పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏనాడో అన్నాడు.

ఈ విశ్వవిద్యాలయంలో తెలుగు మాధ్యమంలో బోధన జరుగుతున్నందుకు కూడా నా హర్షం ప్రకటిస్తున్నాను. ప్రాంతీయ ఖావషల్లో విద్యాబోధన, పరిపాలనా నిర్వహాణ జరగాలని స్వరాజ్యోద్యమంలో ఒక భాగంగా విస్తృత కృషి జరిగిన సత్యం మీకు జెలిసిందే. మహాత్ముని నిర్మాణ కార్యక్రమంలో ప్రాంతీయ భాషల అభివృద్ధి ముఖ్యాంశంగా వుంది. మాచ్చభాషల గురించి చెబుతూ ఒక సందర్భంలో గాంధీజీ - “నాకు ఇంగ్లీష్‌ భాష పట్ల వైర భావం ఎన్నడూ లేదు. అది అపారమైన జ్ఞాన నిధి అని నాకు తెలుసు. అయితే మనం మన మాజచ్చభాషలను విద్యా రంగంలో మాధ్యమాలుగా చేసేందుకు బృహత్తరమైన ప్రయత్నం చేయాలి” అని అన్నారు. ఆయన ఇంకా = * చాలా మంది మన దేశ భాషల్లో పెద్ద పెద్ద భావాలను వ్యక్త పరచేందుకు తగిన పదజాలం లేదని సందేహిస్తూ వుంటారు. అయితే, అలాంటి పదజాలం లేకపోవడం అ భాషల లోపం కాదు. అది మన లోపమే. భాషల్ని వాడుకలోనికి పీసుకువచ్చి అభివృద్ధి పరచడం మన కర్తవ్యం అని హెచ్చరించారు.

జవహార్‌ లాల్‌ నెహూ ఒక సందర్భంలో “వజలు తము మాచ్చభాషల అధారంగానే విద్యాపరంగానూ, సాంన్కృతిక పరంగానూ వికాసం చెందుజారనదం యదారలి అని ఉద్దాటించారు.

అంధ్రవ్రదేశ్‌లో ఏర్పాటైన తెలుగు అకాడమీ బోధనకు అవసరమయ్యే పదజాలాన్నీ (గంథాలనూ రూపొందించడంలో అవిరకళంగా కృషి చేస్తూ వుండడం మెచ్చదగింది. పరిపాలనా రంగంలో తెలుగును అభివృద్ధి పరిచేందుకు అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్రజ్యేక శ్రద్ధ వహించడం గమనార్హం. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని 'అధీకార భాషా సంఘం” అంధ్రప్రదేశ్‌ లో పనిచేస్తూ వున్న విషయం ఈ సందర్భంలో పేళ్కొానవలసి వుంది.

ఈ రాష్ట్రంలో ప్రభుత్వం త్రిభాషా సూత్రాన్ని పటిష్టంగా అమలు పరచడం సంతోషదాయకం.

తెలుగు విశ్వవిద్యాలయ అధ్యయనాంశంలో లలిత కళలకు ప్రత్యేక స్థానం వున్నట్లు వెల్లడవుతున్నది. నృత్యం, సంగీతం, జానపద కళలు మొదలైనవి భాషా పరిభులకు అతీతమైనవి. సార్వజనీనత, సార్వకాలికత వీటి ప్రత్యేకత. ఆనందాన్ని పంచడంతో పాటు ఇవి ప్రజల్ని సన్నిహితుల్ని చేస్తాయి. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి.

దేశాభ్యుదయంలో, జాతీ ప్రగతిలో సాంస్కృతిక రంగం కీలక స్థానం వహిస్తుంది. జాతి సమ(గ్రతను పరిపుష్టం చేయడంలో కళలు వహించే పాత్ర బృహత్తరమైనది. సమ్రైక్యతా భావాన్ని కేవలం రాజకీయానికే పరిమితం చేయకూడదు. అలాంటి సమ్రైక్యతలో పరిపూర్ణత లోపించే అవకాశముంది. సాంస్కృతిక సమైక్యత వల్లనే నిజమైన భావ సమైక్యత సిద్దిస్తుందనడంలో సందేహం లేదు. వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ సంప్రదాయాలు సమైక్యమైనపుదే సమధిక సుస్థిరత, సంపూర్ణ సమైక్యత నెలకొంటాయి. అందుకే ఈ దిశగా మన దృష్టిని సారించవలసి వుంది.

