పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇంత వైవిధ్యం, ఖాషా బాహుళ్యం ఉన్నప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో వెలువదే సాహిత్యంలో మౌలికమైన సారూప్యం గోచరిస్తుంది. అందుకే వివిధ భాషల్లో రాసినా భారతీయ సాహిత్యమంతా ఒక్కటే అనే భావాన్ని దా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సూత్రప్రాయంగా చెప్పారు. ఈ సారూప్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు సర్వ భాషాసాహిత్యాలు ఆత్మీయంగానే అగుపిస్తాయి. ఇలాంటి నదవగాహన భాషాసమ్రైక్యతకు మూల ఖిత్తిక అవుతుంది. ఈ వైవిధ్యంతో భాషారంగాన్నీ సాహిత్యరంగాన్నీ సుసంపన్నం చేసుకోడానికి శతాబ్టాల నుంచి మన పూర్వీకులు కృషి చేశారు. దేశమంతటా ఒకే భాష వుంటే మనకు ఇన్ని గ్రంథాలు, ఇంత విస్తృత సాహిత్యం, ఇందరు మహాకవులు వుందేవారు కారేమో! సంస్కృతంలో ఆదికవి వాల్మీకి రామాయణాన్ని రచించినా అనేక ప్రాంతీయ భాషల్లో దానీకి దీటుగా నీలిచే రామాయణాలెన్నో అవతరించాయి. అనువాదాలు కూడా ఉన్నత సాహితీ ప్రాగల్ఫ్బ్యాన్ని అందుకున్నాయి. తమిళంలో 'కంబ రామాయణం), హిందీలో తులసీదాస్‌ “రామచరిత మానస్‌”, తెలుగులో “భాన్మర రామాయణం), మలయాళంలో “ఎజుత్తచ్చన్‌ ఆధ్యాత్మ రామాయణం)”, మరాఠీలో *' ఏకనాథ్‌ రామాయణం” మొదలైనవి కేవలం భారతీయులే కాక విశ్వపొరులు చదివి, ఆనందించే గ్రంథాలు.

ఇదే విధమైన పరిణామాన్న్మీ అభ్యువయ వికాసాలనూ, ప్రతి రంగానికీ అనువర్తించుకోవచ్చు. అప్పుడు భారతీయ బాషా సాహిత్యాలు, కళా సంస్కృతులు, ఆచార సంప్రదాయాలు మొదబైనవి బహుముఖంగా శోఖిల్లుతున్న పూర్ణ స్వరూపం మన కళ్ళల్లో మెదులుతుంది. అది మాతృభారతి సమలంకృత స్వరూపానికి మణిముకురంగా నీలుస్తుంది.

ఇందుకు భిన్నంగా ఈ దృష్టిలో, ఆలోచనా రీతిలో వైపరీత్యం ఉన్నట్లయితే సమైక్యతా రూప చిత్రణ మేధకు అందదు. అడుగడుగునా అడ్జ్దుగోడలు నిలుస్తాయి. ఆత్మీయ భావం కొరవడుతుంది. స్వార్ధం ముందుకు వచ్చి ప్రతి దానికి పరిధులు ఏర్పర్చుకునే సంకుచిత మనస్తత్వం అలవడుతుంది. పొరుగు వారినీ మన్నించి, ప్రేమించగల తత్త్వం మసక బారుతుంది. ఇది సమైక్య భావానికీ దేశ సమగ్రతా చింతనకూ గొడ్డలిపెట్టు.

విశాల ఖభావసరళి లోపించినప్పుడు వైషమ్యాలు పెరుగుతాయి. ప్రతికూల వైఖరి, అమిత్ర భావం ఇనుమడిస్తాయి. క్రమంగా ఘర్షణలు ఏర్పడతాయి. దౌర్జన్యాలు చెలరేగుతాయి. ఈ మాదిరి అవాంఛనీయ పరిస్థితులు ప్రపంచంలోని అనేక దేశాల్లో తలెత్తుతూనేవున్నాయి. హింసా ప్రవృత్తి విజృంభించి శాంతియుత వ్రజా జీవనాన్ని భంగపరుస్తున్నది. ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు, అంతకంటే విలువైన ప్రాణాలు ఆవిరవుతున్నాయి. ఏ దేశానికీ ఈ పరిస్థితి వాంఛనీయం కాదు. అందులోనూ, భారతదేశం లాంటి వర్థమాన దేశం ఇలాంటి పరిస్థితుల వల్ల విపరీతంగా నష్టపోతుంది. ఆరోగ్యం, జనాభా, ఉపాధి మొదలైన రంగాల్లో ఏర్పడుతున్న నమస్యలను సంఘీభావంతో, సమిష్టి దృక్పథంతో ఎదుర్మోవలసిన ఈ తరుణంలో సమాజ ప్రగతిని కుంటు పరిస్తే దేశం తట్టుకోలేదు. ఈ సత్యాన్ని (గ్రహించి, చిత్తశుద్ధితో దేశాభ్యువయం కోసం సంఘటితంగా కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా వుంది.

