పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేర్చించాలి.

ఇంటి భాష్క స్థానిక ఖాష వేరువేరుగా ఉన్నప్పుడు ద్విభాషా వాచకాలు తయారుచేసుకోండని సూచించారు. ఎందుకు ఇలా తయారు చేసుకోవాలంటే. ఇంటి భాషలో కొన్ని సాంకేతిక పదాలకు సమానార్థక పదాలు లేకపోతే స్థానిక ఇఖాష నుంచి ఆ పదాలను ఉపయోగించుకోవచ్చు. అలాగే స్థానిక భాషలో కొన్ని అభివ్యక్తులకు సరైన పదాలు దొరకకపోతే ఇంటి భాష నుంచి కూడా పదజాలాన్ని స్వేకరించవచ్చు. ఈ రకంగా స్థానిక ఖాషతో క్రమంగా అనుసంథానత పెరుగుతుంది.

ఇతర భాషలు నేర్చుకోవడానికి ఎన్‌.ఇ.పి. వ్యతిరేకం కాదు. చాలా భాషలు నేర్చుకోండి అని అది ప్రోత్సహిస్తుంది కూడా!

ఖాష నేర్చుకునే ప్రయత్నం లో భాగంగా జోధనమాధ్యమం ఉండరాదు. బోధన మాథ్యమం ద్వారా భాష వస్తుంది అని అనుకోవడానికి వీలులేదు; అన్నది ఎన్‌.ఇపి. ప్రధానంగా ప్రస్తావించిన అంశం. ఈ అంశాన్ని మనందరం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఒక భాషలో నైపుణ్యం సాధించాలి అంటే ఆ భాషని విడిగా - ఒక ఖాషగా నేర్చుకోవాలి. అంతే తప్పు జోధథన మాధ్యమం మొత్తం ఆ ఖాషలో ఉన్నంత మాత్రాన ఖాష వస్తుంది అనుకోవడం పొరపాటు. ఇంగ్రీష్‌ భాగా రావాలంటే ఇంగ్రీషును ఎలా నేర్చుకోవాలో ఆ పద్ధతులలో నేర్చుకుంటే చాలు. ఇంగ్లీష్‌ మీడియంలో చదివినంత మాత్రాన ఇంగ్లీష్‌ రాదు. ఇదీ ఇక్కడ స్పష్టం చేసిన విషయం.

ఇంగ్లీష్‌ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనడంలో వెనక్కి తగ్గాల్సిన పనిలేదు. అయితే మనం నేర్చుకోవాల్సిన ఇంగ్లీష్‌ ఎంత నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి అన్న దాంట్లో ఒక్కరికి కూడా స్పష్టత లేదు.

ఖాష విషయంలో మనకు ఆ ప్రాపంచిక దృక్పథాన్ని ఇవ్వడానికి ఎన్‌.ఇ.పి. ప్రయత్నిస్తోంది. బహుభామషావిధానం :

ఎన్‌.ఇపి. లో ఇహు భాషా విధానం మంచిదా కాదా అన్నది చర్చించారు. బఇహుఖాషా విధానంవల్ల [గ్రహణ సామర్ధాలు( కాగ్నిటివ్‌ ఎబిలిటీస్‌) పెరుగుతాయి. పిల్లవాడికి మూడు నుంచి 8 సంవత్సరాల లోపల అనేక ఖాషలు నేర్చుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ దశలో ఐఖహు ఖాషలను నేర్చవచ్చు అని చెప్పారు.

అయితే ఈ నేర్చీ విధానం ఇంటర్‌ యాక్టివ్‌ గా ఉండాలి. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకునేట్లుగా వారిని కదిలించేలా, విషయంలో వారిని నిమగ్నం చేసేలా ఉండాలి అన్నారు

నేర్చుకునే నేర్చే ఏ కొత్త భాష అయినా సులభంగా చదువుకోడానికి వీలుగా పరన్నర సంభాషణాత్మకంగా క్రీడా ప్రాయంగా ఉండేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. గ్రేడ్‌ 8 నుండి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి.

దేశీయ/ ప్రాంతీయ భాషలను నేర్చుకోవడానికి ఉపాధ్యాయు లను ప్రోత్సహించాలి అని ఎన్‌.ఇపి. చెప్పింది. ప్రపంచానుభవం ఎలాఉంది?

మరో విశేషమైన సూచన ఏమిటంటే ప్రపంచవ్యాప్త పరిశీలన జరిపినప్పుడు సొంత భాషలో నేర్చుకున్న వ్యక్తుల సామర్థ్యమే ఎక్కువగా ఉంది. విద్య అభివృద్ధికి సాంకేతిక అభివృద్ధికి మాతృ భాష అవరోధం కాకపోగా సహాయకారిగా కూడా ఉంది అని ఆయా దేశాల అనుభవాలు నిరూపించాయి.

