పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న్యాయాన్ని విద్య ద్వారా చేయలేకపోతున్నాం. నైతిక విలువలు ఉన్న విద్యని పిల్లలకి చిన్ననాటినుండే అందిస్తే వారిని నేర ప్రవృత్తికి దూరంచేసి, సమాజాన్ని మానవీయ కోణంలో చూపించే అవకాశం ఉంటుంది. అటువంటి పాఠాలను అమ్మనుడిలోనే పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నాలు జరగాలి. వీదని కులం కట్లు:

మనమందరం దేశాన్ని ఎంతో ్రేమిస్తున్నాము, కానీ దేశంలో ఉన్న ప్రతి మనిషినీ ్రేమించడంలో విఫలమవుతున్నాం.. దీనికి గల కారణం మనదేశంలో కొన్ని సామాజిక రుగ్మతలు నేటికీ కానసాగటమే. వాటిని ఆచరిస్తూ వాటిని బ్రతికిస్తున్నవాళ్ళూ, ఇంకా వాటిని అసలు పట్టించుకోని జనం పెరుగుతూనే ఉన్నారు. దీని ఫలితమే మనదేశంలో కుల వ్యవస్థ జడలు విప్పిన మరిచెట్టులా అన్ని రంగాల్లోనూ కనిపిస్తోంది. ఇది విద్యా వ్యవస్థలో ఒక జడ పదార్థంగా తయారయింది. అంటే మనం నేర్చిన, నేర్చుకున్న విద్య సామాజిక రుగ్మతా దేనికవేలాగ తయారైనై. ఇది మన విద్యా వ్యవస్థ బలహీనతగా కనిపిస్తోంది. నేటికీ కుల వివక్షతకు గురై, విద్యలోనూ, ఉద్యోగ ఉపాధుల్లోనూ అసమానత్సానికి బలై గాయపడిన అణగారిన జనం ఎందరో కుల వివక్ష చాపకింద నీరులా రోజురోజుకూ భారతదేశంలో విస్తరిస్తూనేవుంది. దీనీ గురించి విద్యావ్యవస్థలో మాట్లాడడమే అపవిత్రంగా భావిస్తున్నారు. పంట చేను మంచిగా పంట పండాలి అంటే అందులో ఉన్న పురుగులను మొదట చంపాలి. అలాగే మన దేశంలో ఉన్న ఈ కుల వివక్ష అనే దురాచారాన్ని వమనం నిర్మూలించినట్లయితే స్వేచ్చా ఖారత్‌ను చూడగలుగుతాం. అందుకే బాబ్యదశలో కాకపోయినా, యవ్వన దశలోనైనా విద్యార్థులకు పాఠాల ద్వారా దేశంలోని కులవ్యవస్థ గురించి దాన్ని రూపుమాపే విధి విధానాల గురించి పరిపక్వతతో ఒక ప్రధాన విషయంగా బోధించాలి. అసమానత్వానికి గురైన అణగారిన కులాలకు రిజర్వేషన్‌ పాలసీ ద్వారా విద్యా, ఉపాధులలో అవకాశాల కల్పన ద్వారా ప్రగతి పథంలో ఉన్న కులాలతో పాటు సమన్యాయం జరుగుతుందనీ, వాటిని వినియోగించుకోవాలనీ సూచించాలి. ఇది జరగనీ క్రమంలో ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో నిలిచిపోయి, సమాజంలో కుల కట్లు బలపదే అవకాశం ఉంటుంది. తద్వారా అది దేశానికి ప్రగతికి అవరోధంగా ఉంటూ త్మీవమైన నష్టాన్ని కలిగిస్తుంది. నైపుణ్యం నేర్పని నేటి విద్య:

ప్రతియేటా వచ్చే విద్యా వ్యవస్థల ప్రకటనలు చూస్తే మన విద్య ఏ దారిలో ప్రయాణిస్తోందో తెలుస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్‌ విద్యా వ్యవస్థలు కేవలం ర్యాంకుల పేరుతో, అధిక మార్కుల సాధనే ప్రధాన లక్ష్యంగా విద్యను అందిస్తూ, లక్షలకు లక్షలు ప్రజల నుంచి దోచుకుంటున్నాయి. ర్యాంకుల సాధనే పరమావధిగా విద్యార్దులను రాత్రీ పగలూ రుద్దుతున్నారు. దాని కోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. పాఠ్యాంశాలను పూర్తిగా బోధించి, వాటినీ వలా అవగాహన చేసుకోవాలో నేర్పించకుందా, షార్ట్‌కట్లు వెతికి మరీ పరీళ్లలు ఎలా రాయాలో నేర్పిస్తున్నారు. అంటే విషయాల పట్ల

