పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పడుతుండడం నాకు బాగా తెలుసు. అందుకనే కృష్ణ ర.సం వాళ్లు డబ్బుల్ని పోగేసినాం. అచ్చు వేసే చెల్లు కాకుండా పదివేల రూపాయలు మిగిలినాయి. గడ్జిపోచే కావచ్చు, గాదపు పీచే కావచ్చు దానినే కీరాకు మేవడి(గౌరవరలి)తో ఇద్దామనుకొన్నాం. తిరుపతిలో తట్టచ్చు(డి.టి.పి) పనీనీ ముగించినాం. దిద్దుడు పనులను ముగించినాం. కీరాకు విలుపిచ్చి వారివి సొగసైన పొడమ(ఫోటో)లను కొన్నిటిని తెప్పించినాం. ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావును ఎనీకెన(కంప్యూటర్‌) ముందు కూర్చోబెట్టి కీరా ఫొదమతో అందమైన అట్టబొమ్మను వేయించినాం. ఇక అచ్చుమర ఎక్కడమే మిగిలింది. అప్పుడు మోగింది నా చేపలుకిఢెల్‌ఫోన్‌),

అటునుండి ఇళంబారతి గారు. కీరాకు మంచి నేస్తం. “కీరా నీతో చెప్పేదానికి మొగమాట పడుతున్నారు. నీన్ననే ఆమె వచ్చింది. గోపల్లెను ఆమే అచ్చు వేయిన్తుందంట. డబ్బులు కూడా మీరు ఇచ్చేదానీకంటే ఎక్కువ ఇస్తుందంట. కీరా నిందా డబ్బు ఇక్కట్టులో ఉందాడదనీ నీకు తెలును కదా. దానికనీ అమెనే వేయుమని చెప్పేసినాడు...”

కాసేపు ఏం మాట్లదాలో తెలియలేదు. మరునాడు కీరాతో మాట్లాడాలని కిట్టగించి(ప్రయత్నించి) నాను. కుదరలేదు. ఆయన దొరకలేదు. ఊరుకొన్నాను. కృష్ణరసం ముందు తలదించుకొని నిలబడి నాను. బాగా తలవంపులుగా అనిపించింది. గోవల్లె తెలుగులో రావడానికి నేను పడిన పాటు నాకూ నారాయణరెడ్డికీ ఉమామహేశ్వరరావుకూ మట్టుకే కాదు ఆమెకూ తెలుసు. తెలిసీ ఆమె ఈ తెగబాటుకు పూనుకొనింది. ఇంతా చేసి ఆమె ఆ పొత్తాన్ని తన డబ్బుతో అచ్చువేయలేదు. మేము అవను(సిద్దం)గా చేసిపెట్టున్న తట్టచ్చునూ అట్టబొమ్మనూ పంపుమని ఇళంబారతి గారు అడిగితే పంపేసినాం. దానినీ ఆయన, అమెకు అందించఛినారు. కీరా పొదమతో మేం చేయించిన అట్టబొమ్మను పక్కన పదేసినారు. ఒక తెలుగు బతుకును రాజస్తానీ బొమ్మతో అట్టను కైసేసినారు. విలువలున్న మనిసిగా పేరున్న ఒక రిజైర్డ్‌ ఐ.పి.ఎస్‌ చనవరి(అదికారి) రంగంలో కనబడినాడు. ఆయన తెట్టువ(సంస్త) పేరుతో గోపల్లె వెలువడింది.

పేర్లు చెప్పి చెప్పడం పాడి కాదు అనీ చెప్పడం లేదంతే. అమ్మనుడి చదువరులకు ఆమె ఎవరో ఎరుకపడగలదు. ఆమెకు తమిళం తెలియదు. తెన్నాటి తెలుగు గురించి తెలియదు. ఏ తెలుగు గురించీ తెలియదు. తెలును అని ముందుకు వస్తే ఆమెతో 'పెనుగువకు నేను అవనుగా ఉన్నాను. ఏమీ తెలియని ఆమె, ఇప్పుడు తమిళనాడు తెలుగుదనానికి నీలువెత్తు రూపం. తమిళనాడులో మొన్నటికి మొన్న స్టాలిన్‌ గద్దెనెక్క దానికి ఆమే కారణం! చేపో ఎల్లుండో ఆమే వూనుకౌనీ తెన్నాట తెలుగును రెండవ ఏలుబడి నుడిగా చేయబోతున్నారు!! తెన్నాట మూల మూలా పల్లెపల్లే పేటపేటా కుదురు కుదురూ ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.

తెన్నాటి తెలుగు కళలగురింబీ తెలుగు ఆటలుపాటలు, కులాలు, నమ్ముకొన్న కులాలు, అలమరి తెగలు, పండుగలు పబ్బాలు.... మొత్తం సాగుబాటు(కల్చర్‌) గురించి ఆమె అరసి(పరిశోదించీ) చెబితే మా బోటి దీనులం విని తెలుసుకొన్నాం!

