పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పడుతున్నాయి. ఇంతలో ఆవూరి సర్పంచ్‌ కుమార్‌ వచ్చాడు. అతనీకి ఆలయం 800 ఏళ్లనాటిదని, కాపాడుకొనీ, తరువాతి తరాలకు అందిస్తే బాగుంటుందన్న నాఅఖిప్రాయానీకి వంతబలికి మేమూ అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు. బూర్జుల రామకృష్ణారావుగారి అన్న కూతురు ఆలయ పునరుద్ధరణకు పూనుకోగా, స్థానిక ఎం.ఎల్‌.ఏ. అంజయ్యుగారు, చారవతీసుకానీ, దేవాదాయ శాఖకు ఉత్తరం రాయగా, ఆదాయంలేనీ ఏ ఆలయాన్నీ పునరిద్ధరించటం కుదరదన్సీ, తెలంగాణ వారసత్వ (పురావస్తు) శాఖను సంప్రదించమని ఉచిత సలహానిచ్చి, తప్పుకొంది దేవాదాయ శాఖ. పట్టు వదలని ఎం.ఎల్‌.ఏ. మళ్లీ పురావస్తు శాఖకు మరో లేఖ రాయగా, ఆ దేవాలయం మా కక్షిత కట్టడం కాదనీ, మేమేం చేయలేమని చేతులు దులుపుకుంది తెలంగాణ వారసత్వశాఖ. ఇలా రెండు శాఖల దోబూచులాటలో కొట్టుమిట్టాడుతున్న బూరుగుల కాకతీయ దేవాలయం, యధావిధిగా తన ఉనీకిలో తాను మిన్నకుండిపోయింది. ఇంకేం చేస్తుంది మరి? మడిలేదు, మాన్యంలేదు, ఎవరికీ పట్టని అనాధలా అలాగే ఉండిపోయింది.

నల్లమల నేచర్‌ ఫౌందేషన్‌ కృష్ణంరాజు తాను చుట్టుపక్కల గల చిన్నచిన్న పరిశమల వారిని ప్రాధేయపడగా పునరుద్ధరణ ఖర్చులో కాంత భరిస్తామన్నారన్న మాటవిని ఆ శిధిలాలయం మదిలో ఆనందం తొంగిచూచింది. సర్పంచి కుమార్‌ కల్పించుకొని, “గామస్ఫులంకూడా చందాలేసుకొంటాం, ఎలాగైనా ఈ ఆలయానికి గత వైభవం తీసుకొద్దాం” అని చెప్పటంతో నాక్కూడా కొంత ఊరట కలిగింది. ఎక్కువగా ఖర్చుకాదు, పడిపోయిన రాళ్లను యథాతథంగా వాడుకోవచ్చని వలుచుకుపోయిన మూడు గర్భాలయాలు, మందపం కప్పులకు మాత్రం కొత్త రాళ్ళు కావాలని చెప్పాను. ప్రభుత్వం చేయూత దక్మనందున, విరాళాల ద్వారా బాగుచేయిస్తే తాను పూనుకుంటనన్నాడు సర్పంచి.

దానీకితోదుగా, కృష్ణంరాజుకూడ తన వంతు ప్రయత్నాలు చేస్తానన్నాడు. మళ్లీ మరో శిధిలాలయం పదిలమౌతున్నందుకు నాకెంతో ఆనంవమనిపించఛింది. వెలవెలబోతున్న ఆలయం కళకళలాడుతుందన్న ఆశ నన్ను పరవశుణ్ణి చేసింది.

మళ్లీ కారెళక్మాము. గంట సేపట్లో భఖభూత్‌పూర్‌ చేరుకొన్నాం. నేను


పునరుద్ధరించిన ఆలయాన్ని కలియదిరిగి, అక్కడున్న కళ్యాణ చాళుక్యచక్రవర్తి ఆరో విక్రమాదిత్యుని క్రీ.శ. 1121 నాటి శాసనాన్నీ కాకతీయ గణపతి దేవుని క్రీ.శ. 1259 నాటి శాసనాన్ని కాకతీయ రుద్రమదేవి (మల్యాలగుందని)

