పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగువారు రామమూర్తిగారిని వ్యావహారిక భాషావాదిగానే చూస్తున్నారు గాని ఆయన అంతరంగాన్ని చూడలేకపోయారు. స్టరోష్టా అన్నట్టు రామమూర్తిగారు గురువు. సవరలకు వారి భాషలోనే విద్య నేర్పాలని వాచకాలు సిఘంటువులు రాసి సొంత దబ్బుతో సవర పాఠశాలలు నడిపిన మానవతావాది. పేదవాళ్ళన్సీ పిల్లలనీ, స్టీలనీ విద్యావంతులను చెయ్యాలంటే వారికి అర్థమయే భాషలోనే రాయాలన్నది రామమూర్తిగారి అభిప్రాయం. అందుకే ఆయన వ్యావహారిక భాషావాది అయ్యారు. తెలుగు యువరచయితలకు వెన్పుదన్నుగా బాలకవీ శరణ్యం రచించారు. వ్యావహారిక భాషలో రాయడాన్ని అద్దుకొంటున్న పండిత భిషక్కుల భాషాభేషజాన్ని బట్టబయలు చేశారు. వచన రచనా మార్గంలో పండితులు వేసిన ముళ్ళ కంపలను తొలిగించి మార్గాన్ని సుగమం చేశారు. గిడుగు రామమూర్తి విద్యను 'ప్రజాపరం చేసిన సమరయోధుడు.

రామమూర్తి గారు తాను హేతువాదినని ఎక్కడా చెప్పుకోలేదు. తాను మానవతావాదినని వేదికలెక్కి ఉపన్యాసాలివ్వలేదు. అతను మూర్తిభవించిన మానవత్వం.

| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఆ ఆగస్టు-2021 |

దాక్టర్‌ అల్లంశెట్టి చంద్రశేఖరరావు 99496 05141

గిడుగు అంతరంగం

సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రాసి ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ నుండి 1998లో పి.హెచ్‌.డి. డిగ్రీ పొందిన తరవాత కొంత కాలానికి తొలి సవర భాషాశాస్ర్రవేత్త గిడుగు రామమూర్తిగారు రాసిన సవర వాచకాల సేకరణ నిమిత్తం నేను పర్గాకిమిడి వెళ్ళి ఆ ప్రయత్నంలో ఉండగా రామమూర్తిగారితో పరిచయమున్న బందారు సుబ్రవ్నాణ్యంగారిని కలవడం జరిగింది. రామమూర్తిగారి పుస్తకాలు లభించలేదు గాని వారి జీవితంలోని ఒక గొప్ప సంఘటన గురించి తెలుసుకోగలిగాను. నా శ్రమ ఫలించిందనుకొన్నాను.

బండారు సుబ్రహ్మణ్యంగారు 1928 లో పర్హాకిమిడిలో పుట్టారు. మూడు తరాలనుండి వారు అదే గ్రామంలో వుంటున్నారు. రామమూర్తిగారిని గురించి తమకు తెలిసినది చెప్పమని కోరగా వారు తన చిన్ననాటి విషయాలను నెమరు వేసుకొంటూ ఇలా చెప్పారు: “రామమూర్తిగారు సమాజంలో సమూలమైన మార్చు రావాలని కోరుకొనే మనిషి. పర్తాకిమిడి జమీందారు(రాజు) చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ఎదుర్శొన్నారు. వారి దోపిడీ విధానాలకి వ్యతిరేకంగా నిలిచారు. 1980 సంవత్సరంలో తాలూకా బోర్డు ఎన్నికలలో జమీందాడుకి వ్యతిరేకంగా తమ కుమారుడు సీత్రాపతిని నిలబెట్టారు. సీతాపతిగారి పార్టీ గెలిచింది. రాజావారి పార్టీ ఓడిపోయింది.

ఇప్పటి ఒరిస్సాలోని గజపతి జిల్లా నేటి (శ్రీకాకుళం జిల్లాలోని హీరమండలం, కౌత్తూరు, బత్తిలి, గొప్పిలి, టెక్కలిపట్నం, పోలూరు, పర్లాకిమిడి జమీందారీలో ఉందేవి. ఈ ప్రాంతాలలో పర్హాకిమిడి రాజు శిస్తులు వసూలు చేస్తూ, బ్రిటిష్‌ ప్రభుత్వానికి మూడు లక్షల రూపాయిలు పేష్మత్‌ కట్టేవారు. రాజావారు పది లక్షలు వసూలు చేసి దానిలో ఏడు లక్షలు తాను ఉంచుకొనేవారో, లేదా, ఏడు లక్షలు వసూలు చేసి, నాలుగు లక్షలు ఉంచుకొనేవారో, తనకు సరిగా గుర్తు లేదని సుబ్రహ్మణ్యంగారు చెప్పారు. ఏమైనాగానీ వసూలు అధికంగానే వుందేది.

1930-32 ప్రాంతాలలో పర్లాకిమిడి రాజు రూపాయికి ఆరు అణాలు (అణా అంటే రూపాయిలో 16 వ వంతు) అదనపు శిస్తు వసూలు చేయడం ప్రారంభించారు. దీనిని వ్యతిరేకిస్తూ గిడుగు రామమూర్తిగారి అధ్యక్షతన జమిందారీ వ్యతిరేక సంఘం ఏర్పడింది. దీనిలో పర్షాకిమిడి వాస్తవ్యులు సంకు సోమన్న(రైతు), ఘంటికోట సత్యనారాయణ(అద్వకేటు), దాక్టర్‌ డి. వైకుంఠం, కన్నేపల్లి సత్యనారాయణ, ప్రవా యజ్జేశ్వర శాస్త్రి, సారవకోట వాస్తవ్యుడు బోయిన అప్పలస్వామి(రైతు) సభ్యులు.

అదనపు సదుపాయం కల్పించకుండా శిస్తు అధికం చేసే అధికారం లేదన్నది వీరి వాదన. రాజావారు చేస్తున్న అక్రమ వసూళ్ళను వీరు వ్యతిరేకించారు. రైతులు శిస్తు కట్టడం మానివేశారు. వీరిలో సుబ్రహ్మణ్యంగారి తండ్రి సీతారామచంద్రరావుగారు ఒకరు.

1931నంవత్సరంలో జమీందారు మనుషులు మందీ మార్చలంతో సీతారామచంద్రరావుగారి ఇంటిపైకి వచ్చి, భయపెట్టి బలవంతంగా శిస్తు వసూలుకు సిద్దవడ్డారు. డబ్బు లేదంటే కాందవాళ్ళను తెప్పించి ధాన్యం కాలివించుకానీ తీసుకానిపోయిన సంఘటన తన కళ్ళముందు ఈనాటికీ కనీపిస్తుందనీ, ఈ దురంతానికి ప్రత్యక్షసాక్షి నాటి బాలుడు, నేటి వృద్దుడు ఇన సుబ్రహ్మణ్యంగారు చెప్పారు.