ఆమె గురించి ఇక్కడ ఎందుకింత సొద అంటే, ఆమె వల్లనే, కేవలం ఆమె వల్లనే, పసివీడ్డవంటి కీర్మా ఎనిమిదిపదుల ఈడులో, ఆయన మనుమడివంటి నా దగ్గర ఇబ్బంది పడవలసి వచ్చింది. ముప్పయ్యేళ్ల మా చెలిమికి చెల్లుచీటి ఇచ్చేసింది ఆమె.

సరే ఆ మందలను ఇక ముగిద్దాం. కీరా ఇంటిపేరును కొందరు రాయంకుల అని రాస్తున్నారు. అది తప్పు. వారి ఇంటిపేరు రాయంగల. కీరా కూడా మొదట్లో రాయంగల అనే చెప్పేవారు. కమ్మకులం మీద పెద్ద ఆరయిక చేసిన ఒక అయ్యంగారు కీరాతో అన్నారట. రాయంగల అనే ఇంటిపేరు కమ్మవారిలో లేదు. రాయ, రాయం అనేవి ఉన్నాయి. అదే రాయంకుల అయుంటుంది అని. ఆ అయ్యంగారు కూడా అమ్మనుడి చదువరులే. వారికొక విన్నపం ఏమిటంటే, గుంటూరు, ఒంగోలు, గుడివాడ, ఏలూరుల నడమనున్న వాలే కమ్మవారు, మిగిలిన చోట్ల ఉన్నవారంతా వలస ఫోయినవాచే అన్నది పొరపాటు. రాయలసీమలోని చాలా ఇళ్ల పేర్లు కోస్తా తావునున్న కమ్మవారికి లేవు. బళ్లారి, చిత్రదుర్గం, తుముకూరు, అనంతపురం, కోలారు, బెంగళూరు, హోసూరు, కోళ్లెిగాలం, గోపిచెట్టిపాళెం, సాతూరు, గుడిపల్లి, తావులలో రాయంగల వారున్నారు. రాయంగల, పోసనంగల, రాచకొందల, నుంచల, దొథడ్ల, వుంతవచ్చ. మూకుడుపచ్చ, మార్త, కుడితి వంటి ఇంటిపేర్లు నడిమి ఆంధ్ర తావున ఉందవు. కమ్మవాళ్లంతా వలసపోయిన వాళ్లే బలిజవాళ్లంతా, మాదిగవాళ్లంతా, చివరకు తెలుగువాళ్లంతా వలసపోయినావాళ్లే అని ఇంకా ఎన్నాళ్లు చెప్పుకొందాం చెప్పండి.

రాయంగల క్రిత్ళ రామానుజ పెరువూళ్‌ నాయకర్‌ రాజనారాయణన్‌ గారు. వారి పేరు కన్న వేలింతల ఎత్తుకు ఎదిగినవాడు. తెలుగంటే నెనరున్నవాడు. పాండెనాటి రేగడినేలల తెలుగు బతుకును, తన బతుకంతా కలవరించి పలవరించినవాడు. తెన్నాటి తెలుగు వెలుగును తమిళుల కళ్లు మిరిమిట్లు గొలిపేలా నిలిపినవాడు. వారి రచనలన్నీ తెలుగులోకి మారాలనీ తెలంగాణాం[వ్ర తావుల తెలుగువాళ్లంతా చదవాలనీ బతికినన్నాళ్లూ తపన పడినారు ఆయన. గోపల్లైె గోపల్లె పురజనుల అనే వారు రెందు కొత్తెనలను వెలుగులోకి తెచ్చిన ఆ పున్నెపురాలే నడుము కట్టుకొంటే, ఏ బయ్యేయస్సో ఐపీయస్సో తోడుపడక పోడు.

అమ్మనుడి అరుగుమీద నుండి చెబుతున్నాను. కీరా ఆవి(ఆత్మ) ఉంటే విననీ. * తాతా, విద్దె కలిగిన మీరు కూడా పసిడి కలిగిన వాళ్లకు తలవంచారే, పాడియేనా? మన్నించండి”

“బుద్ధదేవుడు, ఏసుక్రీస్తు మొదలగు మహాత్తులు వ్యావహారిక భాషలోనే ప్రజలకు ధర్మమును ఉపదేశించవలెనని శిష్యులకు విథించినారు. పండిత పామర సామాన్యమైన వ్యావహారిక భాష విద్యాబోధనకూ [గ్రంథరచనకూ రాజ్యవ్యవహార నిర్వహణకూ

సాధనముగా ఏ దేశమునుందు ఏర్చడినదో ఆ దేశమే బెన్నత్యము పొందినదని చరిత్ర ఘోషిస్తున్నది. వ్యవహార భష్టమైన


భాషలను పండితులకు విడిచిపెట్టి, వ్యవహార భాషలద్వారా లోకవ్యవహారమంతా నిర్వహించవలెను.” -గిడుగు వేంకటరామమూర్తి

| తెలుగుజాతి పత్రిక ఇవ్వునుడి ఈ ఆగస్టు-2021 |