పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జె. డి. ప్రభాకర్‌ 8500227185

అమ్మనుడి


సమసమాజ స్థాపనకు ఎటువంటి విద్య అవసరం?

ఆకలి కోసం వదిలేసిన చదువులూ, ఆకలి తీర్చని చదువులూ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో నేటికీ ఉన్నాయి. విజ్ఞానం, అభివృద్ధి దిశగా నడిపించే విద్యా వ్యవస్థ సను వాటి నుండి దూరంపెంచే హైంళీల గురించి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలోకి శత్రు సమూహాలు రాకుండా దేశ సరిహడ్డుల్లో పకడ్బందీగా సైన్యాన్ని కాపలా పెట్టి ఎలా దేశాన్ని రక్షించుకుంటామో, టెర్రరిస్టులు దేశంలోకి ప్రవేశించి బాంబులు వేసి చంపకుండా బలమైన అంతర్గత నిఘా వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకుంటామో, నైతిక విలువలు కలిగిన విద్యా వ్యవస్థను నిర్మించుకోవడం అంతకంటే ముఖ్యమైనది. ఎండుకంటే నైతిక విలువలు లేని అనేకులు చీడ పురుగుల్లా సమాజాన్ని దోచుకుంటూ, చంపుతూ, నాశనం చేస్తు స్తున్నవాళ్ళు మన దేశం లోపలే ఉన్నారు. సమాజంలో వివిధ వ్యవస్థలలో ఉంటూ, ప్రజలని పాలిస్తూ ప్రజల శ్రమను దోచుకుంటూ నిత్యం దేశాన్ని పేదరికంలోకి నెట్టేస్తూ కూడా వీళ్ళు ఎడాపెడా బతికేస్తున్నారు. దీనికి కారణం నైతిక విలువలూ, ప్రశ్నించే తత్వం ప్రజల్లో అనేకుల్లో కొరవడటం. చట్టాలను ఎంత కఠినంగా అమలుపరిచినా మనిషిలో నేర ప్రవృత్తి మారడమూ లేదూ, నైతిక విలువలు సిద్దంచడమూ లేడూ. కానీ సమాజంలో నెలకొన్న అసమానతలనూ, అక్రమాలనూ, నేరాలనూ రూపుమాపే శక్తి విద్యకు మాత్రమే ఉందనడంలో అతిశయోక్తి లేదు. దీన్ని

నమ్మకపోవడం, సరైన విద్యను అందించకపోవడం వలన నేటి అసమానతల సమాజం మన కళ్లెదుటే పెరుగుతోంది.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, వేటికీ దోపిడీ, కులవివక్షా, మతకల్లోలాలూ, నక్సలిజం, నిరుద్యోగం, మానభంగాలూ, నీరక్షరాస్యా, పనిబీడ్ణల చావులూ, ఆకలి చావులూ ఎందుకు ఉంటున్నాయి? థనీకులు ధనికులుగానే ఉంటూ పేదలు పేదలుగా ఏందుకు మిగిలిపోతున్నారు? నీత్యం మనల్ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. అన్యాయానిీకీ, వివక్షతకూ గురవుతూ, వాటికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వీడుతున్న గొంతుకలు ఎన్నో! ఈ దుస్థితి నాణ్యమైన నైతిక విలువలున్న విద్య ద్వారా మారుతుందని నమ్మడంలో విఫలమవుతున్నాము.

