పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్‌ో విద్యావిధానం

ఎన్‌. ముక్తేశ్వరరావు ఐ.ఏ.యస్‌. (విశ్రాంత) 94914 28078


జాతీయ విద్యావిధానం 2020 - మాతృభాష

కొత్తగా వచ్చిన జాతీయ విద్యావిధానం 2020 నాలుగవ అధ్యాయంలో పాఠ్యప్రణాళిక గురించి, బోధన గురించి ఎక్కువగా మాట్లాడింది. ఈ సందర్భంగా భాషలకు కీలక ప్రాధాన్యం ఇచ్చింది.

మనం నేర్చుకునే జ్ఞానం మన సంపూర్ణ అభివృద్ధికి సమగ్ర అభివృద్ధికి దోహదపడే దిగా ఉండాలని, రెండోది మనం నేర్చుకునేది చాలా సంతోషదాయకంగా, ఆనందప్రదంగా ఉండాలని అదే సమయంలో ఉపయోగపడేదిగా కూడా ఉండాలని అన్నారు. పాఠ్యప్రణాళిక పునర్వ్యవస్థీకరణ ఎందుకు?

ఇప్పుడున్న పాఠ్యప్రణాళిక, బోధనశాస్త్రం గురించి మాట్లాడటానికి ముందు పాఠ్యప్రణాళిక పునర్‌ వ్యవస్థీకరణ గురించి మాట్లాడారు. దీన్ని శ విఖాగాలు చేశారు.

1 ఫౌండేషన్‌ దశ/ మౌలిక దశ 2 ప్రిపరేటరీ దశ/ సంసిద్ధతా దశ 3 మిడిల్‌ స్టేజ్‌ మధ్యస్థ దశ _ 4 సెకండరీ స్టేజ్‌

మొదటి దశ ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది. 8 నుండి 8 సంవత్సరాల లోపు. సంసిద్ధతా దశ మూడు సంవత్సరాల పాటు ఉంటుంది.8 నుండి 11 సంవత్సరాల లోపు. అలాగే మధ్యస్థ మూడు సంవత్సరాల పాటు ఉంటుంది. 11 నుండి 14 సంవత్సరాల లోపు. "సెకండరీ స్టేజి 14 నుండి 18 సంవత్సరాల లోపు ఉంటుంది.

అలాగే మౌలికదశ ఐదేళ్లలో మూడు సంవత్సరాలు అంగన్వాడీ లోనూ, రెండు సంవత్సరాలు గ్రేడ్‌-1 గ్రేడ్‌-2 మౌలికదశలో ఉంటాయి. గేడ్‌ మూడు నాలుగు ఐదు నంసిద్ధతాదశలో ఉంటాయి. గేడ్‌ 6 78 మధ్యస్థదశలో ఉంటాయి. 9, 10 ఒక దశ గాను 11, 12 మరొక దశ గా ఉంటాయి. సెకండరీ దశ రెండు రకాలు ఫేజ్‌, ఫేజ్‌ 2.

ఈ పునర్‌వ్యవస్థీకరణ ఎందుకు చేశారు అన్నది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం. దీంట్లో ఏం కోరుకుంటున్నారు అంటే ప్రధానమైన మౌలికమైన మార్చు ఖాషల ద్వారా రావాలి. మనిషికి సర్వ సమగ్రమైన అభివృద్ధి రావాలి. వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. పాఠ్యప్రణాళిక, సహ పాఠ్యప్రణాళిక, పాఠ్యేతర పాఠ్యప్రణాళిక వీటి మధ్య తేడా తగ్గాలి. ఇవి వేర్వేరు అంశాలు కాదు. ఒకదానికొకటి పరిపూరకాలు. పాఠ్యప్రణాళీకని రాశి పరంగా తగ్గించాలి. వాసి పెంచాలి. వానీ ఏ ముఖంగా పెరగాలి అన్నది ప్రశ్న ప్రాథమికంగా విద్యార్ధులను ఆలోచనాపరులుగా మార్చాలి. వారికి విమర్శన దృక్చథం రావాలి. ఎసెన్నియల్‌ థింకింగ్‌, క్రియేటివ్‌ థింకింగ్‌ ఈ రెండు పెరగటం కోసం పాఠ్యప్రణాళికని వీలైనంత తగ్గించాలి. పాఠ్యప్రణాళిక - ఇంటిభాష, న్థానికభాష న

పాఠ్యప్రజాళికలో ఖాగంగా సైన్సు మొదలైన సబ్లెక్టులు ఎలా ఉండాలి అన్న విషయాన్ని చర్చిస్తూ దానిలో భాగంగా అత్యంత ప్రాథమికమైన మౌలికమైన ప్రశ్నలోకి వెళ్లారు. ఇవన్నీ మనం చేద్దాం అని అనుకుంటున్నాం. దాన్ని ఏ ఖాషలో చెబితే బాగుంటుంది? ఎలా చెబితే బాగుంటుంది? అని ప్రశ్నించుకున్నారు. ఆ ప్రశ్నలోకి వెళ్ళినప్పుడు వాళ్లు ఏమన్నారంటే తరగతిగది ప్రసారం (క్లాస్‌ రూమ్‌ ట్రాన్సాక్షన్‌) అన్నారు. ఇది పిల్లలకు ఇంటి భాషలోనే ఉండాలి అని స్పష్టంగా చెప్పారు.

