పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ విగ్రహాలదగ్గరకెళ్ళి, చేతులతో కొంచెం మట్టిని తొలగించాం. చుట్టుపక్కల వాళ్లకు చెప్పి, వాటిని కాపాడుకోవాలని చెప్పాం. వాళ్ళూ అలాగేననీ మౌనంగా తలూపారు. ఆ విగ్రహాలుకూదా మౌనంగానే జరిగిందంతా చూస్తూ, మానవస్వార్ధం ముందు తమ మహిమలు తలొంచక తప్పలేదని దైవత్వాన్ని పోగొట్టుకొని, దీనత్వాన్ని సంతరించుకున్నాయి. కందూరు చోళులకాలానికి చెందిన నంది పీఠలలోతుదాకా మట్టిలో కూరుకుపోయి, రంకెవేసే శక్తిని కోల్పోయింది. చేతుల్లో కత్తి దాలు పట్టుకాన్న నాలుగు నాగదేవతా శిల్పాలు, ఒక చేతిలో పద్మం, మరో చేతిలో ఒక పండును పట్టుకొన్న మరో నాగదేవత, ఆయుర్వేద మందులు నూరుకునే సానరాయి, కల్వం, నిర్తక్ష్యానికి గురవటం పట్ల మేమంతా విస్తుపోయి విజ్ఞప్తి చేయటం మినహా ఏమీ చేయలేక మళ్లీ మా ప్రయాణం కొనసాగించాం.


అసలు చూదాలనుకొన్న కందూరుకు ఒక పావుగంటలో చేరుకొన్నాం. అశోక్‌గౌడ్‌ తన మిత్రుదైన కందూరు సర్పంచి శ్రీకాంత్‌కు ఫోన్‌చేసి, అక్మడికాస్తున్నట్లు తెలిపాడు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలిసిన సర్పంచి, మాకు చాయ్‌ తాపించాడు. “అక్కడ ఇనుపయుగపు రాక్షస బండలుండాలి గదా చూద్దామా” అన్నాను. వెంటనే సర్పంచి, ఆవూరుకు చెందిన మరో ఇద్దరు, మేం ముగ్గురం అందరం కలసి ఊరుబయట తూర్పుదిక్కున గల చెల్మభూమికి వెళ్ళాం. నాలుగైదు సమాధులు మాత్రమే ఉన్నాయి. అంతకుముందు అక్మడ వంద సమాధులుందేవనీ, వ్యవసాయ పనుల్లో భాగంగా వాటిని తాలగించారనీ చెప్పినపుడు నిశ్చేష్టుజ్జైన నాకు, చరిత్ర

| తెలుగుజాతి పత్రిక ఖువ్చునుతె ఊఉ

చెరిగిపోతున్నందుకు బాధేసి, కనీసం వీటినైనా కాపాడుకోందనీ ప్రాధేయపడ్డాను. ఇంతలో మాతో వచ్చిన ఒకతను, సార్‌ ఇదిగో ఈ రాక్షసబండ చుట్టూఉన్న రాళ్లను తొలగిస్తూ ఉండగా, ఒక పెద్దరాయి, దానికింద ఎ(ర్రటి, నలుపు ఎరుపు మట్టీ పొత్రలు బయల్చ్పడినాయని చెప్పి, అక్కడున్న కుండ పెంకుల్ని ఏరి చూపించాడు. నలుపు, నలువు-ఎరుపు కుండపెంకులు మెరుస్తూ, ఆనాటి కుమ్మర్ల పనితనానికి మచ్చుతునకలుగా ఉన్నాయి. ఇలా వాటినీ తొలగించటం తప్పని చెప్పి ఇవి క్రీ. పూ1000 సంవత్సరాలనాటి అప్పటి మానవుల సమాధులనీ, వారు ఇనుమును కనిపెట్టి, రకరకాల పనీముట్లు తయారుచేసుకొని, వ్యవసాయాన్ని ముమ్మరంగా చేసి, చక్కటి గ్రామీణ వ్యవస్థకు శ్రీకారం చుట్టారనీ, వాటి చరిత్రను చెప్పాను. అలానా, అయితే వీటినీ ఇలానే కాపాడుకాంటామని, సర్పంచి హామీ ఇవ్వటంతో వెనుదిరిగిన నన్ను మరో గ్రామస్తుడు పిలిచి 'సార్‌ ఇక్కడికి రండి చుట్టూ రెండు వరుసల్లో నున్న పెద్దరాళ్ల సమాధి ఇది అని చూపించాడు. సాధారణంగా అఇనుపయుగం మనుషులు చనిపోయినపుడు శవాల్ని గుంటలోపూద్చి, చుట్టూ ఒక్కోసారి బందల్ని నిలిపి, దానీపైన మరో బండను కప్పి, మట్టితో నింపి, చుట్టూ గుండ్రంగా పెద్దపెట్ట గుండురాళ్ళను పాతి సమాధిని నిర్మిస్తారు. కానీ ఇక్కడ బయట వరుసకు ఒకమీటరు లోపల గుండ్రంగా నిలిపిన మరో గుందురాళ్ల వరస కనిపించింది. ఇది అరుదైన సంఘటన.

చూడాల్సినవి చూచిపోతుండగా, సర్బంచి శ్రీకాంత్‌ మమ్మల్ని ఒకచోట ఆపి, మురుగు కాల్వ తీస్తుంటే ఈ విగ్రహం


ఆగస్తు-2021 రి

బయటపడిందని ముట్టుకుంటే ఏమ్టైతుందోననీ ఇక్కదే వదిలేశామనీ చెప్పాడు. దగ్గరకెళ్ళి చూచిన నాకు కళ్లు జిగేలుమనిపించాయి. నాలుగు అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పు, ఆరంగుళాల మందంతో నల్ల శానపు రాతితో అత్యంత రూపలావణ్యంగా అన్ని ఆభరణాలతో తీర్చిదిద్దిన చెన్నకేశవుని విగ్రహం అది. ప్రభామండల తోరణ పైభాగం పగిలిపోయింది. కళ్యాణీచాళుక్య సంప్రదాయంలో నున్న ఈ విగ్రహాన్ని కందూరు చోళరాజులు చెక్కించారు. క్రీ.శ. 11వ శతాబ్దినాటి ఈ విగ్రహాన్ని దానికిందే ఉన్న శివలింగపానపట్టం, ఒకప్పుడు ధూప,దీప నైవేద్యాలతోపాటు సుగంధ పరిమళాలను ఆస్వాదించి, కాలగతినీ మురుగు కాల్వ వెదజల్లే దుర్గంధ గుబాళింపును భరిస్తూ, కాలం వెళ్లబుచ్చుతున్నాయి. చారిత్రక 'ప్రాధాన్యతగల ఈ విగ్రహాన్ని పంచాయితీ కార్యాలయానికి తరలించి భవ్రపరచమని సర్పంచినీ వేడుకున్నాను. ఆయన


తలూపాడు. నిట్టూర్పు, నిర్లిప్తకల మధ్య ముందుకు సాగిన మాకు చెరువుకట్టపైన గల కోటగోడ శిధిలాలు చిన్నపాటి సముద్రాన్ని తలపించిన కందూరు చెరువుకు చెలియలి కట్టగా తోచింది. కొంచెం ముందుకు సాగిన మాకు, అలలితాసనంలో, ఒకచేత దంతం,