పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాజకీయ నాయకులకు మన సమాజం ఒక (ప్రయోగశాలగా మారింది. ప్రజా సమస్యలపైన సరైన అవగాహన లేక నిర్ణయాలు తీసుకుని దేశాన్ని అస్తవ్యస్థంగా చేస్తున్న నాయకులూ మన దేశంలో ఉన్నారు. ఎన్నీ నేరాలూ, దోపిడీలూ చేస్తే అంత గొప్ప నాయకులుగా రాజకీయాల్లో కనిపిస్తున్నారు. దేశం బాగుపదాలంటే విద్యావంతులూ, నిస్వార్పపరులూ, ప్రజల పట్ల పరితాపం ఉన్నవాళ్లూ రాజకీయాల్లోకి వస్తేనే సాధ్యవడుతుంది అనుకోవటం అవమాయకళత్వంగా కనబడుతోంది. విద్యావ్యవస్థకి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించగలిగిన గొప్ప నాయకులను తయారు చేసే బాధ్యత కూదా ఉంది. దేశాన్ని పరిరక్షించి ప్రాణాలర్పించిన అనేక గొప్ప నాయకుల గురించి పాఠ్యాంశాలలో చేర్చి దేశంపట్ల బాధ్యతను పెంచాలి. రాజకీయ చైతన్యాన్ని విద్యావ్యవస్థ ద్వారా అందించాలి. ఇది మాచ్చభాషామాధ్యమం ద్వారానే సాధ్యం అని తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. పేదలకు విద్యాభద్ర:

దేశాన్ని పట్టి పీదస్తున్న జాధ్యాలలో పేదరికం ముఖ్యమైనది. ఒక దేశంలో 5 నుంచి 10 శాతం మందిఉన్న ఉన్నత వర్ణాలు ఉన్నత విద్యను అభ్యసించి, వారిలో ఒక శాతంలో నూరవ వంతు విదేశాలలో ఉద్యోగాలు సంపాదిస్తే దానిని అభివృద్ది అనలేము. మానవ వనరుల అఖివృద్ది మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఆర్జి 2018లో ఇచ్చిన నీవేదికలోని విద్వా గణాంకాల ప్రకారం భారత్‌లో ప్రాథమిక స్థాయిలో బడిమానేసిన సగటు విద్యార్థుల రేటు 4*ఓ13 శాతం ఉండగా, ఇది ఉన్నత ప్రాథమిక స్థాయిలో 4.03 శాతం, ద్వితీయ స్థాయిలలో 17.06 శాతంగా ఉంది. విద్యార్థులు బడి మానేయదానికి గల ప్రధాన కారణం పేదరికం, చదువుకునే స్తోమత లేకపోవడం. ఆకలి కోసం చదువులు వదిలేసి బాలకార్మికులుగా జీవనం సాగిస్తున్న పిల్లలు 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక కోటి 10 లక్షలు. పరిపూర్ణ అక్షరాస్యత సాధించడానీకీ అభివృద్ధికీ పేదరికం పెద్ద అవరోధంగా ఉంటోంది. పేదరికం మాత్రమే కాదు ఇంగ్లీషు మాధ్యమ విద్య కారణంగానూ విద్యార్థులు బడి మానేస్తున్నట్టు ఆచార్య గారపాటి ఉవావుహేశ్వర రావు గారు 2018లో హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం _ నిర్వహించిన “మదర్‌ టంగ్‌ మీడియం ఆఫ్‌ కన్షృక్షన్‌' అనే అంతర్జాతీయ సదస్సులో గణాంకాలతో నిరూపించారు. కాబట్టి ఒక సమాజంలో ప్రజల మధ్య సమానత్వాన్ని నెలకొల్సేది విద్య ఒక్కటే. విద్యార్థులందరికీ సమాన విద్యను, తగిన వసతులను, ఉపాధ్యాయులను నియమించి, వారి మాతృభాషలో నాణ్యమైన, నైతికజతో కూడిన విద్యను అందించిన నాడే అభివృద్ధి జరుగుతుంది. ప్రశ్నించకపోవడమే బానిసత్వం! :

నేడు అధికంగా విస్తరిస్తున్న సాంకేతిక విద్య, రాజకీయ చైతన్యం లేనీ విద్య వల్ల సమాజంలోని అన్యాయాలనూ, అక్రమాలనూ ప్రశ్చించే తత్వం 'కమేణా కోల్పోతోంది. తన చుట్టూ ఉందే సమాజం ఎలా నిర్మితమ్రైందో, వ్యవస్థ పనితీరుపై అవగాహన కారవదుతోంది. తన జీవితం, తన కుటుంబం కోసమే ఆలోచిస్తున్నారు కానీ వ్యవస్థ

