పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్‌ో విద్యావిధానం

కందగట్ల శ్రవణ్‌ కుమార్‌ 9908848592

జాతీయ విద్యావిధానం: తెలంగాణలో మాతృభాష ప్రాధాన్యం: సవాళ్లు

తెలంగాణ రాష్ట్రంలో పై ప్రైవేట్‌ ప్రభుత్వ పాఠశాల్లో తెలుగు మాధ్యమం మాయమవుతోంది. కార్బోరేట్‌ విద్యానంస్థల్లో మాతృభాషలకు ప్రాధాన్యత శూన్యమేనని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఇప్పటికే ఎక్కువ శాతం పాఠశాలల్లో అంగ్ల మాధ్యమమే కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల్లో విద్యాసామర్థ్యాల స్థాయి తెలుసుకొనుటకు ప్రభుత్వ, (పైవటు బడుల్లో నిర్వహించిన వివిధ సర్వేల్లో అంగ్ల మాధ్యమ విద్యార్థుల స్థాయి తల్లిదండ్రులు ఆశించినంతగా, ప్రభుత్వం నిర్దేశించిన స్థాయికి చేరుకోలేదని తేలింది. అందుకనే నూతన 'జాతీయ విద్యావిధానంపై తన అభిప్రాయం తెలుపుతూ జెలంగాణ ప్రభుత్వం “ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని చెప్పింది.

నూతన జాతీయ విద్యావిధానం వల్ల ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్‌ భాష దాస్యం నుండి విముక్తి లభించగలదన్న ఆశలు పుడుతున్నాయి. నూతన జాతీయవిద్వావిధానం ముసాయిదాలోని అంశాలు పాటిస్తూ క్రమంగా రాష్ట్రంలోని అన్నీ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను మాతృభాషా మాధ్యమంగా వాత్రవే బోదించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. బ్రిటిష్‌ రాజకీయ దురాక్రమణ నుండి దేశానికి విముక్తి కలిగినప్పటికీ ఆంగ్లభాషా ప్రాబల్యం నుంది దేశ ప్రజలకు విముక్తి కలుగకపోవడం దశాబ్దాల వైపరీత్యం. బ్రిటీష్‌ వాళ్ళు మన దేశాన్ని పాలించిన రోజులలో దేశంలోని మేధావులలోను విద్యావంతులలోను ప్రన్ఫుటించిన భారతీయ భాషాఖిమానం వారు నీష్మమించిన తరువాత క్రమంగా అంతరించిపోవదానీకి కారణం ఖావదాస్యం. ఈ భావదాస్యం నుండి విముక్తి కలుగుతోందని, (కవుంగా భారతీయ ఖాషలకు విద్యాబోధనలో ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తున్న తరుణంలో ప్రపంచీకరణ వాణిజ్య వ్యవస్థ మన నెత్తికెక్కి కూర్చుంది. ప్రపంచీకరణ ఫలితంగా విద్య వ్యాపారం అవ్వటం ఒక వైపరీత్యమే. ఆంగ్లభాషా మాధ్యమ జోధన అట్టడుగు స్థాయి నుండి మొదలవడం చెందవ వైపరీత్యం. ఫలితంగా అమ్మను మరచిన పిల్లలు మమ్మీ అనీ నామ జపం చేస్తున్నారు. బ్రిటిష్‌ వారు మన దేశం నుండి వెళ్ళిపోయిన తరువాత అనేక దశాబ్టాల పాటు కె.జి నుండి పి.జి వరకు భారతీయ భాషలలో, మాతృభాషలలో విద్యాబోధన జరగాలనే ఉద్యమాలు, వాదనలు వచ్చాయి. ప్రభుత్వేతర, ప్రభుత్వ విద్యా సంస్థలలో ఇంగ్లీష్‌ మీడియంతో పాటు మాతృభాషలలో సైతం ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్వాబోధన మొదలైంది. హిందీ భాషను మాట్లాడే రాష్ర్టాల్లో ఇంగ్లీషు మీడియం దాదాపు అరుదైపోయింది. ఇతర రాష్ట్రాలలో సైతం ఇంగ్లీషు మీడియంలో చదివిన వారికంటె మాతృభాషలు మాధ్యమంగా విద్య నేర్చుకున్న వారి సంఖ్య అధికమైంది. అఖిల భారత సేవలకు సంబంధించిన పోటీ పరీక్షలను సైతం తెలుగులోను

