పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేటి కాలం విద్యార్థుల తీరు మార్చుకోవాలి. తెలుగు అంటే చదువు వరకే కాదని వారి జీవన విధానంలో ఒక భాగమని, వారసత్వ సంపదగా ముందు తరాలకు అందించాలని వారు గ్రహించాలి. తెలంగాణలో గిరిజన మాతృభాషల్లో విద్యాబోధన: నూతన విద్యా విధానం ముసాయిదాలోనీ అంశాలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం మాతృభాషలో చదవాలని మొదటి తరగతిలో గిరిజన భాషలైన కోయ, గోండు, లఅంబాడ, కాలామి భాషల్లో వాచక పుస్తకాలను తీసుకు వచ్చింది. ఈ వాచకాలు తెలుగు లిపిలోనే ఉంటుంది. కానీ భాష మాత్రం ఆయా తెగల మాతృభాషలు. ఈ విధానం గిరిజన విద్వార్థులకు ఖాషపై ఆసక్తి పెంచటానికి, వారి మాతృభాషలో ఆలోచించి, సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి, వారిలో గ్రాప్‌ జెట్స్‌నీ తగ్గించటానికి దోహదపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నదుస్తున్న 1,426 గిరిజన పాఠశాలలో 2020-21 విద్యా సంవత్సరానికి కూడా గిరిజన మాతృభాషలైన కోయ, గోండు, లంబాడ, కాలామిలలో వాచకాలను అందుబాటులో తెచ్చేలా చేశారు. వారి మాతృ భాషలోపాఠాలు బోధిస్తే విద్యపై ఆసక్తి పెరిగి సులువుగా అర్ధం అవుతుంది. విద్యార్థుల ర్రాప్‌ బెట్స్‌ కూడా తగ్గుతాయి. తల్లిదండ్రులకు కూడా పాఠత్యాంశాలలోని విషయాలను తమ పిల్లలకి వివరించె అవకాశాలున్నాయి. ముఖ్యంగా గిరిజన తెగల నంస్కృృతి - సంప్రదాయాలు, పండుగలు, వరినరాలతో కూడిన పెంబంటింగ్బ్‌తో ముద్రించటం వల్ల విద్యార్థులకు చాలా ఇష్టంగా చదువుతున్నారనీ ఉపాధ్యాయులు కూదా వెల్లడించారు. నూతన విద్యావిధానం: మాతృభాషల అమలులో సవాళ్లు కేంద్రం ప్రకటించిన ఎన్‌ఈపీ ముసాయిదాలో మాతృభాషకు ప్రాధాన్యమిస్తూ నీర్ణయం తీసుకున్న నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రం ప్రకటించిన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఐదోతరగతి వరకూ మాతృభాషలోనే విద్యావిధానం అమలు సాధ్యమేనా? ఈ డిమాండ్‌ 1964 నుంచే ఉన్నా పలు కమిషన్లు, కమిటీలు సిఫారసులు చేసినా ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదు? త్రిభాషా సూత్రం విఫలమవ్వదానికి కారణాలేంటి?. 1991 ఆర్థిక సంన్మరణల తర్వాత దేశంలో (డైవేటు, కార్పొలేట్‌, అంతర్జాతీయ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇప్పటికిప్పుడు మాతృభాషలో ప్రాథమిక విద్యను అందించేందుకు అవి సిద్ధంగా ఉన్నాయా? కొన్ని రాష్ట్రాలైతే ప్రభుత్వ బడుల్లోనూ విద్యలో ఇంగ్లీష్‌ మాధ్యమాలకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడు ఆ రాష్ట్రాలు మాతృభాషకు 'ప్రాధాన్యమిస్తాయూ? ఈ సివారసు చేసిన కమిషన్‌ చైర్మన్‌ కస్తూరి రంగన్‌ మాతృభాషలో ప్రాథమిక విద్యతోనే విద్యార్థులు సైన్స్‌, గణితం సబ్జెక్టులను అర్థం చేసుకుంటారని, బేదంటే వావ్‌ జెట్లు పెరుగుతాయంటున్నారు. జపాన్‌ వంటి దేశాల్లో విద్యావ్యవస్థ విజయవంతం కావటానికి అదే కారణమన్నారు. అయితే కేంద్ర విద్యాశాఖ మాత్రం రాష్ట్రాలదే తుది నిర్ణయమని చెబుతోంది. దీంతో “మాతృభాషలో విద్యాబోధన అమలవుతుందా? కొఠాఠీ కమిషన్‌ మొదలు పలు కమిషన్లు కమిటీల ప్రతిపాదనల్లాగే అదీ | తెలుగుజాతి పత్రిక జవ్నునుడి ఈ సెప్టెంబర్‌-2020 |

