పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హారనత్వ సంవద

డా! పి. శివరామకృష్ణ “శక్తి 9447077

ఆకలి దప్పులతో అలమటిస్తూ, ఆవాసం కోల్పోతున్న ఆదిమజాతులలో కోదు గిరిజన జీవితం చిత్రించే ఒడియా నవలకు తెలుగు అనువాదం

ఆమధ్య 2013లో ఒరిస్సాలో కోదుతెగవాళ్ళు తమ దేవతాస్థలాలు, పోడు, కల్గుబసలు ఉన్న '“నీయంగిరి కొండలలో వేదాంత కంపెనీ బాక్సైట్‌ తవ్వకాలకు ఒప్పుకోం” అనీ ఎదురు తిరిగారు. అటవీ హక్షుల గుర్తింపు చట్టం ప్రకారం వారి గ్రామసభలకు తిరస్కరించే హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

తిరస్కరించారు కాని, అవి తమవని నీరూపించటానికి కావలసిన విధివిధానాలు, పటాలు గీయటం, దరఖాస్తులు నింపటం, ఆయా స్థల 'పాముఖ్యం తెలిపే నానుడులు, బడి చదువులలో పడి గుర్తు రాక, గుర్తుచేసేవారు లేక, బిక్కవచ్చి పోతున్నారు...

ఈ నీయంగిరి ప్రశస్తిని 1863లో వచ్చిన విశాఖపట్నం జిల్లా మాన్యుయల్‌ ప్రస్తావిస్తుంది. అప్పటికే తెల్లవాళ్ళు కోడుల చరిత్ర, సంస్కృతి, వ్యాకరణం, నరబలి వగైరాల మీద చాలా రాసారు. స్మూళ్ళ ఇనస్పెక్టర్‌ లింగం లక్ష్మాజీ పంతులు కోడు వ్యాకరణం మీద పట్టున్నవాడు అని మాన్యుయల్‌ వివరంగా పేర్కొంది. ఈ ప్రాంతంలో ఎర్రమట్టిని కోందలైట్‌ అని భూగర్భశా స్రవేత్తలు ఆ తెగపేరుతో పిలుస్తారు. గిడుగు రామమూర్తి కూడా “కోదులలో రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాని-సవరలలో లేరు.” అన్నారు (సవర కథలు 1912 .ఎమెస్మో)

అత్యున్నత శిఖరం నీయంగిరి. పేరు ఈ నవలారచయిత పేర్మానలేదు కానీ, అనేక తెగలకు ఆవాసమైన తూర్పుకనుమలలో, మాల్యవంతం దాకా విస్తరించిన ఈ కొందప్రాంతాలలో, కథకు ఎన్నుకున్న ఘర్‌ జాతా పర్వత వేశిలో అట్టరహ గడజాత, పద్దెనిమిది దేశీయ రాజ్యాలను, తూర్పు కనుమలలో ప్రాబీన రాజధానీ జయపురాన్నీ(నందపురం) “అమృత సంతానం రచయిత నామమాత్రంగా పేర్కొంటాడు...

“అమృత సంతానం” 540 పేజీల ఈ నవల మూడూళ్ళ ఎత్నోగ్రఫి

1. అప్పులపాలై భూమి పోగొట్టుకుని, షాహుకారుకింద వెట్టి చేయటానికి పల్లానికి వెళ్లి అసువులు బాసిన, ఒకకోదు గిరిజనుడి పెళ్ళాం, అతని ఈడొచ్చిన కూతురు 'పియోటి% మళ్ళీ కొండల్లో, తమ ఊరే వెళ్లి బతకటానికి తంటా పడుతుంటారు.

ఊరి పెద్దను సావోతా అంటారు. అతడు పెంస్లికానీ పదుచువాడు. అప్తి 'పెంచుకుని దిగువ వాడిలా అవ్వాలని అతనీ తాపత్రయం. అతన్నీ చేసుకుంటే పియోటి సుఖపదుతుందని తల్లి ఆలోచన. సరసం తెలియని వాడినీ ఎలా పదేయాలో అర్ధంకాని ఆ పడుచుదాని పాట్లు.

