పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హ్‌తీయ విద్యావిధానం

రహ్మానుద్దీన్‌ షేక్‌ ౨403035658

జాతీయ విద్యా విధానంలో భాషా వివక్ష

ఈశాన్య రాస్ర్రాల జనజాతుల భాషలకు పొంచి ఉన్న ముష్తు

మన దేశంలో ఎన్నెన్నో జాతులకు సంబంధించిన, కులాల కట్టుబాట్లలో జీవించే మతాలను అవలంబించే, భాషలను మాట్లాడే ప్రజలము ఒకేదేశ వాసులమన్న నమ్మకంతో (బతుకుతున్నాం. మన ఆత్మలో భారతీయత ఉంది. ఆ భారతీయత అన్న భావనే మిగితా అన్ని అస్పిత్వాలకన్నా బలంగా మన జీవితాలను నడిపిస్తోంది. 74 ఏళ్ళ నుదీర్ధ సహగమనంలో తరచూ అల్బసంఖ్యాకులు దౌర్జన్యానికి దోపిడీకి, అధికసంఖ్యాకుల నుండి నిరాదరణకు గురవుతూనే ఉన్నారు.

ఆఅ అల్బసంఖ్యాకులలో అత్యధిక నిరాదరణకు, ఉపేక్షకు గురవుతున్నవారు మన దేశ మూలవాసులు, ఆదిమజాతి వారు, అడవుల్లో (బతికే జనజాతులవారు. వారి భాష, కట్టుబాట్లు విశిష్టమైనవి. ప్రకృతిలో ఒక భాగంగా కనిపిస్తాయి. నాగరిక సమాజానికి ప్రకృతికి మధ్య వారధిగా ఉంటాయి.

ఈ జనజాతులవారినీ టబైబ్‌గటైబల్‌ అనీ ఆంగ్లంలో వ్యవహరిస్తారు. మన దేశ జనాభాలో 8.6 శాతం వీరే. వీరిని సూచించేందుకు వాడే భైబ్‌ అనే పదం బ్రిటిష్‌ వారు కనిపెట్టినది. మిగితా జనాభాతో పోల్చితే ఖౌతిక ఆకారంలో, భాషా స్వరూపంలో, బ్రతికే వాతావరణంలో, చాలా వేరుగా ఉందే వారిని, నాగరికులకు దూరంగా వ్యవహరించే వారినీ ఆనాదటు (భీటిష్‌ వారు అలా సూచించారు. అవే పాత నియమాలను అనుసరించి నేటికీ భారత ప్రభుత్వం వీరిని గుర్తిస్తోంది. 2014లో జనజాతుల సామాజిక- ఆర్దిక -ఆరోగ్య-విద్యా స్థితులను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేనిన ఉన్నత స్థాయి కమిటీ తమ నివేదికలో 705 విశిష్ట సమూహాలను షెడ్యూలు జాతులుగా(51) గుర్తించింది.

ఈ భారతీయ జనజుతుల ప్రజల గురించి రెండు పరస్పర విరుద్ధ భావనలు మనకు తెలుస్తున్నాయి. ఆచార్య జి.ఎస్‌. ఘుర్శె ప్రకారం భారతదేశంలోనీ జనజాతుల వారంతా హిందూమతాన్ని పాటించేవారే. అధిక సంఖ్యాక హిందువులు వీరిని వెనక్కు నెట్లి అభివృద్ధికి దూరంగా అదవుల్లో, కొండల్లో ఉండిపోయేలా అశ్రద్ధ చేసారు అని ఇతనీ (ప్రతిపాదన. ఇక ఇందుకు విరుద్దంగా మానవశా'(స్తవేత్త, జనజాతుల పరిశోధకులు వెల్రీయర్‌ ఎల్విన్‌ ప్రకారం జనజాతులవారు నాగరిక సమాజానికి దూరంగా ఉన్నంత వరకూ బాగానే ఉన్నారని, నాగరిక సమాజ సంపర్మంలోకి వచ్చి భూములకు, అడవులకు దూరమలయ్యారని, ఆ విధంగా తమకు ఆధిపత్యం లేని ఆధునిక అఖివ్చుద్ది కొాలమానాల్లో వెనుకబడినవారిగా గుర్తించబడుతున్నారనీ భావన. రెండవ భావన (ప్రకారం వారి సామాజిక, సాంస్కృతిక జీవితం బాగా దుష్ప్రభావానికి గురి అయిందని తెలుస్తోంది. ప్రతి సమూవహానికీ భాషాధారిత అస్తిత్వం ఆ సమూహ సామాజిక, సాంస్కృతిక జీవనానికి కీలక ఆధారం. భాషలు చారిత్రక భౌగోళిక విజ్ఞానానికి మరియు అంతర్‌-సమూహ

