పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న్న

[1

ష్‌

ఆస ఆర్త నా సంవాదక హృదయం

|

సంపుటి; 7 సంచిక: 3 ణిత్మనుటె

ఆగస్టు 2021 తెలుగులో ఇంజనీరింగ్‌ సరే., పాఠశాలలో తెలుగు సంగతేమిటి?

నూతన జాతీయ విద్యావిధానాన్ని ఆమోదించి ఏడాదైన సందర్భంగా భారత ప్రధానమంత్రి నిన్న ప్రత్యేకంగా ప్రసంగించారు. దానిని బాగా ప్రచారం చేశారు కూడా. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి మన విద్యార్థులను తయారు చేయడం లక్ష్యంగా ఈ విధానాన్ని చేపట్టామని చెప్పారు. ఇంకా అఖీల భారత వైద్యవిద్యలో ఓఒవిసిలకు, అ(గ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌లు తదితర నిర్ణయాలతో సామాజిక న్యాయం వంటి అంశాలతోపాటు, 11 భాషల్లో ఇంజనీరింగ్‌ కోర్సులు, అందరికీ కృత్తిమమేథ వంటి వాటిని ముఖ్యంగా ప్రస్తావించారు. అంతకు రెండురోజులముందే అఖిలభారత సాంకేతిక విద్యాసంస్థకు అనుబంధించి ఉన్న 14 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో దేశీయ భాషలలో బోధన జరగబోతోందని ప్రకటించారు. వీటిలో తెలుగు మాధ్యమంలో బోధనకై గుంటూరు జిల్లాలోని ఎన్‌ఆర్‌ఐ ఇంజనీరింగ్‌ కళాశాలను ప్రకటించారు. కొత్త జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయడం మొదలు పెట్టిన తర్వాత ఇదొక మంచి పరిణామం. ఈ నిర్ణయానికి వచ్చేముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో అఖిల భారత సాంకేతిక విద్యాసంస్థ ఒక సర్వేను నిర్వహించింది. అందులో 40 శాతం మంది విద్యార్థులు తెలుగులో ఇంజనీరింగ్‌ విద్య కావాలని కోరిన సంగతి తెలిసిందే. (ఈ పూర్తి గణాంక వివరాలను “అమ్మనుడి” ఏప్రెల్‌ 2021 సంచిక 10వ పుటలో ప్రచురించాము.)

సరిగ్గా ఏడాది క్రితం కొత్త జాతీయ విద్యావిధానానికి కేంద్ర ఆమోదం ప్రకటించిన తరువాత అమ్మనుడి ఆగస్టు 2020 సంచిక నుండి దీనిపై వరసుగా వివరమైన వ్యాసాలను, సంపాదకీయాలను అమ్మనుడిలో 'ప్రచురించాం. మొత్తంమీద విద్యావిధానంలో అంతకుముందున్న స్థితి నుండి అనేక మార్చులను కొ.జా.వి.వి. ప్రకటించినప్పటికీ అది కార్పొరేట్‌ శక్తుల కౌగిలిలోకి మరింత బలంగా హత్తుకుపోయిన మాట నిజం. ఐనా, దేశహితాన్ని కోరుతూ, భారత సంస్కృతి సంప్రదాయాలు, చరిత్ర, భారతీయ విజ్ఞాన సంపదల వారసత్వాన్ని కొనసాగించడానికీ, అభివృద్ధి చేయడానికీ, విశ్వవ్యాప్తం చేయడానికీ పెద్ద పీట వేస్తున్నట్లు ప్రకటించారు.

భారతీయ భాషల పట్ల ఎన్నో మంచి ప్రస్తావననలనండులో చేశారు. ఐనా, సంస్కృతం పట్ల వారికి గల ప్రగాఢమైన, పవిత్రమైన అంకితభావాన్ని మాత్రం బాగా ప్రదర్శించారు, నిజంగా దేశంలో మాతృభాషల పట్ల కూడా వారికి అంకిత భావం ఉంటే రాజ్యాంగంలో 8వ షెడ్యూల్‌ లోని 22 భాషలను అధికార భాషలుగా, జాతీయ భాషలుగా గుర్తించి వాటిని కేంద్ర స్థాయిలో అమలులో పెట్టాలి. అన్నిటినీ సమానదృ్భష్టితో ఆదరించాలి. హిందీ ఆధిపత్యవాదానిక్తీ, భారతీయ భాషల సంస్కృతీకరణ విధానానికీ స్వస్తి పలకాలి. ఆగస్టు 2020 సంచిక 'సంపాదకహృదయం'లో మేము 'హెచ్చరించినట్లు- 'మాతృభాషలతో దోబూచులాట- సంస్కృతం, హిందీలకు మురిపాల మూట అన్న విధానాన్ని కొనసాగిస్తే అది ఎంతో ప్రాచీన చరిత్ర, బలమైన మూలాలు కలిగిన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం తదితరభాషల వారిని రెచ్చగొట్టే పరిణామాలకు దారితీస్తుంది. ఆది భారతదేశ ఐక్యతకు మంచిది కాదు.

భారత ప్రభుత్వం, పాలకవర్గాలు దేశప్రజల (శ్రేయస్సును కోరి, భారతీయ భాషల, ప్రజల హితాన్ని కోరి వెంటనే పూనుకొని చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అవి:

న. మాతృభాషలో విద్యను పొందే హక్ష్మును ప్రాథమిక హక్షుగా గుర్తించాలి.

2. కనీసం పాఠశాల విద్యను మాతృభాషా మాధ్యమంలో తప్పనిసరి చెయ్యాలి.

8. మాతృభాషలలో చదువును ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక అర్హతగా తప్పనిసరి చెయ్యాలి.

4& షెడ్యూల్‌ 8 లోని 22 భాషలనూ జాతీయ భాషలుగా, అధికార భాషలుగా గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వ

గుజాతి పత్రిక అవ్మునుడి ఈ ఆగస్ఫ-2021