పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముఖ్యమంత్రి గారికి శ్రీ మందలి బుద్ధప్రసాద్‌ లేఖ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, గౌ.టశ్రీ వై.ఎస్‌, జగన్మోహనరెడ్డి గారికి, నమస్కారములు,

తెలుగు అకాడమీ పేరు తెలుగు-సంస్కృత అకాడమీగా మార్చు చేయడాన్ని యావత్తు తెలుగుజాతి వ్యతిరేకిస్తున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకునిరావడానికి ఈ లేఖ రాస్తున్నాను.

తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు మినహా దీనిని సమర్ధించిన వారెవరు లేరు. అన్నీ రాజకీయ పార్టీలు నీరసన తెలిపాయి. సామాజిక మాధ్యమాలలో ప్రజలు పెద్దఎత్తున తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలలో నీరసనలు వెల్లువెత్తాయి. ప్రజాభిప్రాయం గమనీంచదానీకి ఇంతకంటే వేరే మార్గం ఏముంది.. ??

తమ మాటలు ఇతరులు అలకించాలనే కోరేవారు, ఇతరుల మాటలు తాము అలకించాలన్నది ప్రజాస్వామ్య మూలసూత్రం. అలా వ్యతిరేకించకపోతే నిరంకుశ, నియంతృత్వ పాలన అవుతుందే తప్ప ప్రజాస్వామ్య పాలన అనిపించుకోదు.

ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాలకు ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉంటే వెనక్కు తీసుకుంటాయి. దాని వలన ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది. ఇటీవల కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రధాని శ్రీ నరేంద్రమోడీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ప్రతిష్టకు భంగం ఏమి కలగలేదు. వ్యాక్సిన్‌ పంపిణీ విషయంలో మీరు కూడా అభ్యతరం వ్యక్తం చేశారు. ప్రధాని పునరాలోచన చేసి నిర్ణయం వెనక్కు తీసుకున్నారు.

తెలుగు సంస్కృత అకాడమీ విషయంలో ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుని పునఃపరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుజాతి ఆత్మాఖీిమానం అంళంగా అందరూ భావిస్తున్నారు.

తెలుగు బాషాఖివృద్ధికి 50 ఏళ్ల క్రితం ఏర్పడిన మొట్టమొదటి సంస్థ తెలుగు అకాడమీ. దానినీ యధాతధంగా కానసాగించి, నీధులిచ్చి పటిష్టంగా పనిచేసేలా చేయాలని ప్రజాభిప్రాయం వ్యక్తం అయింది. అలాగే దానినీ విభజన ప్రక్రియ పూర్తి చేయించి, మనకు రావాల్సిన దాదాపు రూ.200 కోట్లు రప్పించేవిధంగా చర్యలు చేపట్టాలి. సంస్కృత భాషను ఎవరూ వ్యతిరేకించడం లేదు. సంస్కృత భాషకు ప్రత్యేక అకాడమీ ఏర్పాటుచేయమని అందరూ కోరుతున్నారు.

కావున తెలుగు అకాడమీనీ యధాతథంగా కొనసాగించి, సంస్కృతానికి ప్రత్యేక అకాడమీ ఏర్పాటుచేసేలా చర్యలు చేపట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించ ప్రార్దన... అభినందనలతో....

దాామందలి బుద్ధప్రసాద్‌, పూర్వపు ఉపసభాపతి, అధికార భాషా సంఘము పూర్వపు అధ్యక్షులు

తెలుగు అకాడెమీ హైదరాబాదు - జనవరి 1972లో 'తెలుగు' పత్రిక ప్రచురణ మొదలు పెట్టినప్పుడు

ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు గారి సందేశం

మనది ప్రజాస్వామ్యము, ప్రజలే పాలకులు, పరిపాలన ప్రజా ప్రతినిధుల ద్వారా జరుగుతున్నది ఈ పరిస్థితులలో ప్రజల భాషకు ఒక విశిష్ట స్థానమున్నది. ఇందుచేత మన తెలుగును ఉన్నత స్థాయిలో విద్యా బోధనకు, రాష్ట్రపరిపాలనకు తగినట్లు తీర్చిదిద్ది పటిష్టం చేయవలసిన ఆవశ్యకమెంతైనా ఉన్నది. అంతేకాదు, మనం మన సోదరులను ఇతోధికంగా విజ్ఞానవంతులను చేయవలె. ఇది మన పవిత్రకర్తవ్యము ఈ కర్తవ్య పాలనలో మనం 'ప్రమత్తులమైతిమా, భావితరాలు మనలను క్షమించవు.

ప్రజలు విజ్ఞానవంతులైతే మన నిర్మాణకార్వ్యక్రమాలలో సోత్సాహంగా పాల్టాని దేశపురోగతికి ఎక్కువగా తోద్చడగలరు. మన సభ్యతా సంస్కృతులలో ఉన్న మంచిని, ఇతర నాగరికతా సంస్కృతులతో ఉన్న మంచిని తులనాత్మకంగా పరిశీలించి గ్రహించి తమ జీవితాలను ఫలవంతం చేసుకోగలరు. ప్రజల భాషలో పరిపాలన, విద్యాబోధన జరిగిననాదే ఇది సాధ్యము. ఇందుచేతనే మన ప్రభుత్వము తెలుగును అధికార భాషగా నిర్ణయించింది ఈ నిర్ణయాలకు ప్రజల కోరికయే పునాది, దీనికి ప్రజల సమ్మతి ఉన్నది.

విద్వావిధానము ప్రజల మానసికవికాసానికి తోద్చడేదిగా ఉండవలె, బోధనభాష ప్రజలభాష అయినసప్పుడే ఇది. సాధ్యము. దీనిని సాధించడానికి మంచి పుస్తకాలుందవలె. ఈ కార్యక్రమాన్ని తెలుగు అకాడమి చేపట్టినది. ఇంటర్మీడియట్‌ తరగతులవారికోసం మౌలికమైన పార్వపుస్తకాలను, డిగ్రీతరగతులవారికోసం మౌలికమైన పఠనీయ (గ్రంథాలను వ్రాయించి ప్రకటించడం ద్వారా తెలుగు విద్యావంతులకు పరిచితమై సేవచేస్తూ ఉన్న తెలుగుఅకాడమి ఇప్పుడు ఈ వైజ్ఞానిక పత్రిక ద్వారా తెలుగు ప్రజలకు సేవచేయవలెనని సంకల్పించినది. ఇది ముదావహము.

ఈ ఆధునికయుగంలో (ప్రజలలో విజ్ఞానవ్వ్యాప్తి జరగదానికి పత్రికలు మంచిసాధనాలు. [గ్రంధవఠత నావకాశము, (్రంథరచనావకాశము సర్వులకు లఖించకపోవచ్చు కాని, ఈ అవకాశాలు సాధ్యమైనంత ఎక్కువమంది పత్రికలద్వారా కల్పించవచ్చు. కళాశాలలలో తెలుగులో పఠన పాఠనాదులు జరుగుతున్న ఈ రోజులలో విద్యార్దులు, అధ్యాపకులు కూడా క్లాసుపుస్తకాల పరిధిని దాటి అధికంగా విజ్ఞానవిషయాలను గురించి చదివే అవకాశము తెలుగులో కల్పించవలెననే దృష్టిలో ఈ పత్రిక బయలుదేరినది. దీని ద్వారా తెలుగు అకాడమి తెలుగువారితో వైజ్ఞానిక విషయాల, (ప్రసారాన్ని ఇతోధికంగా చేస్తుందని ఆశిస్తూ - ఈ కృషి విజయవంతంకావలెననీ వాంభిస్తూ దీనిని తలపెట్టిన 'అకాడమినీ అభినందిస్తున్నాను.

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఆ ఆగస్ట-2021 |