ్ని నాగ విఖ్యాతి దనరి
మొగిదంతియై యుండు మూడురోమజములు
             నిశ్రేణికాఖ్యమై నివ్వటిల్లు
సంగడియై రోమజములు రెండుండును
             యమళమనామధేయంబు మించి
హయముఫాలంబుమీద నీ యాకృతులను
దావకంబుల నాల్గింట దనరి మించి
సుళ్ళు పండ్రెండు ఫలమును సొరిది వినుము
రాజదేవేంద్ర యోభళ రాజకంప.

23


నాలుగుమూలలను నాలుగు సుళ్ళుండినయెడల నద్దానిని బాతురంతికమందురు. త్రికోణాకారముగ మూడుమూలల సుళ్లుండిన త్రేతాగ్నియందురు. దొంతిని విధంబున మూడుసుళ్లుండిన నిశ్రేణిత యనంబరగును. రెండుసుళ్లు సమీపంబున నుండ యమక మందురు. ఈసుళ్ళన్నియు నొసట నుండవలయును వీనిఫలముల జెప్పుచున్నాను.


క.

నెన్నొసలజాతురంతిక
మున్న తురంగంబునుతమహోత్సవకరమై
సన్నుతధరణీరాజ్యస
మున్నతసౌఖ్యంబు లిచ్చు నోభళకంపా!

24