కనుమరుగు
స్మరణీయ సాహితీవేత్త రచయిత
రాపాక ఏకాంబరాచార్యులు
మరణాలకి అనేక కారణాలు! ఈ మథ్య వచ్చిన దారుణ కారణం అందరికీ తెలిసిందే.
సాపాత్య సమాజానికి ఎన్నో వ్యాసాలు, గ్రంథాలు రాసి, సభానిర్వహణలకు ఆర్థికంగా సైతం దోహదం చేసిన రాపాక ఏకాంబరాచార్యులు మృటి చెందడం భర్తీ చేయలేని ఒక వెలితి. అర్జాంగి చనిఫోయిన మరుసటిరోజే చనిపోవడం చూస్తే కారణం మనకు తెలిసినా ఇది ఒక 'పతీసహగమనం "లా అనిపించి గుండెల్ని తొలిచి వేస్తుంది. ఆంధ్రజ్యోతి ఆగస్టు 17వతేదీన ప్రసిద్ద రచయిత దాట్ల దేవదానం రాజు నివాళి రచన ద్వారా రాష్ట్రమంతా గల ఆయన అభిమానులకు రాపాక మృతి తెలిసింది. రచయితలు ఎన్నో గ్రంథాలు రాయొచ్చు. కాలంలో తేరి నిల్చేవి కొన్ని వుంటాయి. కులాలు, కుల సంస్కృతుల అధ్యయనంలో విశ్వబ్రాహ్మణుల నతకలోకి కోవిక్ దిగింది పాత్ర బహుముఖకాంతి భరితం, “విశ్చబాహ్మణ సర్వస్వం” అనే ఆయన శ్రమైక సాధనా రచనలు బృహత్‌సంపుటాలుగా వచ్చి చరిత్రలో నిలిచాయి ఎప్పుడూ నిలుస్తాయి కూడా. ఎనభైఏళ్ళలో ఎన్నో రచనలు చేశారు. “అవధాన విజ్ఞాన సర్వస్వం” అనే మరొక బృహద్గ్రంథం ఆయన పరిశోధనాధిషణత్వానికి పట్టుగొమ్మ. అనేక పత్రికల్లో అవధానులపై, అవధానాలపై, సాహిత్య అంశాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. సాహిత్య సమాజపు చూపు మరింతగా ఆయన రచనలపై ప్రసరిస్తే త్రవ్వుకోవలసిన అంశాలైతే చాలానే వున్నాయి. అందరి. వాడుగా, సాహిత్య మమేకత్వ సుగుణశీలిగా, సదా స్మరణీయులు. ఈనడు మమధునా పంతుల వారి శతజయం త్యుత్సవాలు బొంబాయిలో జరిపించడంలో రాపాక వారిదే ఏకపాత్ర అన్నా అతిశయోక్తి కాదు. దృశ్య, శ్రవణమాధ్యమా లకు కొందరు. రచయితల గ్రంథాలకు రాపాకవారు ఒక గ్రంధబాండాగారి పాత్ర నిర్వహించారని, సాహిత్వ సమాచర నిధిగా ఉపకరించారని చాలా తక్కువ మందికి తెలుసును. ఆయన స్మరించితీరవలసిన సాహిత్యవేత్త, రచయిత, మధునాపంతుల ప్రేమికుడు. ఈయనదీ మధునాపంతులవారి పల్లెపాలెమే. వీరిద్దరి మధ్య బంధుత్వం మించిన ప్రేమలుండేవి.
కవిత
మనసే ఒక దీపం
పాటలో కరోనా కలిసింది
మధురంగా లేదు
నడకలొకి కొవిడ్ దిగింది
ధారాళంగా లేదు
భయమూ ధైర్యమూ కలిసిన
అసహజ మిశమం
సకల సందేహాల ఆశయం.
వీరరసంగా
మారవలసిన ఉత్సాహం
ముద్ద గట్టుకపోతున్నది
జీవితం ఎప్పుడూ
ఇంత అర్జవిహీనంగా లేదు
సౌందర్యానికి కాలమానం
దృష్టికోణం కానేకాదు
కాలం గడుస్తుంది గానీ
కస్తీగా తిరుగుతున్న గానుగలా ఉంది
గడియారం కదుల్తుంది గాని
స్తబ్దతకు వ్యాఖ్యానంలా ఉంది
చెదలు పట్టిన ఉదయం
మొదలు కాని కావ్యంలా ఉంది
నిజానికిది జీవితం కాదు
మసిబారిన మరకతం
ఇంత చీకటిలో కూడా
మనస్సొక్కటే
చెక్కుచెదరనీ నక్షత్రంలా మెరుస్తుంది
దీన్ని ఆసరాతోనే
ఆవలి తీరాన్ని స్వప్నిస్తున్నాను
- డా.ఎన్. గోపి 93910 28496
అర్జాంతరంగా అదృశ్యమైన 'మణిహారం '
పట్నాయకుని వేంకటేశ్వరరావు
ఇంటినే తన వి.ఆర్.ఛానల్‌కి కార్యాలయం చేసుకున్నారు. అన్నిటా చేదోడైన అర్ధాంగి ఇందిరనీ, కుమార్తెనూ కార్యకర్తలుగా మలిచారు. హైదరాబాదు సాక్షి దినపత్రికలో ఓవైపు డిప్యూటీ న్యూస్ ఎడిటరుగా సక్రమంగా ఉద్యోగం నిర్వహించుకుంటూనే వి. ఆర్. ఛానల్ ద్వారా “వారం వారం మణిహారం” కార్యక్రమాలతో తెలుగు భాషకు,సాహిత్యానికి, సంస్కృతికి ఒక తపనతో ఒక అంకతభావంతో నిస్వార్ధంగా 'సేవ చేశారు. తెలుగు సామెతలు, నానుడులు, వేమన పద్యాలు, తెలుగుపై పాటలు, పెద్దలతో మాట్లాడించడాలు- ఇటువంటివాటితో ఒకటీ రెండూ కాదు... వందవారాల కార్యక్రమాలు హుందాగా నిర్వహించారు.
శ్రీకాకుళం, కాపుగోదాయవలసకు చెందిన సంతబొమ్మాళిగ గ్రామంలో పుట్టిన వి.ఆర్ తెలంగాణాలో స్థిరపడ్డారు. చడీ చప్పుడూ చేయకుండా వెళ్ళిపోయిన యీయన్ని ఆయన రాసిన “గుండెచప్పుళ్ళు 'లోనే చూసుకోవాలి, యింక.
- - సన్నిధానం నరసింహశర్మ 9292055531