తెలుగుజాతి పత్రిక ఖవ్మునుడి సెప్టెంబర్‌-2020 |

ఖాషాధ్యయనం - జాతీయ సమైక్యత

భారతదేశంలో సుందరమైన వ్యక్తీకరణలతో కూడిన భాషలు సాహిత్యము ఉన్నాయి. సినిమా, సంగీతం మొదలయిన రూపాలలో ఇవి ఉన్నాయి. వాటిని అధ్యయనం చేయడం జాతీయ సమ్రైక్యతకు తోడ్బడుతుంది. ఎవరి మాతృ ఖాషను వారు తప్పనిసరిగా నేర్చుకోవాలని ఎన్‌.ఇపి. చెప్పంది. త్రిభాషాసూత్రం

త్రిభాషాసూత్రం లో భాగంగా ఏ భాషను ఎంపిక చేసుకోవాలి అన్న అధికారం ఆయా రాష్ట్రాలకు ఉంటుంది. వారికి ఏ భాష ఇష్టమైతే ఆ భాష ఎంపిక చేసుకోవచ్చు. 6, 7 తరగతుల నుండి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి. ఈ సందర్భంగానే వాచకాలను, అభ్యసన సామగ్రిని ఉభయఖాషా విధానంలో మంచి నాణ్యతతో రూపొందించుకోవాలని చెప్పింది. ఇది విద్యార్థి రెండు భాషలలో విషయాలను నేర్చుకోవడానికి, వ్యక్తీకరించడానికి పనికి వస్తుంది. వక్‌ భారజ్‌, శ్రేష్ట ఖారజ్‌ :

ఈ పథకంలో భాగంగా భారతదేశ భాషల మధ్య ఉన్న థ్వన్యాత్మక సంబంధాన్ని అధ్యయనం చేయవచ్చును. లిపుల మధ్య ఉన్న సాద్భశ్యాలను పరిశీలించవచ్చు. భాషల పరస్బర ప్రభావాన్ని గురించి తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సామెతలు, నుడికారాలు పరస్పరం పంచుకోవడం ద్వారా భాషా సమైక్యతను, దేశ సమైక్యతను సాధించవచ్చు. పిల్లలకు ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. సంస్కృతం అవసరం ఏమిటి?

ఏన్‌ఇ.పే?లో సంస్కృత భాషకు సంబంధించిన ప్రస్తావన ఉంది. గణితం, తత్వశాస్త్రం రాజనీతి శాస్త్రం భవన నిర్మాణము సంగీతము మొదలైన అనేక అంశాలకు సంబంధించిన శాస్త్రీయ విషయాలకు ఆటపట్టుగా సంస్కృతం ఉంది. అందువల్ల సంస్కృతాన్ని ఒక ఐచ్చిక అంశంగా నేర్చుకోవడానికి అవకాశం కల్చించారు. సంస్కృతాన్ని రెండు పద్ధతులలో నేర్చుకోవచ్చు అని చెప్పారు.

1. (ఎస్‌.ఎస్‌.ఎస్‌.) సింపుల్‌ స్టాండర్డ్‌ సాంస్రిట్‌ 2. (ఎస్‌ టి ఎస్‌) సాంస్రిట్‌ త్రూ సాంస్కిట్‌

భారతదేశంలో సంస్కృతాన్ని మనం జ్ఞానానికి ఒక భాండాగారంగా చూడవచ్చు.

కన్నడ, తమిళం, మలయాళం మొదలైన క్లాసికల్‌ భాషలతో పాటు పాలి, పార్సి మొదలైన భాషలను నేర్చుకోవడానికి తర్వాతి తరాల వారికి ఎన్‌.ఇపి అవకాశం కల్చించింది.

7-12 గ్రేడుల మధ్య 2 సంవత్సరాల పాటు క్లాసికల్‌ భాషలను నూతన విధానంలో అంటే అనుభవపూర్వక విధానంలో నేర్చుకోవడానికి వీలు కల్చించారు. భాష ఎలా నేర్చుదాం?

అలాగే భాషను నేర్చుకోవడంలో క్రీడా పద్ధతి, యాప్స్‌, భాషలోని సాంస్కృతిక కోణాన్ని అధ్యయనం చేయడం మొదలైన పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. భాషను కవిత్వం, నాటకం, సంగీతం మొదలైన భిన్న రూపాలలో నేర్చించవచ్చు అని ఎన్‌.ఇపి సూచించింది. ముగింపు

ఖాష్క మాతృభాష గురించి ఇవి స్ఫూలంగా ఎన్‌. ఇపి చెప్పిన ముఖ్యమైన అంశాలు. వీటిని చిత్తశుద్ధితో దేశమంతా అమలుచేస్తే సత్ఫలితాలు పొందుతామనడంలో సందేహం లేదు. అ