పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్థాయిలో వాటికి పరిగణన రావాలి. చట్టసభల్లోనూ, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ అమలులోకి రావాలి.

ఈ విధమైన మౌలిక నిర్ణయాలను తీసుకోవడం ఇప్పుడున్న బలమైన కేంద్ర ప్రభుత్వానికి కష్టమేమీ కాడు. కాళ్ళీర్‌, పౌరసత్వం, ఉమ్మడి శిక్షాస్మ స్ట్‌ వంటి కఠినమైన సమస్యలను పరిష్మరించుకొంటూ, దేశ రక్షణకు, ఐకమత్యానికీ మొదటి 'ప్రాధాన్యతనిస్తున్న నేటిపాలకులు తలచుకొంటే ఇది సాధ్యం కానిదేమీ కాడు. (ప్రతిపక్షాలను కూడా కలుపుకుపోయే అవకాశాలున్న అంశం ఇది. భారతదేశపు ఫెడరల్‌ లక్షణాన్ని కాపాడుకొంటూనే కేంద్రప్రభుత్వాన్ని శక్తిమంతం చేసుకోవచ్చు. ఖాషా సమస్యకూడా పరిష్కారమవుతుంది. ఇప్పుడు కంప్యూటర్‌ పరిజ్ఞానం, కృత్రిమమేథ వికాస దశలో సాగుతున్న మనకు బహు భాషల సహజీవనం సమస్య కానేకాదు. రాజ్యాంగాన్ని ఏర్చరచుకొన్ననాటికి ఈ సౌకర్యాలు లేవు.

ఇక మన రాష్ట్ర ప్రభుత్వాల సంగతి. అనేక సందర్భాల్లో తెలుగు భాషోద్యమ సమాఖ్య, “నడుస్తున్న చరిత్ర “అమ్మనుడి” పత్రికలు ప్రజల దృష్టికి తెచ్చిన, తెస్తున్న అంశాలు: 1. మాతృభాషలో చదువులు 2.ప్రజల భాషలో పరిపాలన. 25 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో నలుగుతున్న సమస్యలివి. భాషారాష్ట్ట్రాలు ఏర్పడడానికి మూలమైన భాషాజాతి స్పృహను, ఆశలను తొలిపాలకులు కొంత నిబద్ధతతో బలిష్టం చేసేండుకు (శద్ధ వహించారు. అవసరమైన వ్యవస్థలను నిర్మాణం చేశారు. కానీ 1990 తర్వాత తెలుగు రాష్ట్రపాలకులు ఈ మౌలిక అంశాన్ని విస్మరించారు. ఆత్మ విస్మ బతిలో పడిపోయి, బానిస భావనలకు లొంగిపోయారు. ప్రజల పట్ల నిబద్ధత లోపించినప్పుడు, రాజకీయ ఆర్థిక స్వార్థాలు వీలయతాండవం చేస్తాయి. తెలుగు నాట జరిగిందీ జరుగుతున్నదీ ఇదే. ఆ పార్టీ ఈ పార్జీ అని కాకుండా పాలకవర్గాల నైతిక పతనం సాగుతూనే ఉంది.

రెండు తెలుగు రామ్ర్రాలుగా ఏర్చడిన తర్వాత - తెలంగాణ పాలకులు ప్రపంచ తెలుగు మహాసభలను జరిపి, పెద్ద పెద్ద వాగ్దానాలు, ఆశలను కురిపించారు. కాని ఆచరణలో పటిష్టంగా ముందడుగు వేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే, ప్రజల భాషలో పాలన, బోధన అంశాల పైన నిర్లక్ష్యం ప్రదర్శించిన మొదటి పాలకులు అధికారాన్ని కోల్నోగా ఇప్పుడు అధికారంలోకి వచ్చినవారు ప్రజల భాష తెలుగు మీద కత్తి కట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. పాఠశాలల్లోను, పై చదువుల్లోనూ తెలుగు మాథ్యమానికి గోరీ కడుతున్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. పాలనలో తెలుగును పూర్తిగా తొలగించారు. కాని ఓట్లు అడిగేందుకు, చట్టసభల్లో వెకిలిగా పోట్లాడుకొనేందుకు వీరికి తెలుగే కావాలి. దీని మర్మమేమిటో ఎవరికి వారే అర్ధం చేసుకోవాలి !

రెండు తెలుగు రామ్ర్రాల పాలకులూ నూతన జాతీయ విద్యావిధానాన్ని సమర్థిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. మరి పైన మేము వివరంగా 'పేర్ళొన్న వైరుధ్యాల సంగతి ఏమిటి? ఈ అంశాలపైన రామ్రాలకూ కేంద్రానికీ మధ్య సమన్వయం గాన్సీ ఏకాభిప్రాయ ప్రయత్సం గానీ ఉన్నదా? రాజ్యాంగం ప్రకారం విద్య అనేది ఉమ్మడి అంశమైనందున ఈ సమస్యలకు పరిష్కారం కోసం ప్రజలు ఉద్యమాలు చెయ్యవలసిందేనా?

ఉన్నత సాంకేతిక విద్యలో ముఖ్యంగా ఇంజనీరింగ్‌లో భారతీయ భాషలలో విద్యకు వాకిలి తెరచిన అ.భా. సాంకేతిక విద్యా సంస్థకూ, భారత ప్రభుత్వానికీ మా అభినందనలు. ఈ ప్రయోగం విజయవంతం కావడానికి అందరూ సహకరించాలి. ఇదే విధంగా మాతృభాషలను విద్యారంగంలో బలిష్టం చేయడం కోసం ఇంకా అనేక చర్యలను తీసుకోవాలి. మంచి కాలానికి దారులు తెరచుకొంటున్నాయని ఆశిద్దాం. ఉద్యమిస్తూ ముందుకు సాగుదాం.

తేదీ : 30-07-2021 “సాభుల చ్లా


౯ అమ్మనుడి చదువరులకు..... ఎ

ఏప్రెల్‌ సంచికలో విన్నవించినట్లే- మూడు నెలల విరామం తర్వాత ఈ ఆగస్టు సంచిక - తెలుగు భాషాదినోత్సవ సంచికగా- గిడుగు రామమూర్తి 158వ పుట్టినరోజు సందర్భంగా వెలువడుతున్నది. ఇండులో మంచి వ్యాసాలను మీకందివ్వడానికి ప్రయత్నించాము. పుటలను పెంచే అవకాశం లేనండున ప్రతినెలా ధారావాహికగా ప్రచురిస్తున్న కొన్నిటిని ఈ నెలలో ఇవ్వలేకపోయాము - కొత్తమాటల పుట్టింపు, పడమటిగాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద, మావూరు(నవల), కాయ్యబొమ్మల కళాకారుడు గొంబే గౌడర రామనగౌడ ఆత్మకథ, మున్నగువాటిని సెప్టెంబరు సంచిక నుండి ఇవ్వగలం.

చదువరులకు ఇబ్బంది కలిగించినందుకు మన్నించగోరుతున్నాము. - సంపాదకుడు

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 | ఈ,