పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేటీ శతజయంతి

“2020 జూన్‌-2021

| గంధం సుబ్బారావు 9440654678


“ఢిల్లకి రాజైనా తల్లికి బిడ్దై కదా!”

తెలుగు కోసం, తెలుగు పిల్లలకు పిల్లలకు సరియైన చదువులకోసం పీవీ నరసింహారావుగారు పాలకునిగా చేసిన నిర్ణయాలు, కృషి సాటిలేనివి. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండు వాలాలకే తెలుగు విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవానికి ప్రత్యేకంగా వచ్చి చేసిన ప్రసంగాన్ని ఇక్కడ చదవండి. రెండు తొలుగు రాష్ట్రా పాలకులు వీవీగారి అభిప్రాయాలను చెవికైక్కించుకొంటే తెలుగు ప్రజలకు

ఎంతో మేలు జరుగుతుందని మా విన్నపం -సంపాదకుదు

తత్వశాస్త్రవేత్తలే సమాజానికి, దేశానీకి ఉత్తమమైన పాలకులన్స, వారైతేనే పాలనలో న్యాయాన్ని ధర్మాన్ని సమానంగా, సమతుల్యంగా స్వీకరిస్తారని ప్రాభీన గ్రీకు తత్వవేత్త ప్లేటో సూత్రీకరించాదు.

స్థితప్రజ్ఞుడు, అపరచాణక్యుడు, సాహితీవేత్త, మూర్తీభవించిన తెలుగుతనంగా భాసించిన పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ గారికి ఈ సూత్రీకరణ అక్షరాలా వర్తిస్తుంది.

“అతడు మహాకవి కాలేదు. గొప్ప నవలా రచయితా కాలేదు. సంగీత విద్వాంసుడుగానో, లేదా చిత్రకారుడుగానో రూఢీ చెందలేదు. తత్వవేత్తగానో, శాస్త్రవరిళోధకుడుగానో - లేక విఖ్యాత న్యాయవాదిగానో కూదా పేరు ఫొందలేదు”. పీవీగారి గురించి ఈ మాటలనే సాహసం చేసిన వ్యక్తి ఆయన ఆప్తమిత్రుడు, కాకతీయ పత్రిక సంపాదకులు, కీ.శే. పాములపర్తి సదాశివరావుగారు. 1972 మార్చిలో “జనధర్మ” ప్రచురించిన పీ.వీ. నరసింహారావు అభినందన సంచికలో రాసిన వ్యాసంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

సదాశివరావుగారంటే, బాల్యం నుంచీ శరీరాలు వేరైనా ఆత్మ ఒకటిగా పీవీని వెన్నంటి వున్న మహానుభావుడు. అందుచేత ఇవి వీవీగారు తనను తాను అంచనా వేసుకున్న మాటలుగా భావించవచ్చు.

ఈ మాటల్లో గుర్తింపవలసిన ఒక చమత్మారం వుంది. ఇక్కడ 'ాలేదు “చెందలేదు”, 'పొందటేదు” - అంటూ చెప్పబడినవన్నీ అట్లాకావడానీకి, చెందడానీకి, పొందడానీకి తగిన 'ప్రతిభాసామర్థ్యాలు పీవీలో పుష్కలంగా ఉన్నాయనీ నిర్వ్యంద్వంగా తెలియజెప్పటమే. పీవీ వ్యాసంగవైవిధ్యాన్ని వ్యాపకత్వాన్నీ సువ్వక్తం చేయడమే. ఆ లక్షణాలన్నింటినీ ఒకచోటికి చేరిస్తే రూపుగట్టిన వ్యక్తిత్వం వీవీ గారిది.

అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు గారు 1985 డిసెంబర్‌లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని తెలుగు సాహిత్యం, ఖాషా సంస్కృతుల పరిరక్షణకు, అభివృద్ది తదితర లక్ష్యాలతో స్థాపించారు.

| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఆ ఆగస్టు-2021 |




1991 నాటికి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఆచార్య సి. నారాయణరెడ్డి గారు వనిచేన్తున్నారు. ఆ నమయంలో విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడు హైదరాబాద్‌లోనే వున్న పీవీ గారిని 1991 జూలై 7వ తేదీన జరగనున్న విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా రావలనిందిగా ఆచార్య నారాయణరెడ్డి గారు ఆహ్వానించారు. అందుకు పీవీ గారు సంతోషంగా అంగీకరించారు. ఆ తరువాత జరిగిన ఆశ్చర్యకర పరిణామాల మధ్య పీవీ గారు 1991 జూన్‌ 21న దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంటే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండు వారాలకే ఆయన తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసి వుంది. మారిన పరిస్థితుల దృష్ట్యా ఆయన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనే అవకాశం వుందో లేదో అని తర్జనభర్జన పడుతున్న సందర్భంలో ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి విశ్వవిద్యాలయానికి ప్రధాన మంత్రి గారు 7 జూలై 1991 నాడు జరిగే విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హైదరాబాద్‌ వస్తున్నారని సందేశం వచ్చింది. ప్రధాన మంత్రిగా పదవిని చేపట్టిన తరువాత పీవీ హైదరాబాద్‌ రావడం అదే మొదటిసారి కావడంతో ఈ వార్త అన్నీ వార్తాపత్రికలలో పతాక శీర్షికలో వచ్చింది. దాంతో తెలుగు విశ్వవిద్యాలయం ప్రాధాన్యత అమాంతం పెరిగిపోయింది.

ఆ సమయంలో తెలుగు విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం బాధ్యతలను నేనే నిర్వహిస్తున్నందున హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగే స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొంటున్న సందర్భంగా జరిగిన ఏర్పాట్లను బాగా దగ్గరగా చూసే అవకాశం నాకు అఖించింది. ఉదయమే రవీంద్రభారతి 'ప్రాంగణాన్నంతా స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (5౧6) వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ప్రధాని నిర్ధారిత సమయానికి రవీంద్రభారతికి వచ్చారు. స్నాతకోత్సవం (ప్రారంభమై పీవీ గారు మాట్లాడే సమయానికి ఆయన