పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కఇటి దాలె

॥ [

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి 9440037258

తప్పు చెయ్యదం తప్పు కాదు తప్పు చెయ్యడం తప్పు కాదు. ఏ తప్పూ చెయ్యక పోవడం తప్పు. చేసింది తప్పని తెలిసిన తరువాత కూదా అది తప్పని ఒప్పుకోకపోవడం తప్పు. దాన్ని సరిదిద్దుకోకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఆ తప్పునే పదేపదే చెయ్యడం, ఇతరుల్ని కూదా దాన్నే చెయ్యమని ప్రోత్సహించడం, తప్పు చెయ్యడం ద్వారా జీవనోపాధిని కల్సించుకోవడం, అందరికీ అదే తప్పుని చెయ్యక తప్పని పరిస్థితిని కల్పించి తాము చేసిన తప్పునే ఒప్పుగా చెలామణీ అయ్యేలా చెయ్యడం అనేది కేవలం తప్పు మాత్రమే కాదు. సామాజిక నేరం.

దాదాపుగా తెలుగువారందరూ చేస్తున్న సామూహిక నేరం ఒకటుంది. అదే మనం మన భాషపట్ల చూపుతున్న నిర్లిప్తత, నిర్లక్ష్యం, నిరాసక్తత.

భాష అనేది భావాన్ని వ్యక్తం చేసే ఒక వాహిక. అందులో ఎక్కువ తక్కువలు లేవు. ఉండవు. ఉండ కూడదు. మనం మాటలు నేర్చుకునే భాష మనకి తల్లిలాంటిది. ఒక మనిషికీ అతనీ భాషకీ మధ్యనున్న సంబంధం కూదా తల్లికీ వీడ్డలకీ ఉందే అనుబంధం లాంటిదే. అందుకే ఎవరికి వారు తమ భాష గురించి చెప్పేటప్పుడు దానీని “మాతృభాష” అనే వ్యవహరిస్తారు. ఎంత పేదరాలైనా, చిరుగుల చీరలు కట్టుకున్నా అమ్మ.., అమ్మే.! ఎంత గొప్పావిదైనా ఎంత ఇశ్వర్యవంతురాలైనా బ్రిటీషురాణిని మనం అమ్మా అని పిలవలేము కదా ?ఆవిడని మన కన్నతల్లిగా ఒప్పుకోలేము కదా ? ఒక వేళ మనం ఒప్పుకున్నా ఆవిడ మనల్ని వీడ్డలుగా ఒప్పుకోవాలి కదా ? మనం ఆవిడని అమ్మా తల్లీ అంటూ అంగలార్చినంత మాత్రాన ఆవిడ కరిగిపోయి మనని అక్కున చేర్చుకోదు కదా ? (ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నాకు సోనీయా గాంధీ గుర్తొచ్చింది. ఆవిడ అడక్కుండానే తెలంగాణా ఇచ్చిన ధీరోదాత్తురాలు అనీ ఏ రాజకీయ పకళ్షులైనా నామీదకొస్తారేమో అనే అనుమానం వచ్చింది. ఆ వెనువెంటనే ఆవిడ తెలంగాణా ఇచ్చిన తరువాత హైదరాబాదులో తెలుగువాళ్ళంతా ఎంచక్కా తెలంగాణా మాండలిక పదాల్ని వాడటానికి ఉత్సాహం చూపడం గుర్తొచ్చింది.)

భారతదేశంలో ఈనాటికీ నిరాఘాటంగా కొనసాగుతున్న బానిస విద్యావిధానానికి రూపకల్పన చెయ్యడానికే పనిగట్టుకు వచ్చిన మెకాలే కూడా భారతీయుల మాతృభాషలని కాదని ఇంగ్లీషుని మన తలమీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి వికాసక్రమంలో అతని మాతృభాష పోషించే పాత్రేమిటో ఆయనకి తెలుసు. భారతదేశంతో పోలిస్తే చాలా చిన్నదేశంలోని ప్రజలు మాట్లాదే భాష ఆంగ్లం. అది ఈ రోజు ప్రపంచ బేశాల్లో అత్యధికులు అర్థం చేసుకునే భాషగా రూపొందడం వెనుక ఉన్నది విమిటి ? వారికి వారి మాతృభాష పట్ల ఉన్న గౌరవం. దానిని విశ్వ వ్యాప్తం చెయ్యాలనే తపన. తమ వ్యాపారాలద్వారా , ఆక్రమణలూ దురాక్రమణల ద్వారా, విభజించి పాలించడంలోని మెలకువల ద్వారా తమ భాషనీ సంస్కృతినీ మతాన్నీ అలవాట్లనీ ఒక పథకం (ప్రకారం విస్తరిస్తూ వచ్చారు. వస్తున్నారు. ఏళంగా మన గుండెల్లోకే వచ్చి విడిది చేసిన ఒక అక్కరకు రాని అతిథులుగా మారిపోయారు. హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. ఆ ప్రక్రియ