| తెలుగుజాతి పత్రిక జవ్సునుడి ఈ సెప్టెంబర్‌-2020 |


. జనజుతుల ప్రజల నోళ్ళల్లో వందల వేల భాషలు ఊపిరి తీసుకుంటున్నాయి. స్వాతంత్రానంతరం వచ్చిన ప్రభుత్వాలన్నీ జాతీయవాద ఆలోచనలతో జనజాతుల ప్రజలు మిగితా దేశ జనాభాతో అంటిముట్టకుండా ఉన్నారనీ అనుకొని. వారిని సాధారణ ప్రజలతో కలిపితేనే అభివృద్ధి, దేశ ఐక్యత సాధించగలమని నవ్మాంబ. ఆ విధంగా మన దేశంలో స్వాతంత్ర్యా నంతరం జనజాతుల కోసం చేసిన అన్ని చట్టాలు, జనజాతుల ప్రజలను వారి నైసర్గిక వాతావరణం నుండి బయట పదేసి, సాధారణ జనజీవన '్రవంతితో కలిసి నడిపించేలా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో జనజాతులకు సంబంధించి ఎన్నో అంశాలు చెప్పబడ్డాయి, వాటిలో కూదా పై విధానమే కనీపిస్తుంది. తక్కువ జనాభా మాట్లాడే భాషలు త్వరలో అంతరించిపోజాయి...

యునెస్మో వారు అంతరించిపోయే ప్రమాదం ఉన్న భాషల జాబితాను భౌగోళిక ప్రాంతాల ప్రకారం ఒక అట్లాసుగా చేసిస్తే అందులో 187 కనుమరుగవటానికి దగ్గరగా ఉన్న భాషలతో భారతదేశం మొదటి స్థానంలో ఉండింది. ఇది 2010 నాటి సంగతి. ఈ 197 భాషల్లో 100 భాషలు ఈశాన్య రాష్ట్రాలలోని జనజాతులకు సంబంధించినవి. వీటిల్లో 13 భాషలు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక భాషను మనం పోగొట్టు కున్నామంటే, ఆ భాషను మాట్లాడే సమాజపు దేశీయ విజ్ఞానాన్ని, సాంస్కృతిక సమాచారాన్ని మర్చిపోవాల్సిందే. ఎంత సాంకేతికంగా ఎదిగినా భాషలను పునస్థాపించే దిశగా ఏ ఒక్కరూ శ్రద్ధ తీసుకోక పోవటం గమనారం. కుల, మత, జాతి, భాష, ప్రమాణంగా సామాజిక ఎత్తువల్లాలు ఏర్పరుచుకున్న భారతదేశం లాంటి వ్యవస్థలలో ఒక భాషను పోగొట్టుకోవటం ఆ సమాజపు రాబోయే తరాలకు దేశం చేసిన ద్రోహం అవుతుంది. ప్రధాన భాషలుగా గుర్తింపు ఫొందనంత వరకు చిన్న అల్పసంఖ్యాక భాషలలో సమాచారం, పాఠ్యపుస్తకాలు, వార్తాపత్రికలు ఉండవు. ఒక విధంగా విద్యా రంగం, మీడియా, ఆ దారిలోనే ప్రభుత్వం ఈ అల్బ సంఖ్యాకులను, ఛిన్న ఖాషలు మాట్లాడే వారినీ వెలివేసే పనీ చేస్తున్నారా అని అనిపిస్తుంది. లివి లేని పక్షంలో ఈ చిన్న భాషలకు మరింత పెద్ద ప్రమాదం