ఆంధ్రప్రదేశ్‌ కళలకు కాణాచి. కూచిపూడి నృత్య సంప్రదాయం తెలుగుజాతి నాట్య ప్రపంచానికి అందించిన ఎనలేని కానుక. కూచిపూడి నృత్యంలో తెలుగు విశ్వవిద్యాలయం ఎం.ఏ కోర్సు నిర్వహించడం సముచితంగా వుంది. తెలుగు జాతికి గర్వకారణమైన మరొక నాట్య శైలి పేరిణి శివతాండవం. ఇది వీరరస ప్రధానమైన

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

నాట్య రీతి. జాయప సేనాని నృత్య రత్నావళి దీనికి వర్తించే శాస్త్ర (గ్రంథం. ఇందులోని శ్లోకాలను ఆధారంగా చేసుకుని వరంగల్‌ సమీపంలోని రామప్ప ఆలయంలో వివిధ భంగిమల్లో అద్భుత శిల్పాలు చెక్కబడి వున్నాయి. ఈ నాట్య సంప్రదాయానికి తగిన ప్రచారం లఅఖీస్తూ వుండడం మెచ్చతగింది.

లలిత కళల సర్వతోముఖ వికాసానికి ఈనాడు మరింత కృషి అవసరం. ప్రసార సాధనాలు శీఘ్రగతినీ అభివృద్ధి చెందుతున్నాయి. అవి ప్రజలపైన బలీయ ప్రభావం చూపుకున్నాయి. ఈ సాధనాల ద్వారా (ప్రజానీకానికి అందే కార్యక్రమాలు విజ్ఞానదాయకంగానూ, వినోదాత్మకంగానూ వుండాలి. ఇందుకు సుశిక్షితులైన యువతీయువకులు బద్ద కంకణులు కావాలి. చలన చిత్రాలు, రంగస్థల కార్యక్రమాలు, ప్రదర్శన కళలు, ఆకాశవాణి, దూరదర్శన్‌ (ప్రసారాలు - ఏవైనా సరే ప్రజల్లో ఏ మార్గాన్ని కూడా పెడమార్గం పట్టించేవిగా వుండకూడదు. ఈ విషయంలో విజ్ఞులు సర్వదా అప్రమత్తంగా వుండాలి. ఈ విశ్వవిద్యాలయం 'నటనాకళి లో త్వరలో ఒక కోర్సును ప్రవేశపెట్టడం సముచితంగా వుంది. అన్ని రంగాల్లోనూ ఉత్తమ శిక్షణకు ఇది వేదిక కావాలి.

ఈనాటి స్నాతకోత్సవంలో పరిశోధకులు, విద్యార్థులు పట్టాలు స్వీకరించారు. (ప్రతిభావంతులైన వారికి స్వర్ణ పతకాలు లభించాయి. ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణులై భావి జీవితంలో (ప్రవేశిస్తున్న ఈ శుభసందర్భంలో విద్యార్థుల్ని అభినందిస్తున్నాను. ఇందుకు ఎంతో (శ్రమించి అధ్యావక బృందాన్నీ ఉపాధ్యక్తులనూ కూడా అభినందిస్తున్నాను.

ఈ విద్యార్థులు భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోగలరనీ, దేశ సర్వ సమ[గ్రతళూ, అభ్యుదయానికీ దోహదం చేయగలరని విశ్వసిస్తున్నాను.

ఈనాటి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్లు అందుకున్న ప్రముఖ పత్రికా సంపాదకులు దా. నందూరి రామమోహనరావు గారికీ, ప్రసిద్ద సినీనటులు, భాషా సాహితీవేత్తలు, దా. కొంగర జస్టయ్య గారికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.

ఈ స్నాతకోత్సవంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు తెలుగు విశ్వవిద్యాలయం వారికి మరోసారి నా కృతజ్ఞతలు తెలుపుతూ, అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను”. (అ

కథల పోట్‌ ఇప్పుడైతే సంకరజాతి జెద్నీ ఆవులు వచ్చి పాలు కావలసినన్ని అందుబాటుకు వచ్చాయి. ఒకానొకనాడు పాలిచ్చి ఆదుకాన్నవి ఎనుములే(బర్రెలు) పల్లెల్లో ఆ ఎనుములకు ప్రజలకూ అవినాభావ నంబంధభం. దానిని వివరినర్హా కథలను ఆహ్వానించాం. ఇప్పటివరకూ కేవలం 5 మాత్రమే వచ్చాయి. మరో అయిదారు వస్తే బహుమతులు ప్రకటించి పుస్తకంగా తేవాలని. నిర్ణయించాం. మొదటి బహుమతి: 3,000/- రెండో బహుమతి: 2,000/- మూడో బహుమతి :1,000/- కలు చేరాల్సిన చివరితేదీ: 30.08.2021.

కథల్ని 9440073636 నంబరుకు వాట్స్‌యాప్‌ ద్వారా కానీ, ఆ౬6180 ౫460016200 ౬౫46660 అ $౫౬|.00%) కు మెయిల్‌ కానీ చేయవచ్చు.

“తపన సాహిత్య వేదిక టిచర్స్‌ కాలనీ. హిందూపురం 515211