క్రీ.శ 1272 నాటి శాసనాన్ని కాకతీయ రుద్రమదేవి క్రి.ళ. 1277 నాటి (మల్యాల గుందనీ భార్య కుప్పాంబీక) శాసనాలను ఒకసారి తడిమి చూచి 900ల ఏళ్ళనాటి చరిత్రను నెమరు వేసుకొన్నాను. మళ్లీ బయలుదేరి కందూరు పోదామనుకుంటుందగా, భూత్‌పూర్‌కు చెందిన పంచవటి ఆసుపత్రి అధినేత శ్రీకాంత్‌రెడ్డి కలిశారు. చాన్నాళ్ళ తరువాత కలిశాం. “మీరు పోల్మంపల్లిలో కట్టిన ఆలయాన్ని చూద్దురుగాని రండి” అన్నారు. నేను, గోపాల్‌ కలిసి కట్టిన ఆ ఆలయాన్ని చూడాలనీపించింది. నేను ఆయన కారులో ఎక్కి నేరుగా పోల్కంపల్లి కొండమీద గజప్పష్టాకారంలో కాలంలో నీర్మించిన సుశందరతర ఆలయాన్ని చూచి, ఇది నిజంగా నేను కట్టిన ఆలయమేనా అని ఆశ్చర్యపోయాను. ఇది పూర్తిగా కొత్త ఆలయం. ఆలయంలోపల శిల్పాలు, అలంకరణ భక్తులనిట్టే ఆకర్షిస్తున్నాయి. ఆలయం నిర్మించటం ఒక ఎత్తైతే,

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

నీర్వహణకు నెలకు 50 వేలు ఖర్చుపెట్టి, భక్తులకు సౌకర్వాలు కల్పించటంలో నిజమైన ఆనందముందన్నారు శ్రీకాంత్‌రెడ్డి. వాళ్లనాన్న నరసింహారెడ్డి ఎం.ఎల్‌.సీ. నీతిమంతుడు. సేవా తత్పరుడు, దైవథక్తిగలవాడు. ఆయన గుణగణాలను పుణికిపుచ్చుకాన్న శ్రీకాంత్‌రెడ్డిలో కూడా ఆధ్యాత్మికత, దాతృత్వం అలానే వంటబట్టాయి. ఆయన అక్కడే ఉంటానని చెప్పగా, నేను, కృష్ణంరాజు బయలుదేరాం.

తిరిగి వెళ్తుండగా పోల్మంపల్లి చెరువు కట్టమీవ వరసగా విగ్రహాలు కనీపించాయి, కారాపి దిగి, విగ్రహాలదగ్గరకు వెళ్ళాం. నాతోపాటు కృష్ణంరాజు, భూత్‌పూర్‌ దేవాలయ కమిటీ సభ్యులు, అశోక్‌గౌడ్‌ ఉన్నారు. వరుసగా ఉన్న ఒక విరిగిన విగ్రహం, వీరభద్రుడు, విరిగిన తల, ఒకదేవత, మరో రెండు తలలు, తలలేని, నిలబడి ఉన్న ఖైరవుడు, ఒక శివభక్తుడు, సూర్య విగ్రహాలు వెయ్యేళ్ళ చరిత్రను ఒడిసి పట్టుకొని, ఒద్దికగా నిలబడి ఉన్నాయి. ఒకటి రెండు రాష్ట్రకూట, ఒకటి కళ్యాణచాళుక్య, మరో రెండు కాకతీయుల కాలానికి చెందిన ఈ శిల్పాలు పోల్కంపల్లి గ్రామ చరిత్రకు సాక్ష్యంగా ఉన్నాయి.

ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు ముందుకొచ్చి విరిగిపోయి, వారిగిపోయిన ఈ దేవతామూర్తుల్ని మానవతా దృక్పంధంతోనైనా, వాటిపైన కప్పు ఏర్పరచి, భద్రపరచకపోతారా అన్న ఆలోచనతో చెరువుకట్టదిగి, కారులో ఎక్కానోలేదో, ఎదురుగా మరో హృదయ విదారక దృశ్యం నా కంటపడింది. గ్రామ అభివృద్దిలో భాగంగా, రోడ్డు వేస్తున్న కాంట్రాక్టరు, నాగులకట్ట అనేచోట, ఏకంగా నాలుగు నాగదేవతలు, ఒక నంది విగ్రహంపైన ఎక్సవేటర్‌తో మట్టినితెచ్చి, పరచి, చదును చేశాడు. చుట్టు పక్మలవాళ్లు చూస్తూనే ఉన్నారుగానీ, తరతరాలుగా పూజలందుకాంటున్న నాగదేవతలు మట్టిపొరల్లో కనుమరుగౌతున్నాా ఆ విగ్రహాలను అలా పూద్చడమేమిటని అడిగిన పాపానపోలేదు. నేను,కృష్ణంరాజు, అశోక్‌గౌద్‌ కిందికిదిగి