పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రద్దాంజలి.

స.వెం.రమేళ్‌


రాయంగల (క్రిష్ణ రామానుజ పెరుచూళ్‌ నాయకర్‌ రాజనారాయణన్‌(కీరా)


కనువెలుగు : 14-9-1923 కనుమరుగు : 17-5-2021 'కులము గల్దువాడదు గోత్రంబు గలవాడు విద్ధచేత విర్రవీగువాడు

వసిడిగల్బువాని బానిసకొదుకులు విశ్వదాబిరామ వినుర వేమ” నూరేళ్లకు కాసంత తక్కువ ఈడులో మొన్నానడుమ కీరా కనుమరుగు అయినారు. ఆయన గురించి తమిళంలో బోలెడు కట్టురలు(వ్యాసాలు) వచ్చినాయి. తెలుగులో కూడా రెండో మూడో వచ్చినాయి. కీరా గురించి ఏమీ తెలియనీ ఆవగింజంతయినా ఎరుక లేని వారు ఎత్తిపోతల వతకంతో రానీిన కట్టుర ఒక నాదాకిక(దినపత్రిక)లో వచ్చింది. ఎత్తిపోతలు తెలుగువాళ్లకు తెలిసినంతగా మరొక నుడివారికి తెలియదేమో! మరొక నాదాకికలో, కీరాను కలసి మాట్లాడి వచ్చినట్లు చెప్పుకొన్న మరొకరు, మరుపేరుతో రాసిన తప్పుల తదకల కట్టుర వెలువడింది. అమ్మనుడి నుండి ఒత్తిడి వచ్చిన నాటికి వీటినీ నేను చదివున్నాను. నాలుగునాళ్లు తలపోసినాను. కీరా గురించి తెలుగులో నేను రాయకపోవడం తవ్వు అవుతుంది అనిపించిపది. ముప్పయేళ్లుగా కీరాను ఎరిగిన నేను, అయన గురించి చెప్పకపోవడం తవ్వు అనీపించింది. తెలుగు రాతలు తెలిసిన

| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఈ ఆగస్టు-2021 |


నేలకు(తెలంగాణాంద్రలకు), ఆయనను తొలిసారి నెళవు చేసిన చేను, ఎరిగించకపోవడం తప్పు అనీపించింది. రాతానీ(థొన్‌) మూతను తీసినాను.

కీరాతో నా నెళవును చెప్పుకోవాలంటే ముప్పయ్యేళ్ల వెనక్కి నా మెడను తిప్పాలి. చెన్నపట్నంలో నా చదువు కొనసాగుతున్న నాళ్లవి. మామీద తమిళపెత్తనమేమిటనీ నేను చిటపటలాదుకున్న నాళ్లవి. తమిళం మీద ఆ చిటపటలు నా కుటుంబం నాకు ఇచ్చిపోయిన సొత్తు. ఆ చిటపటలను ఎగదోసి నూనెపోసి కారుచిచ్చుగా మార్చిన వారు కంకణాల పుపష్పరాజు. అప్పుడు నాయూడు పాతికలోపు పుష్పరాజేమో ఏబైకి దగ్గర. మా ఇద్దరి గట్టిచెలిమికి కారణం తెలుగుమీద తమిళపెత్తనం. 19892లోనో 1993లోనో ఆయన ఒక కతను నా చేతపెట్టి చదువు అన్నాడు. కత పేరు వేట్టి(తెలుగులో పంచె). చిన్నకత. చెప్పుకో తగినంత గొప్ప కతేమీ కాదు. కానీ వెంటనే మళ్లీ చదవాలనీవించింది. వవూూడు నాలుగుసార్లు అప్పటికప్పుడే చదివినాను. ఆనిడి(స్వతంత్ర) పోరాటం జరుగుతున్న నాళ్లలో, ఒక పొలంకాపు తన చివరి పంచె చిరుగులను కప్పి పెట్టదానీకి పదిన పాటును చెప్పిన కత అది. నన్ను అంతగా లాగింది ఆకతలోని తరుగు(వస్తువు) కాదు, అందులోని నుడి. అది తమిళకత, కానీ చదువుతుంటే తమిళాన్ని చదువుతున్నట్లు లేదు. తెలుగులో చదువుతున్నట్లే ఉంది. ఆ నుడిలో ఏదో తీయదనం, ఏదో మెత్తవనం, ఏదో నెత్తావి. అది తమిళ కతే. కానీ కాదు. అది తెన్నాటి(ఇప్పటి తమిళనాటి) తెలుగు కత. మరునాడు కదవు(తెలుగులో తలుపు) కతను ఇచ్చినాడు పుష్పరాజబ్బ. అదీ అంతే. ఈ రెండు కతలను రాసిన వారు కీరా. ఇంకొక పదినాళ్లకు గోపల్ల (గ్రామం(ెలుగులో గోపల్లె) అనే కొత్తైెన(నవల)ను ఇచ్చినాడు. అదీ కీరా రాసిందే. అంతే కీరా పిచ్చి పట్టేసింది నాకు.

నాకంటే పుష్పరాజుగారు పాతిక ముప్పయేళ్లు పెద్ద. అయినా ఆయన్ను 'మీరు” అనేవాడిని కాను. “నువ్వు అనే పిలిచేవాడిని. అంత చనువు నాకు. ఇద్దరమూ తెన్నాటి తెలుగులో మాట్లాడుకొనేవాళ్లం, పోట్లాడుకొనేవాళ్లం. “గోపల్లగ్రామం” నాకు పిచ్చిగా నచ్చేసిందిని ఆయనతో అన్నాను. అంతే మా ఇద్దరి నడుమా పెనుగువ(వాదన) వెొుదలయింది. గోపల్లగ్రామం వలన తెన్నాటి తెలుగువారికి పెద్దకీడు జరిగిపోయిందని పెనగినారు ఆయన. 'రమేశా, నువ్వు ఆ నుడి తగులం(వ్యామోహరులో చిక్కుకానీపోయి, నీక్మం మరిచివు. మనల్ని అందరినీ తమిళులు వందేరి(వలసవాడు) అని, ఈ వేలను విడచిపోవాలనీ అంటున్నారు. ఆ వందేరి మాటకు ఊతమిచ్చేదే గోపల్ల గ్రామం? అనీ పుష్పరాజుగారు అంటుంటే నివ్వెరపోయాను.

ఒకనాడు నేనూ పుష్పరాజుగారు కలసి కీరాను చూడదానిని చెన్నవట్నం నుండి బయలుదేరినాం. అవ్చుడాయన వాళ్ల