పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'కెలుగు బోధన

లు. టో సి. వి. క్రిష్ణయ్య 9396514554

తెలుగు నేర్పడంలో మెలకువలు - 2

(గత సంచిక తరువాయి...)

గత సంచికలో మన పిల్లలు తెలుగు ఎందుకు ధారాళంగా చదవలేకున్నారో, తవ్వుల్లేకుందా రాయలేకపోతున్నారో కొన్ని కారణాలు తెలియజేశాను. తెలుగు బాగా నేర్చుకోడానికి ఆ సమస్యలు పరిష్కరించుకాంటే సరిపోతుంది. కానీ అవి అంత తేలిగ్గా పరిష్కార మయ్యే సమస్యలు కావు. వాటిలో కొన్ని మనచేతిలో లేనివి కూడా ఉన్నాయి.

బయట ఎవరైనా స్వచ్చందంగా తవుకుతాము నేర్చుకోవాలనుకొనే వాళ్లకు, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉందే వాళ్లకు బోధనకు సంబంధించిన అవగాహన లేనివాళ్లు కూదా సులభంగా నేర్చగల్లేటట్లు వాచకాలు ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్చుకునేటట్లు ఉందాలి. ఏరోజు ఏమి నేర్పారో సులభంగా గుర్తుందేటట్లు ఉండాలి. ఇటు నేర్చేవాళ్లకు అటునేర్చుకానే వాళ్లకు నులభంగా ఉందాలి. నేర్చుకొన్నది మరిచిపోళుందా ఉండేటట్లు, నేర్చుకొన్న అక్షారాలు నీరంతరం ఎదురవుతూ ఉందాలి. విసుగు పుట్టకూడదు. అది ఎలాగో చూద్దాం.

ఏ. భాషలో లిపి నేర్చుకోవడానికైనా మూడు పద్దతులు ఉంటాయి. 1. అక్షర పద్ధతి. 2. పద పద్దతి. 3.వాక్య పద్దతి. ఇందులో మనం మొదటి రెండు పద్దతుల గురించి తెలుసుకొందాం. మూడవ పద్దతి పెద్దవాళ్లు నేర్చుకోవడానికి ఉపయోగ పడుతుంది. దాన్నీ వదలేద్దాం. 1.అక్షర పద్దతి :- వర్ణమాలలో ఉండే అక్షరాలన్నీ నేర్చి, గుణింతాలు నేర్చి, వత్తులు నేర్పి, పదాలు వాక్యాలు చదవడం నేర్పే పద్దతి అక్షర పద్దతి.

అక్షర పద్ధతిలో లోపాలు :

1. ఉపయోగం ఉన్నా లేకపోయినా అన్ని అక్షరాలు నేర్పించడం... రుుఇ,ఛ,థ,జ ఈ అక్షరాలతో పిల్లలకు తెలిసిన పదాలు ఏమున్నాయి. ఇంకా చాలా అక్షరాలతో ఒకటి రెండు పదాలు దప్ప ఎక్కువ పదాలు పిల్లలకు తెలిసినవి రావు. పైపెచ్చు ఇవి చాలా కష్టంగా కూడా ఉంటాయి.

2. అక్షరాలకు సంబంధించిన ఏదో ఒక రకమైన లింకు మెదడులో ఉండాలి. కాని అక్షర శబ్టాలుకాని, వాటి ఆకారాలుగాని మెదడులో ఏమీ లేవు. అందువలన నేర్చుకొన్న అక్షరాలు త్వరగా మెదడులో చేరవు. చేరినా వెంటనే చెదిరిపోతూయి. చాలా రోజులు అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసం మొరటుగా ఉంటుంది.

3. అక్షరాలు విడివిడిగా దేనికై అది నేర్చుకొనేటప్పుడు ముందు నేర్చుకున్నవి మరచిపోతూ ఉంటారు. ఎందుకంటే అవి మళ్లీ మళ్లీ ఎదురుపడవు. ప్రత్యేకంగా మొదటి నుంచి గుర్తు చేసుకుంటూ రాస్తూ మరచిపోకుండా అబ్యానం చేనర్హా ఉండాలి. చాలా ఆలస్యమవుతుందని పిల్లలు ఈపని చేయరు. టీచరు చేయించరు.