ఫిన్లాండ్‌ విద్యావ్యవస్థ

విద్యా వ్యవన్హ బాగుంటే దేశం కూడా అన్నిరంగాల్లోనూ ఆరోగ్యంగా ఎదుగుతుందనదానికి ఫిన్లాండ్‌ ఒక చక్కటి ఉదాహరణ. ఐక్యరాజ్యసమితి వార్సిక నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో మొదటి స్థానంలో వరుసగా నాలుగు సార్లు ఫిన్లాండ్‌ నీలీచింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం మానవుల అభివృద్ది సూచి (హ్యూమన్‌ డెవలప్మెంట్‌ ఇండెక్స్‌), విద్యాసూచి (ఎడ్యుకేషన్‌ ఇండెక్స్‌) 2008 లో ఫిన్లాండ్‌ మొదటి స్థానాన్ని పొందింది. ఒకప్పుడు ఆర్థికంగా వెనుకబడిన దేశం అయినప్పటికీ కేవలం నాణ్యమైన విద్యతోనే దేశాన్ని సుఖిక్షంగానూ, సంతోషంగానూ చేసుకున్నారు. చిన్న పిల్లలకు పరీక్షలూ, అసైన్మెంట్స్‌ పేరుతో భారాన్ని కలిగించకుండా స్వేచ్చగా పాఠ్యాంశాలు అవగతమయ్యేలా విద్యా వ్యవస్థను రూపొందించారు. ప్రొాథఢ దశకు వచ్చేసరికి తమకు ఇష్టం వచ్చిన కోర్సులను ఎన్నుకొని నైపుణ్యాన్ని సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అమ్మనుడి విద్వ్యామాధ్యమం. నూటికి 90 శాతం మంది తమ అమ్మనుడి అయిన ఫిన్నిషులోనే మాట్లావతారు, విద్యాభ్యాసం కూడా తమ అమ్మనుడిలోనే చేస్తారు. విద్యార్దులకు బోధించే ఉపాధ్యాయులు అందరూ ఫోస్ట్‌ (గ్రాడ్యుయేషన్‌ చేసినవాదచే. విద్యా వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ దేశం (వతి విషయంలోనూ సంతోషంగా ఉంటోంది. మనం అటువంటి విద్యావ్యవస్థ నుండీ, అమ్మనుడి మాధ్యమవిద్య నుండీ స్పూర్తి ఫొందవలసిన అవసరం ఎంతో ఉంది. నైతికత నేర్చని విద్యలు:

విద్యా వ్యవస్థలో విలువలు కొరవడ్దాయి. నేటి విద్య చాలామట్టుకు యంత్రాల తయారీ వాటి పనితనం గురించి మనుషులకు నేర్పిస్తోంది, కానీ తాను ఉన్న సమాజం ఎలా నిర్మితమైందో, దానీ పనితీరు ఏ విధంగా ఉందో అవగాహన కలిగించలేకపోతోంది. ఉన్నత చదువులు చదువుకుని విమానయానాలు చేస్తున్నారు, కానీ వారినీ పెంచి పోషించిన తల్లిదండ్రులను వృద్దాశమంలో అనాథలుగా చేరుస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్తున్నాము కానీ సాటి మనీషి యొక్క ఆంతర్వాన్ని (గ్రహించలేకపోతున్నాము. ఎంత విద్యను ఆర్జించినా సమాజంలో ఎలా మెలగాలో తెలుసుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం, 4, 5వ ఏట నుండే ఐఐటి శిక్షణ అని పిల్లలను పూర్తిగా బాల్బానికి దూరం చేసి, సమాజం నుంచి వేరు చేసే ప్రక్రియను అనేక మంది తల్లిదండ్రులు అవలంభించడం తప్పనిసరి ఐంది. రోజుకి ఒక గంట స్నేహితులతో ఆదుకోవడానికి కూదా సమయం లేనంత జీవితాన్ని పరిచయం చేసుకుంటున్నారు. దీనివలన నంఖథు జీవనానికీ సామాజిక (ప్రవర్తనను నేర్చుకోలేని దుస్టితిలోకి నేటి తరాలు జారుకుంటున్నాయి. ఒకవైపు అక్షరాస్యత పెరుగుతున్నా మరోవైపు మనుషుల్లో నేరప్రవృత్తి పెరుగుతూనే ఉంది. అమానవీయతకు బీజాలు వదడుతున్న విద్యార్థులను మాల్చే ప్రయత్నం విద్యా వ్యవస్థ చేయలేకపోతోంది. నేటి బాలలే రేపటి ఫౌరులు అన్న జవహార్‌లాల్‌ నెహ్రూ గారి మాటలను గుర్తు చేసుకుంటూ నేటి బాలలకు నైతికమైన విద్య అందించినట్లయితే రేపటి ఉజ్వల భవిష్యత్తును నీజమ్రైన మానవీయ సమాజాన్ని చూస్తాం. మొక్షై వంగనిది మానై వంగునా అన్న సామెత మనం వింటూ ఉన్నప్పటికీ దానీకి సరి అయిన