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఈ సెప్టెంబర్‌-2020 |

ఇంటి భాష గురించి ప్రస్తావించినప్పుడు రెండు రకాల విషయాలను మనం చూడవచ్చు. ఇంటి భాష పరిసరాలలో ఉండే భాష ఒకటే అవ్వడం ఒక పద్ధతి. ఉదాహరణకు మనం తెలుగు మాట్లాడతాం. మన ఇయట సమాజంలో కూడా తెలుగే వినిపిస్తుంది. మరికొన్ని సందర్భాలలో ఇంటి ఖాష వేరు కావచ్చు, చుట్టూ ఉన్న స్థానిక ఖాషలు వేరు కావచ్చు. ఉదాహరణకు మైనారిటీలుగా ఉన్న ప్రజలు తమిళం, కన్నడ, కోయ, గోండి మొదలైన భాషలను ఇంటి భాషగా మాట్లాడిన వారికి బయటి ప్రపంచంలో తెలుగు వినిపిస్తుంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలి అన్నదానికి ఇంటి భాషకి ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్పారు. మాతృభాష అన్నది దీంట్లో కీలకమైన విషయం. ఎవరికి ఏది మాతృభాషో దాన్ని సుసంపన్నం చేయాలి. జ్ఞాన సంపన్నంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపయోగపడే అంశంగా మాతృభాషను చూస్తోంది జాతీయ విద్యా విధానం 2020. వీ స్థాయిలో ఏ భాష?

ఈసారి మాతృభాషను గురించి చేసిన ప్రస్తావనలో కాన్ని కీలకమైన విషయాలు చెప్పారు: 1. అయిదవ గ్రేడ్‌ వరకు మాతృభాష విధిగా ఉండితీరాలి. 2. ఎనిమిదవ (గ్రేడ్‌ వరకు వీలైనంత వరకు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వండి. 8. ఆ తర్వాత విద్యార్థి ఇష్టాఇష్టాల మీద ఆధారపడి దానిని కొనసాగించవచ్చు.

ప్రాథమిక దశలో భాష కచ్చితంగా ఉండాల్సిందేనని ఎన్‌.ఇపి. స్పష్టం చేసింది.

విద్యార్థి ఇంట్లో మాట్లాడుకునే భాష, బయట సమాజంలో మాట్లాడే ఖాష ఒకే రకంగా ఉన్నప్పుడు ఇంటి భాషలోనే వాచకాలు రావడం మంచిదని ఎన్‌.ఇపి చెప్పింది. విద్యార్థి ఇంట్లో ఒక భాష మాట్లాడుతూ ఖయట మరొకభాషలో వ్యవహరించాల్సిన సందర్భంలో నాణ్యత కలిగిన ద్విఖభాషావాచకాలను రూపొందించుకోవాలని సూచించింది. ఇవి సులభంగా నేర్చుకోవడానికి వీలుగా ఉండాలి.

మాత్చభాష ప్రభుత్వ బడులకు మాత్రమే పరిమితమా?

ఇదీ చాలా మందిని కలచివేస్తున్న ప్రశ్న ఇన్నాళ్ళు ప్రభుత్వ బడులకు ఒక న్యాయం, ప్రైవేటు ఐడు లకు ఒక న్యాయం అన్నట్లుగా ఉండేది పరిస్థితి. దీనివల్ల మాతృభాషలో చదువుకున్న పిల్లలు వెనకబడి పోతున్నారని, ఆధునిక విజ్ఞానం అందుబాటులో ఉన్న ఇంగ్లీష్‌ - వారికి అందని ద్రాక్షగా మిగిలిపోతోందని కొన్ని వర్గాలు ఆందోళన చెందాయి. ఇప్పుడు జాతీయ విద్యా విధానం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రైవేటు పబ్లిక్‌ పాఠశాలలు రెండూ దీనిని విధిగా పాటించాలి. ద్విభాషా వాచకాలు మేలు :

దీని అమలులో భాగంగా వాచక నిర్మాణం గురించి కూడా జాతీయ విద్యావిధానం ప్రస్తావించింది

వాచకాలను అత్యంత నాణ్యతతో రూపొందించుకోవాలి. అది పిల్లల ఖాషకు దగ్గరగా ఉండాలి. పిల్లలకు చాల విషయాలు నేర్చాలి

అనే ప్రయత్నాల్లో వారిపై వేరే భాషలు రుద్దకుండా ఇంటి భాష లోనే