పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సొంతవూరయిన 'ఇడైచేవలొలో ఉండినారు. మేము కోవిల్‌పట్టి అనే పేటలో పట్టేగి(రైలు) దిగి, ఆవూరికి పేరేగి(బస్‌)లో వెల్లినాం. కీరాను చూసి అచ్చెరపోయినాను. అడ్డ పంచె పైన చిన్న తుండుగుడ్డ మా తాతలాగానే అనిపించినారు. పుష్పరాజు కంటే పాతిక ముప్పయ్యేళ్లు పెద్దవారు కీరా. వాళ్లిద్దరికీ అంతకుముందే నెళవు ఉందని నాకు తెలియదు. నెళవే కాదు, వాళ్లిద్దరూ మంచి నేస్తాలని తెలిసింది. నేను పుష్పరాజు గారిని “నువ్వు” అంటున్నట్రే, ఆయన కీరాగారినీ “నువ్వు అనే పిలుస్తున్నారు. కొన్ని గంటలపాటు వాళ్లిద్దరూ అట్లా మాట్లాడుకొంటూ ఉండిపోయినారు. నేను చెవులప్పగించి వింటూ ఉండిపోయినాను.

ఆ మాటల నిందా తెలుగుదనమే. తెన్నాటి తెలుగును గురించే సాగినాంబ వారి మాటలు. ఆ మాటలు నడువు తెలినింది, ఇదైచేవల్‌ను తెలుగువాళ్లు నడికావిలి అంటారని, కోవిల్‌పట్టిని గుడిపల్లి అంటారని. కమ్మవాళ్ల నోళ్లలో మరుగున పడిపోయిన ఆ తెలుగు పేర్లు మాదిగపల్లెలో బతికే ఉన్నాయని కూడా తెలిసింది. ముగ్గురమూ కలసి మాదిపల్లె వైపు అడుగులు సాగించి, అక్కడి వారినీ పలుకరించి వచ్చినాం.

ఆ తొలినెళపు తరువాత ఈ ముప్పయేళ్లలో తక్కువంటే ముప్పయిసార్లయినా కలిసుంటాను కీరాగారిని. కొన్నిసార్లు ఎవరినో ఒకరిని వెంటబెట్టుకొని, ఎన్నోసార్లు ఒంటరిగా. కీరాగారి గురించి అందరికీ తెలినిందేమిటంటే, ఆయన తమిళంలో గొవ్వ వాతరి(రచయిత). నెలవునుడి(మాందలికం) తాత. చదివింది బాగా తక్కువ. తమిళానికి చేసిన సేవ గొప్పది. కతలు కొత్తెన(నవలులు, కట్టురలు, పెద్దకతలు, పాందెముందలపు(మదుర, రామనాడదు, తిన్నెవెల్లి తావు) నెలవుమాటల నుడిగంటు(నిగంటువు) వంటివి ఆయన చేతినుండి జులువారినాయి. “ఈడు వచ్చిన వాళ్లకు మటుకే అనే పేరుతో ఆయన వందల పల్లెకతలను సోగుచేసినారు. పల్లెల్లో రచ్చబండల మీద మెద్దవాళ్లు చెప్పుకొంటూ ఉండే పల్లెటూరి బూతుకతలవి. బూతుకతలు అంటే ఆయనకు కనలు శేగేది. “తెల్లదొరలు సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అంటే అవునవును అనీ తలలూపుతాం. ఆ పనిని పెద్దలు ఎప్పటినుండో చేస్తున్నారు” అనేవాడు ఆయన.

“బూతు, చెడ్డమాట, తవ్వుడుకూత అనే మాటలు కాకుండా ఇంకేదయినా మంచిమాట దొరికితే బాగుండును” అన్నాడు ఒకసారి. “ఎందుకు లేదు నాయనా, హోసూరు తెలుగువాళ్లు సంబోగం అనే సంసుక్రుతపు మాటను కొలిమి” అంటారు” అనీ మాఠాడినాను. ఆ మాటను వినీ ఎలమితో ఉప్బితప్బిబ్బు అయినాడు. “నాకు మొదలే తెలిసుంటే కొలిమికతలు అనే పేరును పెట్టుండుదునే” అన్నారు.

ఆయన దగ్గరకు ఎవరు వెళ్లినా ఈ కతలను గురించి చెప్పేవాడు. తను రాసిన వాటికన్నా పెద్దల నోళ్ల నుండి వినిన ఈ కతలను గురించే మైమరిచి చెప్పేవారు. అమెరికాలో ఉంటున్న జంపాలచౌదరి గారూ వారి ఇల్లాలు అరుణగారూ ఇండియాకు వచ్చినపుడు కీరాను చూడాలంటే కమలాపురికి (పాండిచేరిని పాత తెలుగువాళ్లు ఇట్లాగే పిలిచేవాళ్లు) తీసుకెళ్లినాను. వాళ్లకు కూడా ఒక కొలిమికతను చెప్పినారు. అరుణక్క పడిపడి నవ్వినారు.

| తెలుగుజాతి పథ్రిక జువ్మునుడి. ఈ ఆగస్టు-2021

“అవన్నీ తెలుగు కతలు. మా పెద్దవాళ్ల రచ్చబండ కతలు. నేను తమిళంలోకి మార్చి రాసినాను. ఇదంతా మన తెలుగుసొత్తు” అంటారాయన.

