పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాదు. నాకు కావాలి సంస్కృతం, కొట్టో గొప్పో ఇప్పటికీ చదువుకుంటుంటాను. అది గొప్ప రత్నాల గని. నిజమే. ఇష్టమున్న వాళ్ళు సంస్కృతం చదవవలనిందే, దానిలో ఉన్న విజ్ఞానం తెలుసుకోవలసిందే, ఆ విజ్ఞానాన్ని తెలుగులోనికి తీసుకురావలసిందే. అది కూదడదనను. అనవనర౦గా ఆ ఖాషను దిగువుతి చేయకండంటాను. తెలుగుతనం నీలుపమంటాను. అంతే...”

అలాగే కొత్త పాళీ చివరి వ్యాసం చివరలో ఇలా అంటారు: “..సాహిత్యాన్నీ పట్టి ఆ జాతీ వారి విజ్ఞానము, జీవన విధానము, ఆచారాలు, సంస్కృతి తెలుసుకోవడానికి వీలుందాలి. సాహిత్యంలో జాతి కనబడాలి. జాతికి సాహిత్యం అథ్దంలాగుందాలి.” ఇంకా అంటారు:

“తెలుగు కవి, తెలుగు రచయిత, తెలుగు ప్రజల జీవితంలో ఉండి వ్రాయాలి... తెలుగు సంస్కృతీ, తెలుగు గడ్దా యుగయుగాల నుంచి వచ్చిన తెలుగు విజ్ఞానమూ తనకిచ్చిన శక్తి, అతను తెలుగు 'ప్రజకి రుణపడి ఉన్నాడు. ఆ రుణం తీర్చాలి తన ఇష్టం వచ్చినట్టు వినియోగించుకోకూడదు. మళ్ళీ తెలుగు వాళ్ళకు తాను కొంత చెల్లించాలి” -

ఇదీ తాపీ ధర్మారావు చూపునకు ఉండదే ప్రణాళిక!

వీఠికలో ఇంకా అంటారు: “నేను ఇతరులకు నిజం చెప్పుదామని తలచాను. ఆ ఉద్దేశ్యంలో వ్రాసిన వ్యాసాలు కాబట్టి కాంత మిషనరీ మత బోధకుల పద్దతి అవలంవీంచవలసి వచ్చింది” అంటూ తన వాదనా శిల్చం గురింఛి కూడా పరిశీలించేవారికి పనిపురమాయించాడు.

“పాతదానిని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టలేము గూడాను. పాతది ఉండవలసిందే. ప్రపంచంలో మనం చూస్తూ ఉన్న అభివృద్ధి అంతా పాతదాని మీద మెరుగే గదా! తెరచాపల ఓడ ఆధారం చేసుకునే స్టేమర్లు తయారు చేసిన వారు తీగమీద వార్తలు పట్టే వైర్‌ లెస్‌ కనుక్కున్నారు... నిలిచే యోగ్యత ఉంటేనే నీలుస్తుంది. కాని తొందరపడి పారవేయడం మంచిది కాదు...” అంటూ భవిష్యత్తుకు గతానికి ఉందే లంకెను చెబుతూ ఒక సైన్స్‌ విషయాన్నీ ఎలా హాయిగా ఉపమానంగా వివరించారో గమనించండి. అడీ థర్మారావులోని సారళ్యం.

ఈ వివరణలు చూడండి: *... అందులో సంన్కృతమే ఉండనీయండి, తెలుగే ఉండనీయ్యండి, ఇంగ్లీషు, హిందూస్తానీ మకేదయినా ఉండనీయండి. ఏమైనాసదే తెలియడం ప్రధానం...” అంటారు. 1836లో రాసిన మాటలు నేటికీ చాలామందికి ఎంతో అవసరమనిపిస్తుంటుంది - కొన్ని సమయాలలో వినిపించే వాదనల రాద వింటూంటే... విషయం ఎక్కడో, జైలీ ఎక్కడో, భాష ఎక్కడో చాలా స్పష్టంగా చెబుతారు వారు. సంస్కృత సాహిత్యమే కాదు, జానపద సాహిత్యం ఏమిటో కూడా చెబుతారు ధర్మారావు. ... ఊహలకి కనబదేటట్టూ, ప్రజలకి జోథపడేటట్టూ వర్ణనలు చేసేవారు. పాటలో ఉన్న సంగతీ, ఆ వర్ణన అంతా తెలుస్తూనే ఉందేది కాబట్టి ప్రజల హృదయాలు అలా ఉర్రూతలూగుతూందేవి.”

