పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్‌ ల్ని

వీబీ శతజయంతి ప్రత్యేకం షు. =ఆకే




పాములపర్తి వెంకట నరనీింహా రావు! ఎంత నిందైన తెలుగు కేరు! =. తెలుగుదనానీకి ఆయున నిలువెత్తు నిదర్శనం.

ఆయన ముద్దుపేరు పీవీ. 'ముద్దున పేరు చెడింది, సాగసున నడళ చెడింది” అంటారు. కానీ ఇక్కడ అలా

జరగలేదు... ప్రజలు ముద్దున పెట్టిన పేరు. వీవీ అంటే పరిచయం అక్మర లేని పేరుగా చిరస్థాయిగా నిలిచిపోయింది.

“రాజు తాత్వికుడు కావాలి ; తాత్వీకుడే రాజు కావాలి” అంటాడు (ప్రఖ్యాత పాశ్చాత్య తత్వవేత్త ప్లేటో. దానికి చక్కని ఉదాహరణ మన పి.వి. ప్లేటో తన రచనలలో చెప్పిన విధంగానే తాత్వికతతో పాటు రాజకీయ చాణక్యం కూదా ప్రదర్శించారు.

పంతొమ్మిది వందల డజ్షై సంవత్సరంలో ఆయన మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడే నల్లగొండ జిల్లా సర్వేల్‌ గ్రామంలో తొలి రెసిడెన్నీయల్‌ గురుకుల పాఠశాలను స్థాపించారు.

రాజకీయ నేతగానే కాదు, సాహిత్య రంగంలో కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. వారి గురించి చెప్పడం అంటే సూర్యుని ముందు దివిటీ పట్టడమే. ఆయనతో నాకు ఉన్న సాన్నిహిత్యం, నాకున్న అనుబంధంతో ఒకటి రెండు సంఘటనలనూ, ఆయన మా ప్రాంతానీకి చేసిన సేవల గురించీ ప్రస్తావిస్తాను.

ఆయన ప్రధాన మంత్రిగా ఉండగా నేను ఆయన పుట్టిన రోజైన 1992 జూన్‌ 28 వ తేదీ నాడు ఢిల్లీలోని ఆయన అధికార నివాస గృహంలో కలిశాను. ఆ సందర్భంగా జరిగిన సంగతిని మీకు విన్నవిస్తాను.

అప్పుడు నేను యువజన కాంగ్రెస్‌లో ఉండేవాడిని. అప్పుడు మా గజ్వేల్‌ ఎమ్మెల్యేగా గీతారెడ్డి గారు ఉన్నారు. చెన్నారెడ్డి మంత్రివర్గంలో క్యాబినెట్‌ మంత్రిగా ఉన్న ఆమెను ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి గారు తన క్యాబినెట్‌ లో తీసుకోలేదు. ఆమెకు మంత్రి పదవి కావాలనీ కోరుతూ అందుకోసం మా నియోజకవర్గంలోని అప్పటికే వివిధ పదవుల్లో ఉన్న యువజన కాం[గైస్‌ నాయకులను తీసుకొని ఒక బృందంగా నేను పి.వి.నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళాను. పి.వి. గారిని కలపి వినతిపత్రం ఇచ్చాము. మాకు అరగంట టైం కేటాయించారు.

ప్రజ్ఞాపూర్‌ సర్పంచ్‌గా మండల ఉపాధ్యక్షుడిగా నన్ను ఆయనకు పరిచయం చెయ్యగానే ఆయన నాతో అన్న మొట్టమొదటి మాట... మీ ఊరికి దగ్గరలోనే మా ఇంటి పేరుగా వున్న “పాములపర్తి అనే ఊరు నాకు చూడాలని ఉంది, ఆ ఊరికి నన్న

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఆ సెప్టెంబర్‌-2020 |

బండారు రామ్బోాహన రావు 95660 74027

'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ

తీసుకొనీఫో రామ్మోహన్‌ అన్నారు. తప్పకుండా సార్‌ అన్న నేను ఆయన కోరికను తీర్చలేకపోయాను.