తెలుగంటే మకళ్కువెళ్ళ్ళువ ఆయునళు. అంతే కొందరనుకొంటున్నట్లు తెన్నాడులోనీ అన్నీ తావుల తెలుగు మాటలూ పలుకుబడులూ ఆయనకు తెలియవు. ఆయనకు తెలిసింది పాందె మందలపు నల్లరేగడి నేల పలుకుబడి ఒక్కటే. ఆ మండలంలోని ఏోర్రనేలల తెలుగుసొబగుల మీద ఆయనకు పట్టు తక్కువ. తొండ, చోళ, కొంగు, మొరసు వంటి తెన్నాటి తెలుగులను ఆయన ఎరుగదు. పాందెమందలంలో నల్లరేగళ్లలో పంటకోతల తరిలో కళ్లంమిదసలు అనే అలమరి(సంచార) తెగవాళ్లు వచ్చి తెలుగులో పాటలుపాడి, గురుములను(దాన్నాన్ని) పెట్టించుకొనిపోతారనీ, వాళ్లు గుడ్దంకిడి అనేదానిని వాయిస్తారనీ కీఠరాకు తెలుసు. తన కతలలో దీనిని పొదక(రికార్డ్‌) చేనినాడు. అయితే కళ్లంమిడసలు, కుళ్ళను కైఠ అంటారనీ, రూళలను కచ్చికలంటారనీ, ఇటువంటి నూర్ల తెలుగుమాటలు వాళ్లనోళ్లలో ఉన్నాయనీ ఆయనకు తెలియదు. పాండెనాడులోని కమ్మవారు, హరివిల్లును వానవిల్లు అనడం తెలుసు కానీ, కంబళపువారు సింగారచింగు అంటారని ఎరుగరు.

నేను వెళ్లినప్పుడల్లా ఇటువంటి తెలుగుమాటలను, తెలుగు అలవురి తెగల వబచ్చట్లనూ చెవ్పించుకొని వినీ తెగ మురిసిఫోతుందేవాడు. గంటల గంటలు అట్లా మాట్లాదుకొంటూ ఉండేవాళ్లం. పుష్పరాజుగారు కనుమూసినాక, కీరా దగ్గరకు నా పోళలు తక్కువయినాయి. కీరాకు ఆయన కతలూ కొత్తెనలూ కట్టురలూ, ఆయన పోగుచేసిన కాలిమికతలూ అన్నీ తెలుగులోకి రావాలని పెద్ద కోరిక. ఆ పనీ చేయుమని నన్ను బాగా విసిగించేవాడు.

ఆ పనీవల్లనే ఆయనకు నేను ఎదమవుతానని ఇద్దరిలో ఎవరమూ అనుకోలేదు. అవును, ఆయన '“గోపల్ల (గ్రామం? తెలుగులోకి రావడం వలన, మా నడుమ ఎడం సొరిగింది. ఆ మందలను కూదా, ఇక్క్మడయినా ఇప్పుడయినా చెప్పడం నా మోపిక(బాధ్యత..

ఈ కట్టురను వేమన పాడిక(పద్యం)తో మొదలిడినాను. కీరా గురించి చెప్పడానికి వేవున తోడు ఎందుకంటారా? ఇక్కడ కావలసిపడుతుంది. ఏ రాచరికపు తరిలోనో వేమన చెప్పిన మాట అది. మంది ఏలుబడి సాగుతున్నదని మనం నమ్ముకున్న ఇష్టుడు కూడా అదే జరుగుతున్నది.

తెలుగు నానుడి (సాహిత్యం)తో కానీ, తెన్నాటి తెలుగు నుడికారంతో కానీ తమిళంతో కానీ ఆవగింజంత అయినా ఎరుకువ లేని ఒక ఆమె, విహెచ్‌డి పేరుతో వూ నడువు దూరింది. హోసూరులోని నంద్యాల నారాయణరెడ్డి చేత అప్పటికే కీరా 'వేట్టి? కతను “పంచె పేరుతో తెలుగు చేయించున్నాను. అదీ మరొక రెండు కతలూ అప్పటి నడుస్తున్న చరిత్రలో అచ్చయినాయి. నారాయణరెడ్డి “గోపల్ల (గ్రామం”ను తెలుగులోకి తెచ్చినారు. నవ్వ ఆకికలో తొడరిక(సీరియల్‌) గా వచ్చిందది. ఆ గోపల్లెను, కృష్ణగిరి జిల్లా రచయితల సంగం(కృష్ణ ర. సం.) అచ్చువేయాలని అనుకొనింది. నేను కూడా అందులో ఒక మేన(నబ్యుడి)ని. కీరాతో మాట్లాడినాం. ఎలిమీదాతో ఒప్పుకొన్నారు. ఆయన డబ్బులకు ఇబ్బందులు