పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంగ్ల భాషకు, హిందీ భాషకు తమ మాతృభాషకన్నా మెరుగైన భాష అనో, అభివృద్ధి చెందిన భాష అనో మిథ్యా గుర్తింపుని ఒకదాన్ని తగిలించి అక్కడి జనానికి అమ్మే ఉపాధ్యాయురాలు కూదా భాషలు కనుమరుగవటానికి కారణం. ఇక క్రిస్టియన్‌ మిషినదీలు సచేసరి, మొదటి తరం కైస్తవులకు వారి వారి మాతృభాషల్లో మతబోధథ చేసి, వెల్సిగా రెండవ, వవూడవ తరం వారికి ఆంగ్లంలో వ్యవహరించేలా ప్రోత్సహిస్తారు.

పిల్లల మాతృభాషలలోనే 'పాథమిక విద్య అన్న చట్టం ఈశాన్య రాష్ట్రాలలో అమలుకు నోచుకోవటం లేదు. అందుకు అదనంగా జనజాతుల పాఠ్యపుస్తకాలలో పాఠాలు వారి జీవనాన్ని పతిభింబించవు. ప్రధాన భాషలో ఉన్న పుస్తకాలను యథాతథంగా అనువాదం చేయడమే కానీ, అల్పన౦ఖ్యాకులున్న భాషల్లో పాఠ్యాంశాలు రూపొందించడం జరగటం లేదు.

భారతదేశం మొత్తం మీద ఆకాశవాణి వార్తల ప్రసారాలు 120 భాషల్లో జరుగుతాయి, కానీ వార్తా పత్రికలు మాత్రం 85 భాషల్లోనే ఉన్నాయి. ఇదీ భాషలకు మన ప్రభుత్వాలు ఇచ్చే విలువ. ఇంటర్నెట్‌ లో ఎంత ఆంగ్రేతర భాషలు చొచ్చుకొస్తున్నా సమాచారం మాత్రం ఆంగ్లాధారిత పాఠ్యం నుండే వస్తుంది. దేశీయ సమాచారం, దేశీయ సంస్కృతి చాలా వరకూ ఇంటర్నెట్‌ లో చేరలేదు. ఉన్న సమాచారమంతా ఆంగ్ల వాళజ్ళుయానికి ఆయా భాషల్లో చేసిన అనువాదమే. ఇది మఠీ ముఖ్యంగా అందరికీ కావాల్సిన కాల్చనేతర సాహిత్యంలో, పరిశోధనా సాహిత్యంలో అధికం. రాజ్యాంగంలో జాబితాగా ఉన్న భాషలు, జాబితాలో లేని భాషలు అన్న అసమానత జనజాతుల భాషలకు అపార నష్టం కలిగిస్తోంది.

అది నుండి విధాన పత్రాలకే పరిముతమయిన విద్యా విధానాలు:

1949 లో నాటి భారత ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ప్రకటన (ప్రకారం ప్రాథమిక స్థాయి వరకూ విద్యార్ధికి తన మాతృభాషలోనే విద్య అందాలి, లేదా ఒక వేళ విద్యార్థి మాతృభాష 'ప్రాంతీయ/ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత భాషకు వేరుగా ఉంటే, ఆ మాతృభాషలో మాట్లాడే ప్రతి 40 మంది విద్యార్థులకు ఆ భాషలో బోధన చేసే కనీసం ఒక ఉపాధ్యాయుడిని/ఉపాధ్యాయురాలిని నియమించాలి. 1952 నాటి మాధ్యమిక విద్యా కమిషన్‌ వారు పైన్థాయి (ప్రాథమిక విద్యలో మాతృభాషకు తోడుగా హిందీ, ఆంగ్లం భాషలను కూడా ప్రవేశపెట్టాలని కోరారు. 1956లో కేంద్ర విద్యా సలహా బోర్డ్‌ వారు (పతిపాదించిన ద్విగతిబాషా నూతధాన్ని 1961లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంతో అమలులోకి తెచ్చారు. 1968లో (తిభాషాసూత్రంలో మార్పులు చేస్తూ హిందీ ప్రాంతం వారు మూడవ భాషగా మరేదైనా భారతీయభాషను నేర్చుకోవచ్చనీ అమలుచేసారు. ఆ (త్రిభాషాసూత్ర చట్టాలు, దానీఅమలువిషయం మనందరికీ తెలిసినదే. ఇన్నేళ్ళలో జనజాతుల పిల్లలకు వారి ఇంటి భాష నుండి 'పాంతీయు ఖావకు మార్చటాన్ని గురించి మర్చిపోయి వ్యవహరించారు పాలకులంతా. జనజాతుల బాషల్లో, వారి సంస్కృతి, కట్టుబాట్లు ఆధారం చేనుకుని బోధనాంశాలు రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది.