| తెలుగుజాతి పత్రిక ఖవ్మునుడి సెప్టెంబర్‌-2020 |

ఇతర ప్రాంతీయ భాషలలోను రాసిన అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇలా ఆంగ్గంతో సమానంగా భారతీయ భాషలు వికసించడం మూడు దశాబ్దాలుగా కొనసాగింది. న్యాయ స్థానాలలో తెలుగును, ఆయా (ప్రాంతాలలో ఆయా ప్రాంతీయ భాషలను ఉవయోగించాలన్న ఉద్యవు స్పూర్తి కూడ విస్తరించింది. తమిళనాడులో జిల్లా న్యాయస్థానాలలోను, కింది స్థాయి న్యాయ స్థానాలలోను ఆ రాష్ట్ర ఖాష తమిళం అధికార భాష అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కూడ తెలుగును సర్వ ప్రభుత్వ రంగాలకు విస్తరింప చేయాలన్న ఆర్భాటం జరిగింది. కానీ ఈ ఆర్భాటమంతా చ్రవంభబీకరణ మొదలైన తరువాత ఆవిరి అంబపోయింది. ప్రపంచీకరణ ఫలితంగా దేశాల సరిహద్దులు చెరిగిపోయాయన్న (భాంతి పెఠిగింది. అంతర్జాతీయ సమాజాల్లో ఉపాధి పొందడానికి ఆంగ్లభాష మాత్రమే కాక ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన కూడ అనివార్యం అన్నది గత కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రచారం. అమెరికా యాసలో ఇంగ్లీషు మాట్లాడటం వల్ల మాత్రమే హుందాతనం, గౌరవం, ఆర్థికస్థాయి, స్టేటస్‌ పెరుగుతాయనే అఖిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దీనికి కార్పోరేట్‌ వ్యవస్థ తమ స్వలాభాల కోసం ఈ అభిప్రాయాన్ని మరింత బలపరిచింది. ఇదంతా ప్రపంచీకరణ మాయాజాలంలో భాగం అనీ ప్రచారం జరిగింది. అందువల్ల గ్రామీణ నిరుపేదలు సైతం తమ పిల్లలను మూడవ ఏటనుంచి ఇంగ్లీషు మాథ్యువు బడులకు పంపించడం వెబదలటైంది. కార్పాలేట్‌ యాజమాన్యాలు కాన్వెంట్‌ స్థాయి నుండి కాలేజీ స్థాయి వరకు భారీగా వీజులను వనూలు చేన్తున్నారు. అయినప్పటికీ కూలి వనీ చేసుకునేవారు సైతం తమ పిల్లలను డ్రైవేటు ఇంగ్లీష్‌ స్ఫూళ్లకే పంపిస్తున్నారు. ఇంగ్లీషును నేర్చుకొని విదేశాలకు వెళ్లి ఉద్యోగాలను చేయాలన్నదే అందరి ధ్యేయం కావడానికి సమాచార సాంకేతిక రంగాల్లో వచ్చిన విప్లవ విస్పోటనాలు కారణం.

(గ్రామాల్లో నీరక్ష్యరాస్యులు సైతం మొబైల్‌ఫోన్లు వాడుతున్నారు. తద్వారా ఇంగ్లీషు పదజాలానికి అలవాటు పడిపోయారు. ఒకప్పుడు థమిక ఉన్నత పాఠశాలల విద్యార్థులు తెలుగులోను ఇతర ప్రాంతీయ భాషలలో నేర్చుకున్న పదాలకు ఇంగ్లీషుకి సమాన పదాలను గురించి వెతికారు. నితుంటువులను తిరిగేసారు. ఇతరులను, ఉపాధ్యాయులను అడిగేవారు. ఇప్పుడు మొత్తం తలకిందులైంది. నిజం చెప్పాలంటే నేటి విద్యార్థులకు కాంతమందికి తెలుగు చదవటం, రాయటం కూడా రావట్లేదు. వారు తెలుగుని ఒక సబ్జెక్టుగా మాత్రమే అనుకోని పరిక్షల కోసం చదివి ఆ తరువాత చేతులు దులుపుకుంటున్నారు. ఉన్నత విద్యలో తెలుగుతో పనిలేదు అని భావించి స్కూల్‌ దశలో నుండే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. వాడుక భాషలో పదాల అర్దాలే వారికి తెలియటం లేదు. స్వచ్చమైన మాతృ భాష మాట్లాడితే తెల్లమొహం వేస్తున్నారు. తెలుగు భాషపై