పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధురాంతకం నరేంద్ర

'సాఫాత్య రంగం కాం అవకా 98485 98446

మరో మరువకూడని మనిషి - రాజేంద్ర

గడచిపోయిన మే నెల 22వ తేదీన యం. రాజేంద్ర అనే పాత్రికేయుడు చనిపోయినప్పుడు ఆయనతో బాటు పనిచేసిన సంపాదకులు, చిత్రకారులు(కల్లూరు భాస్మరంగారు, నర్సింగారు, యొస్వీ రామారావుగారు, మరికొందరు) వెంటనే తమ ఆత్మీయ మిద్రునికి వివాళిగా వ్యాసాలు రాశారు. అప్పుడు చాలామంది యెవరీ రాజేంద్ర? అని తిరిగి చూశారు. చాలా మందికి ఆయన చిత్తూరు జిల్లావాసి అని కూడా తెలియదు. ఆయన గురించి మీత్రులు రాసిన వ్యాసాల్ని చదివినవాళ్ళు యింత పనిచేసిన వ్యక్తిని గురించి ఇంత వరకూ యేమీ తెలియకుండా వుండడం యెలా జరిగిందని ఆశ్చర్యపోయారు. తనకంటే తాను చేస్తున్నపని గొప్పదని భావిస్తూ చేసిన పనికి కూడా తనకు కర్త్వ్వత్వాన్ని అసలు ఆపాదించుకోకుందా, వొక జీవితకాలం కర్మయోగిలా పనిచేయడం సాధ్యమేనని నిరూపించిన అపురూపమైన వత్రికా సంపాదకుడు రాజేంద్రగారు. ఆయిన వెనక చేసిన అద్భుతమైన పని ఆయనలాగే వినయంగా, నిశ్శబ్దంగా వుండిపోయింది. ఆ రాయడం కూడా తగ్గించేశారు. చిత్తూరులో వుండగా రాజేంద్ర


1987 జూలై 1వ తేదీన ఛిత్తూరు జిల్లా అరగాండలో

మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన రాజేంద్ర హైస్కూలు చదువు పూర్తియ్యీ గాక మునుపే సాహిత్య ప్రపంచంలోకి వచ్చేశారు. 1854లోనే ఆయన కథ “అందుకొరకని రహస్యం” కథాంజలి అనే పత్రికలో వెలువడింది. ఆ కథ చదివినప్పుడు అది 17 సంవత్సరాల కుర్రాడు రాసిన కథ అనీ నమ్మడం చాలా కష్టం.

1969లో మా నాన్న గారు చిత్తూరు జిల్లా సాహిత్య చరిత్ర అనే 50 పేజీల చిన్న పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో రాజేంద్ర గారికి ఆప్పుడే ఒక పేజీ కేటాయించారు. అందులో ఆయన యిలా రాశారు:

“అరగొండలో వున్నప్పుడే చురకత్తిలాంటి కుర్రాడనీపించుకున్నాడు రాజేంద్ర. అల్లసానీ పెద్దన అందలమెక్కు నాటికి కొంటె విద్యార్థిగా వున్న రాజరాజభూషబుడిలాగా సభాగారు పత్రికలకు రాస్తుంటే చూశాడు. ఈ ప(తికల విశేషమేమిటో తెలుసుకోవానుకున్నాడు. దొరికిన ప్రతి పత్రికా ఉత్సవ విగ్రహంలాగా కనిపించగా, నాటికి వబాలవిరాట్టులవంటి వథత్రికా కార్యాలయాలు మదరానులో వున్నాయని తెలిని, ఆ నగరాన్ని కోటి నదుల ధనుష్మోటిగా భావించాడు. మదరాసు తండియార్‌ పేటలోని “మాతృసేవిలో పనిచేని పత్రికల బాగోగుల్ని గురించి క్లుఖ్మమ్రైన పరిజ్ఞానం గడించాడు. వ్రాయడానికి అవసరమ్రైన అర్హత పత్రికల గురించి తెలుసుకోవడం కాదనీ, సాహిత్యమన్నది లైబ్రరీలలో నిక్షిప్తమై వుందనీ తెలిశాక ఆ లైబ్రరీల అంతుగూడా తేల్చుకోదలచుకున్నాడు. లైైబేరియన్‌గా శిక్షణ కోసం విశాఖపట్నం వెళ్ళాడు. విశాఖ రచయితల సాహచర్యం రాజేంద్రను రచయితగా తీర్చిదిద్దింది. తిరిగివచ్చి (గ్రంధాలయాల్లో పనిచేస్తూ తన ఓపిక అనుమతించినంతలో మంచి కథలు కొన్ని రాశాడు(గొడుగులాంటి మనిష్కి పిల్లమెచ్చిన వాడు). చిరాకుపుట్టి

