పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగు-సంస్మ ల్‌ అకాడమీ |! ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ “తెలుగు సేవికు ఇది పరాకాష్ట !!

సొంత అమ్మభాషలో చదువులను హాయిగా నేర్చుకోవడానికి వీల్లేకుండా అన్ని దారులనూ మూసివేసి, కళాశాలల్లో కూడా తెలుగు మాధ్యమానికి స్వస్తి పలికిన జగన్నోహన రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు తెలుగు అకాడమీని ఏర్చర్చుతూ, దానికొక పవిత్రబాధ్యతగా సంస్కృతాన్ని కూడా అప్పజెప్పారు. ఇది ఎక్కడా లేని వింత ! ఇంగ్లీషులో చదివితేనే తెలుగువారికి భవిష్యత్తుంటుందంటూ అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఘనతతో పాటు, సంస్కృతాన్ని ఉద్ధరించాల్సిన బాధ్యతను కూడా ఆయన ప్రభుత్వం నెత్తికెత్తుకున్నట్లు భ్రమపెడుతోంది. లక్ష్మీపార్వతి గారి వంటి ఒక రాజకీయ నిరుద్యోగికి గౌరవ పీఠం వేసి కీ.శే. ఎన్టీరామారావు గారి ఆశీస్సుల్ని పొందవచ్చు అనుకొంటున్నారేమో ! ఇకపై ఆయన తెలుగులో మాట్లాడటం మానివేసి ప్రజలతో కూడా ఇంగ్రీషులో మాట్లాడతారేమోనని జనం భయపడుతున్నారట! ఆయన చర్యల్ని ఖండిస్తూ తెలుగు భాషోద్యమ సమాఖ్య పత్రికా ప్రకటనను, అధికార బాషా సంఘం, పూర్వపు అధ్యక్షుడు శ్రీ మండలి బుద్ధప్రసాద్‌ ముఖ్యమంత్రి కి వ్రాసిన జాబును ఈ క్రింద ఇస్తున్నాము. సమైక్య రాష్ట్రంలో తెలుగు అకాడమీని తొలిత స్థాపించి ఒక ఉత్తమ చరిత్రకు కారకుడైన నాటి ముఖ్యమంత్రి కీ.శే. పి.వి.నరసింహారావు గారు అకాడమీ పత్రికకు పంపిన సందేశాన్ని కూడా క్రింద ఇస్తున్నాము.

“తెలుగు అకాడమీని తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తున్న ఉత్తర్వులను రద్దు చెయ్యాలి తెలుగు భాషోద్యమ సమాఖ్య ఉమాతల్‌

సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్హ్రాన్ని రండుగా విభజించిన సందర్భంలో కొన్ని సంస్థల విభజన జరగకపోవడం తెలిసిందే. ఇంత వరకు విభజనకు నోచుకోని సంస్థలలో కోట్లాది రూపాయల సొమ్ము ఆస్తులతో కూడిన 'తెలుగు అకాడమీ ఒకటి. ఈ నేపథ్యంలో నేటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 16-6-2020న జి.ఒ.ఎం.ఎస్‌.నెం: 21 ద్వారా తెలుగు అకాడమీని స్థాపించింది. అప్పటి నుండీ సన రూప్తీఖలు ఏర్పడలేదు. మరి, ఏమయిందో ఏమో హఠాత్తుగా ఈ నెల 10వ తేదీన తెలుగు అకాడమీని 'తెలుగు -సంస్కృత అకాడమీ”గా మార్చుతూ, జి.ఒ.ఎం.ఎస్‌ 31ని విడుదల చేసింది ప్రభుత్వం.

1968 జూన్‌తో అప్పటి ముఖ్యమంత్రి కీ.శే. పి.వి. నరసింహారావు తెలుగును పాలన, బోధనా భాషగా పూర్తిగా అమలులోకి తేవడంకోసం నిర్ణయించి ఎన్నో చర్యలను చేపట్టారు. అండులో ముఖమైనది 'తెలుగు అకాడమీ స్థాపన. పరిశోధన, భాషాభివృద్ధి, పాఠ్య (గ్రంథాల రూపకల్పన, ప్రచురణ వంటి ఉన్నత లక్ష్యాలతో తెలుగు అకాడమీని స్థాపించారు. 50 ఏళ్లకు పైబడిన ఘన చరిత్రను అది సంతరించుకొంది. రాష్ట్రవిభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు రావలసిన వాటాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి తెచ్చుకోవలసిన రాష్ట్రప్రభుత్వం అందుకోసం సరైన చర్యలను చేపట్టడంలో విఫలమైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ర0డు రామ్ర్రాలనూ పరిపాలించిన, పరిపాలిస్తున్న పాలకవర్థాలు ఇందుకు బాధ్యులు. పాలకులకు రాష్ట్ర అధికార భాష అమలుపై ఎటువంటి ఆసక్తి లేకపోగా, ఇండుకు సంబంధించిన రాజ్యాంగబద్ధ అధికార పీఠాలను పదవుల పంపిణీలో భాగంగా వాడుకొంటున్నారు. ఈ క్రమంలో 'తెలుగు అకాడమీని కూడా చేర్చి పదవుల వితరణ మొదలుపెట్టి, అండుకోసం అనాలోచితంగా (ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేస్తున్నారు. ఈ మొత్తం చర్యలను తెలుగు భాషోద్యమ సమాఖ్య ఖండిస్తున్నది. ప్రభుత్వ చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు రావలసిన వందల కోట్ల రూపాయల నిధులను, ఆస్తులను మనం కోల్పోవడమే గాక, తెలుగు భాషాభివృద్ధికి చేపట్టవలసిన చర్యలు మరుగున పడిపోతున్నాయి. ఈ తొందరపాటు చర్యలను ఖండిస్తూ, వెంటనే జి.ఒ.ఎం.ఎస్‌.నెం. : 81/10- 7-2021ని ఉపసంహరించుకోవాలని, జి.ఒ.నెం. 21౧66.2020 లోని 8 వ అంశంలో పేర్మాన్న ఆశయాలలో చివరిదైన )000౫ని (తెలుగు అకాడమీ- తెలుగుతో పాటు సంస్కృతభాష అభివృద్ధి కోసం కూడా పాటుపడుతుంది అనే అంశాన్ని) పూర్తిగా

తొలగించాలి అనీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతున్నాం. డా సామల రమేష్‌ షబాబు, జాతీయ అధ్యక్షుడు డా! వెన్నిసెట్టి సింగారావు, ఆంధ్రప్రదేశ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి తెలుగు భాషోద్యమ సమాఖ్య 10వ పుట చూడండి...

తెలుగుజాతి పత్రిక జుమ్మునుడి. ఆ ఆగస్టు-2021 | ర