ఇదే ఆశయంతో పని చేస్తున్నట్టు జాతీయ విద్యా విధానం

| తెలుగుజాతి పత్రిక ఖువ్చునుతె ఊఉ సెప్టెంబర్‌-2020 |



ఐచ్చికంగా మాతృభాషా మాధ్యమంలోనే సాగాలని చెప్పింది. 2 నుండి 8 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలు కొత్త భాషలను సులభంగా నేచ్చేసుకుంటారు. ఆ వయన్సులో బహుభాషలను నేర్చుకుంటే విద్యార్థి దశలో గ్రహణ, ధారణ శక్తి పెరుగుతుందని విద్యా విధానం వ్యాఖ్యానించింది. ఇదే విధానం భారతదేశంలో కేవలం 15 శాతం జనాభా మాత్రమే ఆంగ్లంలో మాట్లాడే నేర్చు కలదని అనింది. అయితే ఈ 15 శాతవే భారతదేశంలో సంపన్న వర్షానికి చెందిన వారు కూదా. ఉద్యోగాలను అందించే పై మెట్టులో ఉన్న ఈ సంపన్న వర్షం, ఉద్యోగారతల్లో ఒకటిగా ఆంగ్లాన్ని అవసరమున్నా లేకున్నా అనివార్య నైపుణ్యంగా మార్చింది. అసలు భాషతో ప్రమేయం లేని ఉద్యోగాలలో తూదా ఆంగ్ల భాషా జ్ఞానాన్నీ అర్హతగా ఉంచడం ఈ మౌధ్యానికి నిలువెత్తు సాక్ష్యం. అందువలన సమాజం మొత్తం ఆంగ్లం తెలిసిన వారు గొప్పవార్సు, తెలీనీ వారు హీనులు అన్నట్టుగా భావిస్తోంది.

ఒకటి - మన ప్రభుత్వాలు, సమాజం కలిసికట్టుగా ఈ ఆంగ్ల ఆధిపత్యానికి చరమ గీతం పాదాలి.

లేద్ధా రెండు - ఆర్థిక స్టోమతకు అతీతంగా నాణ్యమైన ఆంగ్ల భాషా ప్రావీణ్యం అందరికీ అందాలి.

అంగ్ల భాషా ప్రావీణ్యం వేరు, ఆంగ్ర మాధ్యమం వేరు. అంగ్ల మాధ్యమ బడులలో చదువుకున్నంత మాత్రాన అంగ్ల భాషలో ప్రావీణ్యం రాదు. మాతృభాషా మాధ్యమంలో చదివి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యం తెచ్చుకోవటం పెద్ద కష్టం కాదు. అయితే ఈ విషయమై విద్యా విధానం పెద్దగా మాట్లాడలేదు. ఆంగ్ల మాధ్యమ విద్యకి, ఆంగ్లంలో విషయ సామగ్రి తయారీకి ఇస్తున్న ప్రాధాన్యత, ఆంగ్లేతర మాధ్యమ విద్యార్దులకు ఆంగ్లంలో (ప్రావీణ్యత సంపాదించుకునేందుకు ఇవ్వటం లేదు. ఆ విషయమై పెద్దగా ఎలాంటి వ్యాఖ్యానాలు ఇవ్వలేదు. ఆంగ్ల మాధ్యమ విద్యలో నేర్పే ఆంగ్లానికి, బయట వ్యవహారానికి కావాల్సిన ఆంగ్లానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు మన పాఠ్య ప్రణాళికలు, పాఠ్యపుస్తకాలు బ్రిటిష్‌ ఆంగ్లాన్ని నేర్చిస్తాయి, కానీ వ్యవహారమంతా అమెరికా ఆంగ్లంలో జరుగుతుంది. బడిలో తప్పుడు స్పెల్లింగులు(పదంలో అక్షరాల (శ్రమం) అనుకున్నవి బయట ఒప్పు. బడిలో ఒప్పు అని చదివిన ఆంగ్లం బయట వ్యవహారంలో తప్పు. మాటలాడాలన్నా బడిలో నేర్చే ఆంగ్లం పనికిరాదు. మళ్ళీ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు అనీ అదనంగా

తరువాయి 16వ పుటలో.......