| తెలుగుజాతి పత్రిక జువ్మునుడి ఈ ఆగస్టు-2021 |

చేసిన ఒక మంచి పనీ జిల్లా రచయితల సంఘాన్నీ నడపడం, ఈ జిల్లా రచయితల సంఘానికి ప్రత్యేకించి అధ్యక్ష స్థానమంటూ ఒకటి, కార్యదర్శి అంటూ ఒకరూ యింకా కార్యవర్గం మొదలైన బాదర బందీ లేవీ లేవు. దానీ స్విచ్‌ రాజేంద్ర చేతిలోనే వుంది. అప్పుడు బుద్దిపుట్టి ఆన్‌ చేశారు. యిప్పుడు వీల్లేక మిన్నకున్నారు.

“ఇచ్చాశక్తితో మనస్సును తన చెప్పుచేతల్లో ఉంచుకోగలిగినట్టే, రాజేంద్ర ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని గూడా ఇచ్చవచ్చిన చొప్పున మలచుకోగలుగుతున్నాడు.” (చిత్తూరు జిల్లా సాహిత్య చరిత్ర - మధురాంతకం రాజారాం)

1954లో చిత్తూరులో 'కళాపరిషత్‌” అనే సంస్థ పుట్టడాన్ని ఒక చారిత్రక సన్నీవేశంగా జిల్లా రచయితలప్పుడు గుర్తించారు. ఆ సంస్థకు పాటూరు రాజగోపాలనాయుడు గారు అభ్యక్షుదయ్యారు. అందులో రాజేంద్ర ముఖ్యష్షైన కార్యనిర్వాహక బాధ్యతను వహించాడు. రాజేంద్ర గారి ఆరు దశాబ్దాలకు మించిన సాహిత్య జీవితం అప్పుడే ప్రారంభమైంది.

లైభ్రేరియన్‌గా కొద్దికాలం మాత్రమే పనిచేసిన రాజేంద్రగారు త్వరగానే పత్రికారంగానికి వెళ్ళిపోయారు. ఆంధ్రజనత, ఆంధ్రప్రభ, ఈనాడు, ఆంధ్రభూమి దినపత్రికల్లో పనిచేశారు. అందువల్ల ఆయనకు సమకాలీన రాజకీయ పరిస్థితులపైన మంచి అవగాహన వుండేది. కేతు విశ్వనాథరెడ్డి గారు 'ఈభూమి” మాసపత్రికకు సంపాదకులుగా వున్నప్పుడు ఆ పత్రికలో ఆయన తన పేరుతోనే చాలా రాజకీయ వ్యాసాలు రాశారు. సాహిత్య వారపత్రికల సంపాదకుడుగా గూడా రాజేంద్ర

గారు విశిష్టమైన కృషిచేసి తనదైన ప్రత్వేకతను నిరూపించుకున్నారు. ర్యాష్ట్రంలోని రచయితల ప్రతిభల్ని ఆయన నీవుణతతో బేరీజు