పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్‌లో ప్రధానిగా అది ఆయన మొదటి సమావేశం. ఉపన్యాసం ప్రారంభిస్తూ ఆయన ఈ విషయమే చెప్పారు. మొదటిసారి హైదరాబాద్‌ వచ్చి తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనడం తనకి ఆనందాన్నే కాక ఎంతో ఉద్వేగాన్నీ కూదా కలిగిస్తున్నదనీ, హైదరాబాద్‌ రావడం తన తల్లి ఒడికి వచ్చినట్టుగా వుందనీ అంటూ “ఢిల్లీకి రాజైనా తల్లికి బిద్దే కదా!” అన్నారు. వెంటనే ఆయన కంఠం గాద్దదికమైైంది. ఒక అర నిమిషం మాట్లాడలేకపోయారు. ఆ తరువాత తేరుకుని తన స్నాతకోత్సవ ప్రసంగాన్ని ఈ విధంగా కొనసాగించారు : “విద్యలో సాంస్కృతిక పరిమళం రంగరించాలి:

తెలుగు విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవంలో పాల్గొంటున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం అద్యక్ష ఉపాష్యోళ్సులూ, పాలకమండలి నఖ్యులూ, ఈ స్నాతకోత్సవానీకి నన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానించడం నా పట్ల వారికున్న అభిమానానికి నీదర్శనంగా భావిస్తున్నాను. ముందుగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మే మాసం రెండవ వారంలో విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డా. సి. నారాయణరెడ్డి గారు నన్ను కలిసి, స్నాతకోత్సవం గురించి ప్రస్తావించి, ఆహ్వానీంచినప్పుడు కాదనలేకపోయాను. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొదటిది - ప్రఖ్యాత కవులు, అత్యున్నత జ్ఞానపీఠ పురస్కార [గ్రహీతలైన దా. సి. నారాయణరెడ్డి గారు నా చిరకాల మాతులు. ఈ విశిష్ట విశ్వవిద్యాలయ కార్యకలాపాల (ప్రగతి గురించి ఆయన వివరించినప్పుడు నేను నంతోషించాను. అధ్యావళుల్నీ విద్యార్థుల్నీ స్వయంగా అభినందించవచ్చుననే ఉద్దేశ్యంతో ఆవహ్వానానికి సమ్మతించాను. రెండవ కారణం-ఆం(ధ్రప్రదేశ్‌కు, అందులోనూ హైదరాబాద్‌ నగరానికి రావడం నాకు ఎప్పుడూ ఆనందప్రదమే. నా స్వగ్రామం ఈ ర్యాష్టంలోనిదే. అక్షరాలు దిద్దుకున్నది ఈ గడ్డ మీదనే. దేశ సేవకు తొలి అడుగు వేనింది ఇక్కదే. అందుచేతనే ఇక్కడున్న మిత్రులన్తూ సహచరులనూ కలుసుకునే అవకాశం కలుగుతుందనే కోరికతో కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించాను.

భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌ భారతదేశానికి నడిబొడ్డున వున్న ర్యాష్ట్రం. ఇది ఉత్తర, దక్షిణ భారతాలకు వారధిగా నీలుస్తుంది. ఇక్కడ ఉత్తర, దక్షిణ భారత సంస్కృతుల సమ్యక్‌ మేళనం కనిపిస్తుంది. తూర్పున సుదీర్హ సాగర తీరముందడగా, మిగిలిన మూడు వైపులా ఒరియా, హిందీ, మరాఠీ, కన్నద, తమిళ ప్రాంతాలున్నాయి. ర్యాష్టం ఉత్తర, దక్షిణ భారతాల సంగమంగా పరిథవిల్లితే, రాజధానీ నగరం హైదరాబాద్‌ భారతదేశానికే స్టూల ప్రతిరూపంగా విరాజిల్లుతున్నది. ఈ నగరంలో వివిధ వుతాలు, వివిధ ఖాషవలు, వివిద సంప్రదాయాలు సమైక్యంగా వర్దిల్లుతున్నాయి. దేశవ్యాప్త భాషగా ప్రవర్తిల్లే ఉర్జూ ఈ నగరంలో ప్రత్యేక స్థానాన్ని వహిస్తున్నది. వాస్తవానికి ఉర్జూకూ, హైదరాబాద్‌ సంస్థాన్‌ చరిత్రకూ అవినాభావ సంబంధం వుంది. ఉరూ మాధ్యమంగా 1819లోనే బోధన ప్రారంభించి, దేశంలోనే ఇందుకు ఆదర్భంగా నీలిచిన ఉన్నత విద్యా సంస్థ హైదరాబాద్‌ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రప్రథమంగా "హైదరాబాద్‌ రావడం నాకు భారత దర్శన అనుభూతిని కలిగిస్తున్నది.