కొన్నీ ముచ్చటలు వారి వ్యాసాల నుంచి చూడండి:

1) తెనుగు చేస్తానని చెప్పి, మరింత సంస్కృతం గుర్తు తెలియకుండా

| తెలుగుజాతి పత్రిక జవ్వునుడె ఈ 'సెస్టెంబర్‌-2020

చేయడం అక్రమం. తన పాందిత్యం ప్రదర్శించడానికి (వాసుకొనడమే అంటుంది మొల్ల - నన్నయ గురించి, (పుట 65) 2) తాను తెలుగు కోసమూ, ద్విపదల కోసమూ, తెలుగు ప్రజల గాథల కోనమూ చూచేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు ఆ నన్నెచోడుడు, పాలకురికి సోమనాథుడు మొదలైన వాళ్ళు. వీళ్ళ పేళ్లే మొన్న మొన్నటిదాకా మనకు తెలియకుండా పోయాయి. (పుట 67) 3) కవి సమయాలన్నారు, సాహిత్యసూత్రాలన్నారు, కావ్యమర్యాదలన్నారు, నాటక లక్షజాలన్నారు, వెయ్యిపేర్లు చెప్పారు. పదివేల నియమాలు దింపారు... ఇవన్నీ సంస్కృతం రేవులో నుంచే దిగుమతి. (వుట రశ) 4) పగలు కలువపువ్వులు వికసించి ఉండటం ఎంతమంది చూచారు కాదు? అవి కలువలు కావంటారా? (పుట 85) 5) తెలుగులో తెలుగు సాహిత్యాన్నీ చూపాలి. సంస్కృతం పరిచయం వల్ల మరింత అభివృద్ది పొందడానికి బుద్ధిపుట్టాలి. గానీ బానీస బుద్ది పుట్టిపోకూడదు. (పుట 89) 6) నెలకు రు. 20లు ఇచ్చి ఒక పండితుని పెట్టుకుని (సిలప్పదికారం) గ్రంథంలోని సంగతులు తెలుసుకున్నాను (ఇది 1936కు పూర్వ విషయమనీ వమనం గమనించాలి, పుట. 91) ఇవి దాని (సిలవ్పదికారం)లో తన శక్తులని చూపించాడు. ముక్టిలేని మొగతనాన్ని కనబరిచారు. స్వతంత్రం అంటే ఏమిటో తెలిపించాడు. కవి అన్న వాడికి నోరూరించాడు. (పుట 92) అరవవాళ్ళపాటివారమే కాదు, అరవవాళ్ళ కన్నా ఎక్కువ వాళ్ళమే. ఎన్నో విధాల ఎక్కువ వారమే (మనము) (పుట 94) 7) కృష్ణరాయ చశక్రవర్తినీ, ఆతని ఆముక్తమాల్యదా చూడండి. ఆ ఊహోచాతుకీ ఆ (ప్రపంచ పర్యావలోకనమూ, ఆ కవిత్వదృష్టి చూచినవాళ్ళకి అతడు (గ్రుడ్డి వ్రాతగాడు కాక, ఒక నూరు కళ్ళున్న వ్రాతగాడిలా కనీపిస్తాదే! (పుట 105) 8) పేరుగాంచిన ప్రబంధాలని మనం కొంచెం జాగ్రత్తగా చూదాలి. వాటినీ కేవలం పాఠవేయకూడదు. అలా పారవేసినట్టయితే ఆంధ్ర సారన్వత జీవనంలో మూడు, నాలుగు వందల సంవత్సరాలు వ్యర్ణమంబపోయినట్లే అవుతుంది. అంత నష్టానికి ఎవరు ఒప్పుకోగలరు? (పుట 107) 9) (గ్రంథాలలో ప్రీ పురుష సాంగత్య విషయంలోని సంగతులన్నీ మడికట్టుకుని విడిచిపెడితే బాగుండదు. (పుట 120) 10) చదివేవాళ్ళు గ్రహించకపోవడం చేత చక్కని కవిత్వం చావవలసి వచ్చింది. (పుట 132) 11) వేడినెత్తురుతో జీవయాత్ర సాగిస్తూ ఉన్న తెలుగు ప్రజలకి మనసాహిత్వ్యంలో జాగా లేకపోయింది. జావా, సుమత్రా ద్వీపాలకి వెళ్ళి వలసలు ఏర్పాటు చేసే చేవగలిగిన తెలుగు తనానికి జాగా లేకపోయింది. వదవలు కడుతూ సముద్రాలు దాటిన తెలుగు సాహసానికి జూగా లేకపోయింది. ఇంతెందుకు, బ్రతికి ఉన్న తెలుగుకు జాగా లేళఠపోయింది తెలుగు సాహిత్యంలో. (పుట 98) ఎనఖైయ్యేళ్ళ క్రితం రాసిన 'కాత్తపాళ్‌ సాహిత్య విమర్శగా ఆ సాహిత్య విమర్శలో సహనం, సమన్వయం, హేతుబద్ధత, తార్మికత, తెలుగు మీద మనకుండాల్సిన గురి - మరీ ముఖ్యంగా హాయిగా, అలవోకగా చదివేలా రాయగలగడం - వంటి కోణాలలో నేటికీ మనకు అవసరం.