2. ఈ కుర్రాడు మరో ఊరి పెద్ద చెల్లెలు. 'పుయువీని చేసుకోవాలనుకుంటాడు. ఏదో పనిమీద వాళ్ళ ఊరు వెళతాడు. కానీ, పెల్లి మాటలదాకా వెళ్ళడు. పుయువీకైనా తన మాట చెప్పుడు..

పుయువీ వదిన, పుయు, పురిటాలు. కాన్సుతో ఈచుకుపోయిన పుయుమీద మొహం మొత్తిన మొగుడు, ఆడదాని పొందు కరువై అల్లల్లాడి పోతుంటాడు. అతడు, అతని చిన్నాన్న [గ్రామనౌకరు కోడలు సోనాదేయి దగ్గరికి సారా కోసం పోతుంటారు.. కానీ, ఆమెతో కలియటానికి కులం, పెద్దరికం అడ్జొస్తుంది.

3౩. చిన్నాన్న పెళ్ళాన్నీ పులి చంపేసింది. పులికి బలి అయినవాడి పెళ్లాన్ని మాత్రమే, అతడు మనువాడాలిట. అటువంటి వాళ్ళు దొరకటం కష్టం. దొరికినా ఆమె ఇష్టపడాలి. అందువల్ల ఆ ఆ ముదరప్రాణం పొందుకోసం, సొంత ఇల్లుకోసం తపిస్తుంటాదు. ఆస్తి పంచి ఇమ్మని అన్నకొడుకును అడగాలనీ మధన పడుతుంటాడు. ఇద్దరికీపడదు.. వీళ్ళ మధ్య పుయు నలిగి పోతూ, పసికందును 'పెంచుకుంటూ వస్తుంది. అదొక్కటే ఆమెకు

| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఆ ఆగస్టు-2021 |

అభ్భుత నసంతినం

గోపీనాథ్‌ మహాంతి

తెలుగు అనువాదం పురిపందా అప్పలస్వామి


దక్కిన ఆనందం, ఓదార్చు.,

4. దొంగసొత్తు వెతికే సాకుతో, ఇంట్లో దూరి ఫారెస్ట్‌ వాడొకడు సోనాదేయిమీద అత్యాచారం చేస్తాడు. తండ్రి 206ూ ఓలి తీసుకుని కట్టబెట్టాడు. ఆమె మొగుదు పెళ్ళాన్నీ పట్టించుకోడు. దొంగతనాల కోసం ఆ ఊరు, ఈ ఊరు పోతుంటాడు. ఆ కులంది ఒకటే ఇల్లు. వాళ్ళు అంటరాని వాళ్ళు... తండ్రి ఊరుకు పోదామంటే, అతడు దొంగతనాలు చేసి జైలు పాలై, కిరస్తానీ మతం తీసుకుని, ఊరికి కాకుందా పోతాడు. అక్మదా ఆమెకు ఆసరా లేదు. అడవి గాచిన వెన్నెల అయిన ఆమె, మోడులా కుమిలిపోతూ ఉంటుంది.

5. ఇంతలో పుయిబి పక్క ఊరు కుర్రాడితో లేచి పోతుంది. అతడో మంచి వేటగాడు... లేపుకొచ్చిన కుర్రాడి కుటుంబం మీవ తప్పు వేయాలి అని, అన్న చిందులు తొక్కుతాడు. కాన్సీ, పెళ్లి మాటలు కాలేదు కాబట్టి తప్పు లేదని పెద్దలు తేలుస్తారు. పెళ్లిబంతి ఇచ్చి వాళ్ళు కాపురం మసెదతారు.

పుయు మొగుడు, పియోటి ఊరుకు రాకపోకలు సాగిస్తుంటాడు. పియోటిని తీసుకొస్తాడు. పెళ్ళాం అలుగుతుతుంది.