| తెలుగుజాతి పత్రిక ఖవ్మునుడి సెప్టెంబర్‌-2020 |

వందల నంవత్సరాలుగా కొనసాగుతోంది. కొనసాగుతూనే ఉంటుంది. కాన్ని సందర్భాల్లో తరాలు మారుకున్నకాద్దీ అవసరార్థం రెండో భాషగానో మూడో భాషగానో నేర్చుకున్న భాషే మొదటి స్థానంలోకి రావడం అనివార్యం అయిపోతుంది. ఎలాగంటే నాలుగు వందల ఏళ్ళ క్రితం స్థానిక ఖాషలు మాట్లాడే అమెరికా సంయుక్త రాష్ర్రాల్లోనివారిలో ఎవరికీ ఇంగ్లీషు రాదు. కానీ ఇప్పుడు చాలా మందికి ఆంగ్లం మాతృభాషగా మారింది. అమెరికన్‌ ఇంగ్రీషు తనదే అయిన ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కలిగి ఉంది. అంగ్రేయులు తవు భాషకి అంతటి ప్రాచుర్యం కల్పించిన తరువాత కూదా ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకుల మాతృభాష ఆంగ్లం కాదు. అంగ్లం మాచ్చభాషగా ఉండేవారి సంఖ్య, మాండేరియన్‌ భాష మాట్లాడేవారి నంఖ్యలో వదూడవ వంతు మాతమే. అలాంటి ఇంగ్లీషు నేర్చుకోవడానికి మనం తెలుగుని నిర్లక్ష్యం చెయ్యడం తప్పో ఒప్పో అలోచించక తప్పని పరిస్థితులు ఏర్పడిన సంధి కాలమిది.

మనం ఇంగ్లీషు నేర్చుకుంటే మాత్రమే వృద్ధిలోకి రాగలమనే ఆలోచన తప్పు. ఎందుకంటే వృద్ధిలోకి వచ్చినవాళ్ళందరూ కేవలం ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల మాత్రమే ఆ స్థాయికి రాలేదు. అలాగని ఇంగ్లీషుని నిర్లక్ష్యం చెయ్యడం కూడా తప్పే. ఇంగ్లీషుని నెత్తిన పెట్టుకుని తెలుగుని కాలరాయదం తప్పు. అది ఎంతవరకూ వచ్చిందంటే, ఆంధ్రదేశంలో చదువుకున్నవాళ్ళు అసలు తెలుగు ఊసెత్తకుందానే ఉన్నత విద్యని పూర్తి చేయవచ్చు. పట్టాలు పొందవచ్చు. ఈ పరిస్థితి కేవలం తెలుగునాట తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు.

ఇంగ్లీషు మనని ప్రపంచ పౌరుడిగా చేస్తుందనే భమలు అంగ్రేయులు కల్పించినవి కాదు. మనకి మనమే ఊహించుకున్నవి. మనంత మనమే నెత్తిన రుద్దుకున్నవి. మనని ఎవరో బందీలుగా చెయ్యలేదు. మనకి మనమే కాళ్లకీ చేతులకీ బేడీలు తగిలించుకుని దాస్కంలోనే స్వాతంత్ర్యాన్ని దర్శిస్తున్నాం. లేదా స్వతంత్రంగా దాస్యాన్ని కోరి తెచ్చుకుంటున్నాం. అది ఎలా జరుతోందంటే..,

మనం ఒక ఉద్యోగంలో చేరతాం. అక్కడ మనకి ఇతర ప్రాంతాలవారితో నంబంధ బాంధవ్వాలని నెలకాల్పుకోవలని వస్తుంది. అలాంటి సందర్భాలలో అనుసంధానానికి ఉపకరించే భాష ఒకటి అనీవార్యమౌతుంది. అప్పుడు తెలుగులోనే మాట్లాదతామంటే కుదరదు. అందుకే ఆయా సంస్థలు తమ ఉద్యోగుల సామర్శానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవదానికి అనువుగా ఇంగ్లీషు భాషనీ నేర్చడానీకి తరగతులు నీర్వహిస్తాయి. ఆ తరగతుల్లో మనలో ఉన్న పదసంపదని వినియోగించుకునే విధానాలు నేర్పుతారు. (ఈవిధంగా