మితభాషి. అలుగుటయే ఎరుంగని, కోరికలే కోరని స్థితప్రజ్ఞుదయిన వివి గారి చిన్న కోరికను తీర్చలేకపోయానే అనే బాధ నాకు ఇప్పటికీ ఉంది. ఆ తర్వాత కూదా హైదరాబాదులో పి.వి గారితో వివిధ సందర్భాలలో రెండు మూడు సార్లు కలసిన సందర్భంలో పాములపర్తి గురించి మాట్లాడుకున్నాము. ఆయనకు వీలైనప్పుడు ఎప్పుడైనా తీసుకెళ్ళాలని ప్రయత్నం చేశాను కానీ తీరని పనుల వల్ల పీవీ గారికే వీలుకాలేదు.

వివి గారితో మా గజ్వేల్‌ నియోజకవర్షానికి మరొక ముఖ్యమైన అనుబంధం ఉంది. అదేమిటంటే పీవీ నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో విద్యాశాఖ మంత్రిగా ఉండగా 1970 -71 విద్యాసంవత్సరంలో మా పక్క గ్రామమైన జగదేవపూర్‌ (గ్రామానికి వెొుదటి ఇంటర్మీడియట్‌ జూనియర్‌ కళాశాలను మంజూరు చేశారు. అప్పటిదాకా విద్యావిధానంలో (యోచ్‌. ఎస్‌.సి) హయ్యర్‌ 'సెకందరీ సర్దిఫికెట్‌ అంటే పదకొందవ తరగతి అన్నమాట. ఆ తర్వాత పియుసి 12వ తరగతి ఉండేది. జగదేవపూర్‌ జూనియర్‌ కళాశాలను పి.వి. గాదే స్వయంగా (ప్రారంభించవలసి ఉందేది కానీ అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. అప్పటికి గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రంతో పాటు పెద్ద గ్రామం. అప్పటికి మండలాల ఏర్పాటు కూడా కాలేదు. జగదేవపూర్‌ గ్రామ అప్పటి సర్పంచ్‌ అదరాసుపల్లి నరసింహరామయ్య పంతులు గారితో పి.వి. గారికి రాజకీయ స్నేహసంబంధాలు ఉండడం వల్ల గజ్వేల్‌ పట్టణాన్ని కాదని ఒక చిన్న మారుమూల పల్లెటూళ్లో జూనియర్‌ కళాశాల ఇచ్చారు. గట్వేల్‌ నియోజకవర్గంలో మాకు మొట్టమొదటి జూనియర్‌ కళాశాల అది. మేము పదవ తరగతి పాస్‌ అయిన తర్వాత ఇంటర్మీడియట్‌కి వెళ్లాలంటే అటు హైదరాబాద్‌, ఇటు సిద్దిపేట, మెదక్‌ లేక భువనగిరికి వెళ్లాల్సి ఉందేది. ఆ జూనియర్‌ కళాశాల రావడం వల్ల మా గజ్వేల్‌ తాలూకాలో పదవ తరగతి దాటి పైచదువులు చదువుకోదానికి యువతకు అవకాశం లభించింది. ముఖ్యంగా అప్పటికి పదవతరగతితోనే చదువు ఆపేస్తున్న ఆడపిల్లలకు ఇంటర్‌ వరకు విద్యా సౌకర్యం లభించింది. రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ అనే ఒక కొత్త శాఖను ఆయన ప్రవేశపెట్టారు. దానికి మంత్రిగా పీవీ గారిని ఎంచుకున్నారు. పి.వి. గారికి పనికిరాని శాఖ ఇచ్చారనీ “లూప్‌ లైన్‌”లో పెట్టారని చాలామంది విమర్శించారు కానీ మానవ వనరులశాఖకే పీవీ వన్నె తెచ్చారు. ఆ శాఖను సమర్దవంతంగా నీర్వహించిన ఆయన దానీనీ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. తర్వాత ఆ శాఖ కోసం ఎంతోమంది మంత్రులు పరితపించారు. ఆర్థిక, రక్షణ విదేశీ వ్యవహారాల శాఖ కంటే మానవ వనరుల అభివృద్ది శాఖను ఉన్నత స్థితిలో నిలిపారు. అప్పుడే నూతన జాతీయ విద్యా