ముఖ్యంగా యబవళులూ, విద్యార్థులూ ఈ బృహత్తర

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

కార్యతవముంలో తవు వంతు పాతను (తికరణ శుద్దితో నిర్వహించవలసి వుంది. ఒక సందర్భంలో వివేకానందుడు “భారతదేశ ధూళి నాకు పరమ పవిత్రం. భారతదేశం నాకు పవిత్ర క్షేతం. ఈ దేశం ఉద్దరణ చెంది తీరుతుంది. ఏ బాహ్య శక్తీ ఈ దేశాన్ని ఇంక నీరోధించలేదు” అని ఉద్దాటించారు. ఆ మహనీయుని ఆకాంక్షకు చెరిగిపోని ఆకృతి కలిగించే బాధ్యత పౌరులందరిదీ.

దేశ భవిష్యత్తును తీర్చిద్దిద్దదంలోనూ, జూతినీ శక్తిమంతంగా పవునర్నిర్మించండంలోనూ యువకులు వధాన ఖూమితను వహించవలసిన సమయమిది. 18 సంవత్సరాలకే ఇప్పుడు ఓటు హక్కు చేకూరుతున్నది. దేశాధికారాన్ని నిర్ణయించే అవకాశం కూదా వారికుంది. దేశంలో సాంకేతిక విద్యావ్యాప్తికి ఆనాదే పండిత జవహార్‌లాల్‌ నెహ్రూ పునాదులు వేశారు. భారతదేశం శీఘ్రగతిని అభివృద్ది చెంది, పురోగామి దేశాలతో సరితూగాలంటే దేశంలో వైజ్ఞానిక విద్య ఎక్కువగా వ్యాప్తి కావాలనీ ఆయన భావించారు. ఆయన “విజ్ఞాన శాస్త్రం పట్ల నాకు అత్యంత విశ్వాసం వుంది. శాప్రీయ దృక్పథం ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేయగలుగుతుంది” అని అన్నారు.

ఇమ్బుదు విద్యా విధానం వినూత్న రూవం సంతరించుకుంటున్నది. రాజీవ్‌ గాంధీ సారథ్యాన రూపుదిద్దుకున్న నూతన జాతీయ విద్యా విధానం దీనికి భూమికగా వుంది. విద్యా వ్యవస్థ సర్వ సమగ్రంగా నిర్వహించవలసిన పాత్రను నిర్వహించడమే కాకుందా ఈ జాతీయ విద్వా విధానం విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శక సూత్రాలు నిన్టేశించింది. వాటిని ఈ స్నాతకోత్సవ సందర్భంలో ఒక్కసారి గుర్తు చేసుకోవడం సముచితమని భావిస్తున్నాను.

ఈ నూతన విద్యా విదానంలో శాస్త, సాంకేతిక, వృత్తి విద్యలకూ సార్వత్రిక, వయోజన విద్యలకూ, బాలికల విద్యలకూ, సాంస్కృతిక వికాసానికి దోహదం చేసే విద్యకూ ప్రత్యేక ప్రాధాన్యం వుంటుంది. ఈ విధానం విద్యారంగంలో సమతను కాంక్షిస్తుంది. జాతీయ సమ(గ్రతను ఇది రక్షిస్తుంది. ఉమ్మడి పాఠ్య ప్రణాళిక ఈ విధానంలోని ఒక ప్రత్యేకత.

ఈ జాతీయ విద్వా విధానం విద్యా రంగంలో నూతన స్ఫూర్తిని 'పెంపొందించగలదనీ ఆశిస్తున్నాను.

ఈ సందర్భంలో ఆంధప్రదేశ్‌ పురోగామిగా వుండడం ప్రశంననీయం. కేంద్రం ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని స్థాపెంచక ముందే దేశంలో ప్రప్రథమంగా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, ఈ దిశలో మార్గదర్శకమైైంది.

కొత్తగా స్థాపించిన తెలుగు విశ్వవిద్యాలయం బాలారిష్టాలను దాటి బోధన, పరిశోధన, 'ప్రచురణలతో పాటు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షుల నీవేదిక ద్వారా తెలునుకుని సంతోషిస్తున్నాను. ఇదొక విలక్షణమైన ఉన్నత విద్యా సంస్థ. భాషా సాహిత్యాలకూ, కళా సంస్మ్కృతులకూ ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం లభించడం ముదావహం. వ్యక్తిత్వ విలసనానీకి సంస్కృతి, కళలు ఎంతో దోహదం చేస్తాయి. “సంస్కృతి సమన్మందుల మధ్యా, ఉన్నతుల మధ్యా వ్యక్తికి సముచిత స్థానం సమకూరుస్తుంది. అతనిలో ఉదాత్తమైన స్పందనను కలిగిస్తుంది? అనీ ఎమర్శన్‌ మహాశయుడు