బుట్టదాఖలవుతుందా? తల్లిదండ్రులు ఇంట్లో రెందు వేర్వేరు భాషలను మాట్లాడే పిల్లల సంగతేంటి? అలా ఉంటే వారి మాతృభాషగా ఏమి వరిగణించబదడుతుంది? స్థానిక భాష స్వయంచాలకంగా మాతృభాషగా మారుతుందా? బదిలీ చేయగల ఉద్యోగాల్లో తల్లిదం[ద్రులు ఉన్న పిల్లల గురించి ఏమిటి? వారి బోధనా మాధ్యమం స్థానిక భాష ఎలా అవుతుంది? వారి జోధనా మాధ్యమాన్ని ఎంచుకోవడానికి విద్యార్థులకు ఎంత స్వేచ్చ ఇవ్వబడుతుంది? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

1968లో ప్రవేశపెట్టిన త్రిభాషా సూత్రం సరిగా అమలు కాలేదనీ 1992లో ఏర్పాటు చేసిన కమిటీ చెప్పడం గమనార్హం. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో దక్షిణాది భాషలను బోధించడం లేదని పేర్కొన్నది. (వైవేటు, కార్బొనేట్‌, “ఇంటన్నేషనల్‌ొ స్యూళ్లలో మాతృభాషలో జోథన ఓక సజ్జెళ్టుగానే పరిమితమైంది. ప్రభుత్వ బడుల్లో కొంతవరకు అమలైనా ఇప్పుడు కాన్ని రాష్ట్రాలు ఆంగ్లమాధ్యమ చదువుపై మొగ్గుచూపుతుండటంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా కేంద్ర మంత్రివర్గం అమోదం అనంతరం తమిళనాడు లాంటి రాష్ర్టాల్లో విమర్శలు (ప్రారంభమయ్యాయి. కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన నూతన విద్యావిధానానికి 1964 నాటి కాఠారీ కమిషన్‌ సిఫార్సులకు సారూప్యత ఉంది. మాతృభాషకు ప్రాధాన్యత, వృత్తివిద్య కోర్సులు, సైన్సుకు ప్రాధాన్యత, వర్సిటీల్లో పరిశోధనలకు పెద్దపీట, దేశ జీడీపీలో 6% నీధులను విద్యకు కేటాయించడం లాంటి అనేక అంశాలు అప్పటి సిఫార్సులోనూ ఉన్నాయి. నాడు ఉన్నత విద్యలోనూ మాతృభాష అమలుచేయాలని సిఫారసు చేశారు. ఇప్పుడు కస్తూరి రంగన్‌ కమిషన్‌ ఐదవ తరగతి వరకు మాతృభాష తప్పనిసరి అనీ సిఫారసు చేసింది. ఇది సలవావే. కేంద్ర విద్వాశాఖ మాతృభాషస్థానిక భాషలో ఐదో తరగతి వరకూ విద్యాబోధన ఉండాలనేదే జాతీయ విద్యావిధానం ఉద్దేశమని, అయితే అది సలహా మాత్రమేనని, తప్పనీ సరి కాదనీ చెప్పారు. త్రిభాషా విధానం ఉంటుందని, నీర్ణయాధికారం మాత్రం రాష్ట్ర 'ప్రభుత్వాలదేనన్నారు. ఏ భాషనూ ఎవరిపైనా రుద్దడం లేదు. బోధనా మాధ్యమంలో ఏ భాషనైనా ఎన్నుకోవచ్చు అని నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిషన్‌ చైర్మన్‌ కస్తూరి రంగన్‌ అన్నారు. ఈ సలహాను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతరవరకు అమలు చేస్తాయన్నదే భవిష్యత్తులో తెలుస్తుంది. నూతన విద్యా విధానంలో మాతృభాష లేదా స్థానిక భాషలో 5వ తరగతి వరకు విద్యా బోధన జరగాలని, రెండవ దశలో 8వ తరగతి వరకు దానిని పొడగించాలని ప్రతిపాదన పేద, మధ్య తరగతి వర్ణాల పిల్లలకు నష్టం కలుగుతుంది. ఒకవైపు పిల్లలకు ప్రాధమిక స్థాయి నుండి ఇంగ్లీష్‌లో విద్యా బోధన అందించి వారికీ ఉన్నత అవకాశాలు కల్పించాలన్న కోరిక చాలా మంది బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రులలో బలంగా ఉన్న నేపథ్యంలో ముందుకు సాగుతున్న వివిధ రాష్ట్రాలకు కొత్త విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ప్రతిబంధకంగా మారుతుందని వారి అభిప్రాయం.

ప్రజలను వైతన్య పరిచి ప్రాథమిక స్థాయివరకు అన్నీ పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యనందించేలా కేంద్ర, ర్యాష్ట ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం తక్షణావసరం. మాతృభాషలో

తరువాయి బెకివ పుటలో.......