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

పనితీరును దానిలో ఉందే లోపాలను (ప్రశ్నించే విద్యార్థులు కొంతమందే ఉన్నారు. దేశాభివృద్ధికి ప్రధాన అవరోధం ప్రశ్చించని వ్రజలే! దీనికి కూడా మూలాలు మనం విద్యా వ్యవన్థలోనే వెతుక్కోవాలి. సమాజం, వ్యవస్థ పనితీరు పట్ల అవగాహన కలిగించని పాఠాలను మనం విద్యార్థులకు అందిస్తున్నాం. కనీసం, ఉన్న పాఠ్యాంశాలను అయినా పూర్తిగా అవగాహన చేసుకుని నైపుణ్యాన్ని సాధిద్దామంటే, ఆ విద్యామాధ్యముం ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రశ్నించే తత్వం విద్యార్థి దశలోనే ఆగిపోతుంది, తద్వారా పాఠాలు అర్థం కావూ, లక్షల రూపాయలు ప్రైవేటు విద్యాసంస్థలు దోచుకుంటూనే ఉంటాయి, చివరికి దేశానికి నైవుణ్యం లేని విద్యార్థులను అందించడం జరుగుతోంది. ఒకవేళ ఉద్యోగానికి వెళితే శమ దోపిడీ జరుగుతోంది. దాన్ని కూదా ప్రశ్నించలేక బానిసలుగా మిగిలిపోవలసి వస్తోంది. సమసమాజం అమ్మనుడితోనే సాధ్యం!

విద్యార్థులకు నైతిక విలువలు కలిగిన విద్యను, నాణ్యమ్రైన విద్యను అందించడం ఎంత ముఖ్యమో, ఆ విద్యను అమ్మనుడిలో అందించడం కూడా అంతే ముఖ్యం! ప్రజల సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నా చుట్టూ ఉన్న వ్యవన్హను అడం చేసుకోవాలన్నా అది అమ్మనుడితోనే సహజంగా సాధ్యపడుతుంది. ఎందుకంటే భాషకూ, సమాజానికీ, దానిలో ఉన్న సంస్కృతికీ అవినాభావ సంబంధం ఒక గొలుసులా ఉంటుంది. ఎప్పుడైతే ఈ గొలుసు తెగిపోతుందో సమాజంలోని అన్ని వ్యవస్థల పైన దీనీ ప్రభావం ఉంటుంది. విద్యార్దులు తరగతి గదుల్లో పాఠ్యాంశాలపై ప్రశ్నించడం మానేస్తారు, అవగాహన కొరవడుతోంది, నైపుణ్యత సాధించలేరు, ఉద్యోగాలు పొందలేరు, మాననిక వేదనతో ఆత్మహత్యలకు పాల్చవతారు. రాజకీయ వ్యవస్థలో దోపిడీదారులు చారబడి ప్రజలను పాలిస్తారు, సమాజం దోపిడీకి గురవుతోంది, పేద ప్రజలకు సంక్షేమాలు అందవు, సమాజంపై అవగాహన లేని చదువుకున్న వ్యక్తులు రాజకీయ నాయకులను ప్రశ్నించరు. ఇక సమాజంలో సాంఘిక దురాచారాలైన కుల వివక్షా, కుల పిచ్చీ, 'ఛమదోపిడీ, మతళల్లోలాలు చెలకేగుతూ వుంటాయి. తార్మికంగా, సైద్ధాంతికంగా ఆలోచించే సమాజాన్ని మనం నీర్మించుకోలేము. కాబట్టి అమ్మనుడి వాడుక ప్రతి రంగంలోకి చారబడాలి. అప్పుడే విషయాల పట్ల అవగాహనలో సహజత్వం వస్తుంది. ముఖ్యంగా విద్యా రంగంలో పూర్తిస్థాయిలో అమ్మనుడే మాధ్యమంగా ఉండాలి. ఒక చెట్టు వేళ్లు నేలలోకి ఎంత లోతుగా తన్నుకుపోతే, బాహ్యంగా కనిపించే చెట్టూ అంత పచ్చగా కళకళలాడుతుంది. అలాగే విద్య కూడా - అమ్మనుడిలో సమాజాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటామో, దాని సమస్యలకు అంత చక్కటి పరిష్కారాన్ని కలిగించి సమసమాజాన్ని స్థాపించవచ్చు.


ఈ వ్యాసరచయిత పరిశోధక విద్యార్థి, హైదరాబాదు విశ్వవిద్యాలయం.