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

భారతదేశాన్ని ఎందరెందరో మహానుభావులు తమ కావ్యాలలో వర్ణించారు. బంకించంద్ర ఛటర్జీ ఈ దేశ మహిమాన్విత రూప వైభవాన్నీ “వందేమాతరం” గీతంలో మనోహరంగా చిత్రించారు. అయితే, విశ్వకవి రవీంద్రుడు తన గీతంలో అఖీవర్జించిన తీరు అత్యద్భుతం. మన దేశ స్వరూపాన్ని భారతీయులు వదే పదే స్మరించుకునే విధంగా అందులో వున్న ప్రాంతాల పేర్లను అక్షరబద్ధం చేశారు. ఈ జనగణమణ గీతాన్ని మనం జాతీయ గీతంగా స్వీకరించి, మన విజ్ఞతను నీరూపించుకున్నాం. ఆ రకంగా మన నువిశాల మాతృదేశాన్ని నీత్య వందనంగా చేసుకున్నాం.

అత్యంత ప్రాచీనమైన భారతావని సహస్రాజ్ఞాల ఉజ్వల చరిత్రను గద్బీకరించుకుంది. ఆర్యులు గంగా, సింధు మైదాన కార్యక్రమానికి తరలి వచ్చిన తరువాత ఆర్వావర్తంగా మారి శతధా వికాస ప్రస్తానం సాగింది. మన వేద వాజ్మయం సకల మానవాళికి విజ్ఞాన సంపద పంచింది. ఇక్కడ బౌద్ద, జైనాది మతాలు ఉద్భవించి, ప్రపంచానికి నూతన తేజాన్ని ప్రసరింపజేశాయి. అనేక రాజవంశాలు ఈ సీమను పాలించాయి. ఆయా కాలాల్లో ఈ దేశం ఎన్నెన్నో దండయాత్రలకు లోనైంది. అయినా, అన్నిటికీ తట్టుకుని అచంచలంగా నిలిచింది. అనైక్యత వల్ల కలిగే ప్రమాదాలేలా ఉంటాయో చరిత్ర నుంచి ఈ దేశం గుణపాఠాలు నేర్చుకుంది. అనేక జాతులు వారికి, అనేక మతాల వారికి, అనేక భాషల వారికి ఇది నివాస స్థానమయింది.

ఎన్ని పరిణామాలు వచ్చినా ఆత్మసదృశ్యమైన భారతీయులకు ఎన్నడూ విఘాతం వాటిల్లలేదు. అంతేకాదు, ప్రతి పరిణామంలోనూ భారతీయ ముద్ర ప్రస్ఫుటంగా చోటుచేసుకుంది. శతాబ్దాల చరిత్రను సింహావలోకనం చేసుకుంటే ఈ యదార్థం స్పష్టమవుతుంది. మతం కావచ్చు, భాష కావచ్చు, సంప్రదాయం కావచ్చు, కళ కావచ్చు- మరేదైనా కావచ్చు. బహిరంగంగా ఖిన్నభఖిన్నంగా వున్నట్లు తోచినా విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తే అవి ఏకసూత్రబద్దమైనవేననే సత్యం ఆవిష్టృతమౌతుంది. అందుకే భారతదేశం [ప్రపంచ దేశాలకు ఖీన్నత్వంలో ఏకత్వ భావనకు (ప్రతీకగా ఖ్యాతి వహించింది. ఈ మౌలిక సత్యాన్ని ప్రతి భారతీయుడు సరైన దృక్పథంతో అవగాహన చేసుకోవాలి. అప్పుడు భావాలన్నీ విశాలతరమౌతాయి. కేవలం వైవిధ్యాన్నీ ఖిన్నత్వాన్నీ మ్యాతవేు దర్శించి, ఏకత్వాన్ని విన్మరించినవ్చుడు విశాలదృష్టి కారవడుతోంది. ఆలోచన సంకుచితమౌతుంది.

భిన్నత్వంలో ఏకత్వాన్నీ ఉదాహరణగా దేశ భాషారంగం

గురించి పరిశీలిద్దాం. మనది బహుభాషాదేశం. ఇంతకు ముందు ప్రస్తావించిన చారిత్రిక, సాంఘిక, సాంస్కృతిక కారణాల వల్ల ఇక్కద నాలుగు ప్రధాన భాషా కుటుంబాలు చోటు చేసుకున్నాయి. ఇందో- ఆర్యన్‌, ద్రవిడ భాషలే కాకుందా ఇతర భాషా కుటుంబాలు కూడా మన దేశంలో వున్నాయి. భాషా శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం మన దేశంలో 179 భాషలు, 544 మాండలికాలు వ్యాప్తిలో వున్నాయి. వీటిలో 15 (ప్రాంతీయ భాషలను మాతమే వనం భారత రాజ్యాంగంలో చేర్చగలిగాం. 36 భాషల్ని ఆధునిక భారతీయ భాషలుగా వరిగణిస్తున్నాం. నంన్కృతం, పాళ్లీ, అర్థమాగధి, 'ప్రాక్ళృతాలను ప్రాభీన భాషలుగా స్వీకరించాం. మన విద్యా వ్యవస్థలో అరబిక్‌, పర్షియన్‌, లాటిన్‌ మొదలైన 7 విదేశ ప్రాబీన భాషలకూ, ఇంగ్లీష్‌ కాకుండా జర్మన్‌, స్పానిష్స్‌ ఇటాలియన్‌, ఫ్రెంచి, రష్యన్‌, చైనీస్‌ వంటివి 8 ఆధునీక విదేశీ భాషలకు కూడా స్థానం కల్పించాం.