4. న్యాయంగా అక్షరాలు గుర్తించడం చదవడం వచ్చిందాకా

| తెలుగుజాతి పత్రిక ఖవ్మునుడి సెప్టెంబర్‌-2020 |

రాతలోనీకి పోకూడదు. కానీ రాయడంద్వారా అక్షరం చదవడం నేర్పించడానికి పూనుకొంటారు. పలకమీవ అయితే దిద్దాలి. నోట్‌ బుక్‌ లో ఇంపోజిషన్‌ రాయాలి. పిల్లలు త్వరగా విసిగిపోతారు. విసుగు ఒకరకమయిన అలసటను కోపాన్ని తెప్పిస్తాయి. పిల్లలకు నిరంతరం సృజనాత్మకంగా ఉందాలి. 'క్రీడదలా ఉందాలి. ఇందులో ఎలాంటి క్రీడగాని సృజనగాని లేవు [3%/4/లు (లిసనింగ్‌, స్పీకింగ్‌, దీడింగ్‌, రైటింగ్‌) వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం నేర్చుకోవడంలో ఇది శాప్రీయమ్రైన క్రమం. దీన్ని వదలి రాతతో దిద్దడంతో ప్రారంభించడం ఎంతటి అశాస్రీయమో గమనించండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేర్చేవాళ్లకు ఇది సులభం. రెండక్షరాలు రాసిచ్చి వెళ్లి దిద్దుకోండి పదిసార్లు రాయండి అని పంపిస్తారు. కనీసం ఈ అక్షరాలు నువ్వు చూడకుండా రాయాలి - వీటినీ చదవాలి నీ ఇష్టం అనేమాట చెప్పినా పిల్లలు వాళ్ల తంటాలు వాళ్లు పడతారు. ఇది కూడా చేయరు.

5. అక్షరాలన్నీ దేనీకది నేర్చుకొన్నందువలన సగం అక్షరాలు ఒకదానీబదులు మరొకటి చదువుతూ ఉంటారు. ఒక్క పదమూ చదవలేరు. శలవులకు వెల్లి వచ్చిన తర్వాత ఎక్కువశాతం మరచిపోతూ ఉంటారు.

6. ఇలా 1,2 తరగతుల్లో సరిగ్గా నేర్చుకోకుందానే పైళ్లాసులకు వెళుతూంటారు. 1,2 తరగతుల్లో చెప్పిందేదో చెప్పాం. ఇంక చెప్పం అన్నట్లు మూడవ తరగతి సిలబస్‌ చెబుతూ -1,2 నేర్చుకోకుందానే వచ్చారని గొణుగుతూ ఉంటారు టీచర్లు. 8వ తరగతి సిలబస్‌ అందుకోలేరు. 1,2 తరగతుల్లో నేర్చుకోవలసిందేదో అదీ నేర్చుకోరు. బడికొచ్చి పిల్లలు టీచర్లు నటిస్తూ ఉంటారు. ఎక్కడో ఒకచోట ఒక గట్టి నిర్ణయం తీసుకోరు. ఎప్పుడైనా పిల్లలకు చదవడం రాయడం నేర్చించాల్సిందే అని గట్టి నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది? అసమర్ధ అవివేకపు విద్వాధికారుల అజ్ఞాన ఫలితమే ఇది.

7. పిల్లల్లో దాపరికం, సిగ్గు భయం, కాపీ కొట్టడం వంటి అవలక్షణాలన్నీ ఏర్పడతాయి.

& మరి ఒకప్పుడు ఈ అక్షర పద్దతిలోనే గదా నేర్చుకున్నారు. ఇప్పుడెందుకు సాధ్యంగావడం లేదు. ఒకప్పుడు కూడా బడిలో చేరిన చాలామంది నాకు చదువురాదనీ బడిమానేని వ్యవసాయపనుల్లో కుదురుకొనేవాళ్లు. అప్పుడు సాంప్రదాయంగా చదువుకొన్న కుటుంబాలునుంచి వచ్చినవాళ్లూ, తల్లిదండ్రుల చద్ధకల్ష్లిన పిల్లలు నిలబడదేవాళ్లు. అంతేగాదు, భాష గణితాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు. మిగిలిన సబ్జెక్టులకు అంత (ప్రాధాన్యత ఉందేది కాదు. ఇప్పుడు క్రింది తరగతులనుండి తెలుగుతోపాటు ఇంగ్లీషు, హిందీ మరో రెండు భాషలు నేర్చుకోవాలి. ఇతర సబ్జెక్టులకు ప్రాధాన్యత పెరిగింది. గతంలోలాగా తెలుగు ఒక్కదానీమీద మాత్రమే మనస్సు పెడితే చాలదు. - ఇన్ని కారణాల వలన సులభంగా, తొందరగా పిల్లలు తమక్రైతాము నేర్చుకొనే పద్ధతిలో వాచకాలు ఉంటే ఎంతో