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

అవగాహన కలిగించటంకళంటే మార్కులను వమూటకట్టుకొనే పద్దతులపైనే జోథన చూపు. ఫలితంగా పాఠ్యాంశాల అవగాహన లేకుండా, నైపుణ్యత కొరవడి ఉద్యోగాల వేటలో విఫలమవుతున్నారు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. కేవలం మార్ములనే విద్యా అభివృద్ధికి సూచికలుగా తీసుకుని తమ పిల్లలను తామే నీరుద్యోగులుగా తయారు చేస్తున్నారు. ప్రత్యేక ట్యూషన్లు, కోచింగులు ఇప్పించినా ఫలితం ఉండడం లేదు. దీనికి కారణం అఖివృద్దికి ప్రాతిపాదికగా మార్కులను పరిగణించడమే. మనలో ఉందే ఈ అపప్రథ నీరుద్యోగానికి దారి తీస్తోంది. దీనికి ప్రత్యేక నిదర్శనం 2019లో జరిగిన ఒక సర్వేలో 80 శాతం మంది ఇంజనీరింగ్‌ విద్యార్దులు నైపుణ్యాలు లేక ఉద్యోగానికి అనర్హులని తేల్చారు. కేవలం 2. 5%ఇంజనీరింగ్‌ విద్యార్దులు మాత్రమే కృత్రిమ మేధపై పట్టు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఇంజనీర్లను మాత్రమే కాదు వైద్యవృత్తిలోనైనా ఇంకా ప్రతి వృత్తిలోనూ ఈ నైపుణ్యలేమి కనిపిస్తోంది. రాజకీయ కారణంగానో, మరి ఏ ఇతర బాహ్య కారణంగానో ఉద్యోగం రాకపోతే పోరాడవచ్చు గానీ విద్యా వ్యవస్థను విద్యార్థులను నిస్సహాయులుగా, నిస్సారంగా తయారు చేస్తూ వారి ఖవివ్యత్తును వ్రమాదంలో వడేస్తోన్న విద్యా విధానాన్ని మార్చుకోనంతకాలం మనగతి ఇంతే. మూలిగే నక్మమీద తాటికాయ పడ్డట్టుగా, దీనికితోడు ఇంగ్లీషు మాధ్యమ విద్య. ఉన్నత చదువులు అకలింపు చేసుకోలేక, ఇంగ్లీషులో బోధన అర్ధం కాక్క విషయాల అవగాహన లేమితో విద్యలో నైపుణ్యతను సాధించలేకపోతున్నాం. రాజకీయ చైతన్యం:

వజల నమస్యల వట్ట అవగాహన లేనీ నాయకులు రాజకీయాల్లోకి రావడం, ప్రజా సంక్షేమానికి కావలసిన విధానాలను రూపొందించే జ్ఞానం లేకపోవడం, దోచుకునే ప్రవృత్తి ఉండటం సమాజానికి ఎప్పటికీ ప్రమాదమే. ఒక విద్యార్థి ఐవఎస్‌ కావడానికి రాత పరీక్షలూ, ఇంటర్వ్యూలూ పెట్టి ప్రజలకు కావలసిన విధి విధానాల గురించి కూలంకషంగా పరీక్షించి ప్రత్యేక నిపుణులచే వ్రశ్నించి లక్షల్లో కౌొందరినీ పాలనాధికారులుగా ఎంవిక చేసుకుంటాము. కానీ రాజకీయాల్లోకి పాలకులుగా వచ్చేముందు రాజకీయ నాయకులను ప్రజా సమస్యలపట్లా, పరిపాలనా విధానం పట్ల దేశంలో ఎవరూ వారు ఎవరూ ఏమిటని ప్రశ్నించి ఎంపిక జరగటంలేదు. అక్కడి నుండే సమాజానికి కష్టాలూ నష్టాలూ మొదలవుతాయి. మనం చదువుకునే చదువులు కేవలం వ్యక్తిగతంగా మనకు మాత్రమే ఉపయోగవదేవి కావు, దాని ద్వాతా ఆర్జించిన జ్ఞానాన్నీ సమాజశ్రేయస్సు కారకు తిరిగి ఉపయోగించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. రాజకీయం గురించి అవగాహన లేని విద్యార్ధి లోకాన్ని ఈరోజు ఈ విద్యావ్యవస్థ తయారు చేస్తోంది. సమాజాన్ని మాల్చే ఒక గొవృ్ప ఆయుదం రాజకీయం అని గుర్తించాలి. సమసమాజాన్ని స్థాపించడంలో రాజకీయం కీలక పాత్ర పోషించాలి. అటువంటి గొప్ప రాజకీయ వ్యవస్థ నేడు అక్రమాలకూ, అన్యాయానికీ, దోపిడీకీ అడ్డాగా మారిపోయింది. ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని చేపట్టి ప్రజాధనాన్ని దోచుకుంటూ పేదలను అణగదొక్కుతున్న