పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కనిపించడంలేదు. తెలుగు పాఠాలను ఎలా బోధిస్తున్నారోచూద్దాం.

తెలుగు పాఠాల బోధన : ఈ స్కూలు ఆ స్ఫూలు అని లేదు. ప్రైవేటు స్కూలు ప్రభుత్వ స్కూలు అని లేదు. చిన్నది పెద్దది అని లేదు. అన్ని పాఠశాలల్లో తెలుగు బోధకులు ఒకే మాదిరిగా బోధిస్తున్నారు. అదేమిటంటే పాఠం చదువుతూ వ్యాఖ్యానిస్తూ ఉంటే పిల్లలు వింటూ ఉందదం.

పంచాంగ శ్రవణంలా పురాణ కాలక్షేపంలా విద్యార్థులు ఎంత కాలం వినాలి? టీవీల్లో ల్యాప్‌ట్సాపుల్లో సెల్‌ఫోన్లలో ఎక్కడ చూసినా వినడమే. దీనీ వలన ఎంత విసుగు కలుగుతుందో చదువు మీద ఎంత వ్యతిరేకత పెంచుకుంటారో ఆలోచించే వాళ్ళే లేరు. స్వయంగా ఆలోచించే అలవాటు నశించి ఇష్టమున్నా లేకున్నా అర్జంచేసుకోకుందా అంగీకరించడమనే స్వభావంలోకి వెళ్ళిపోతారు. పాఠ్యపుస్తకం విల్లలు చదివి అర్ధం చేసుకోదానీకి తయారు చేసింది. పిల్లలు స్వయంగా చదవాలి. అర్దం చేసుకోడానికి ప్రయత్నించాలి. అర్ధంగాకపోతే తోటి విద్వార్దులనో ఉపాధ్యాయుడినో అడగాలి. విద్యార్డులు చదివిన తర్వాత పాఠంపై ఉపాధ్యాయుడు చర్చపెట్టాలి.

కథలతో పద్యాలతో గేయాలతో వ్యాసాలతో ఉన్న తెలుగు వాచకాలు స్వయంగా చదివి అర్ధంచేసుకాని ఆనందించలేకపోతే ఇతర సబ్జెక్టుల సంగతి ఏమిటి?

గతంలో తెలుగు భాషాటోధన వేరు. పాఠాలన్నీ ప్రముఖ కవులు రాసిన పద్యాల్లో, (గ్రాంధిక కావ్య భాషల్లో ఉందేవి. ఆ భాష విద్యార్థులకు అర్హమయ్యేదికాదు. అందువలన తెలుగు పండితులు చదివి అర్భంచెవ్చి వివృలీకరించేవారు. ఇప్పుడు పాఠాలన్నీ వాడుకభాషలో సులభతైలిలో ఉన్నాయి. (ప్రాథమిక తరగతుల్లో చదవడం నేర్చుకొన్న ప్రతీవిద్యార్ధి అర్ధంచేసుకోగలడు. స్వయంగా చదివి అర్థంచేసుకునే ప్రయత్నంలో ఆనందిస్తారు. చెరువుల్లో బావుల్లో ఈత నేర్చుకుంటున్న పిల్లల్లా ఆనందిస్తారు. స్వయంగా చదవడం అర్జంచేసుకోవడం ఒక అభ్యాసంగా అలవాటుగా మారుతుంది. తెలుగుపై మక్కువ కలుగుతుంది. విద్యార్థి భవిష్యత్తుకు తెలుగు భాషావికాసానికి ఇది ఎంతో అవసరం.

పిల్లలు అర్ధంచేసుకోగల విషయాలుకూడా టీచటే చదివిచెప్పి టీచరే ప్రశ్నలకు జవాబులు చెప్పి విల్లల్ని చేతగానీవాళ్లగా మార్చడం ఎవరికి ఉపయోగం? ఇది ఎలా ఉందంటే నడవగల్లిన పిల్లల్ని ఎత్తుకొని తిరిగినట్లు ఉంది. ఈ బోధనా పద్ధతి మారాలి. ఈ జోధనగురించి టీచర్లుకు కొన్నీ సూచనలు పాఠ్యపుస్తకం ముందు 'పేజీల్లో ఉన్నాయి. వాటి వివరాలు, కూడా చూద్దాం.

సూచనలు : పాఠ్య పుస్తకం ముందుపేజీల్లో టీచర్లకు, విద్యార్థులకు కొన్నీ సూచనలు ఇచ్చారు. ఇవి చాలావరకు బాగున్నాయి. కానీ ఆచరణలో వాటినీ పాటించడంలేదనేది వాస్తవం. అవేమిటో చూద్దాం.

1పాఠశాలలో చేరగానే అంటే కొత్తక్లాసు ప్రారంభంలో పరీక్ష

పెట్టి ప్రతీవిద్యార్థి స్థాయిని అంచనావేయాలి. ఇదీ ఎక్కడా జరగడంలేదు.

2. అన్నీ రాతపనులు స్ఫూల్లోనే పూర్తిచేయాలి. ఇది సగం కూదా జరగడం లేదు. సగం పైగా ఇంటిపనికి ఇస్తున్నారు.

౩.లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తీసుకొని చదవమన్నారు. ఇది పదిశాతం న్మూళ్ళలో జరుగుతున్నదేమో. చాలా న్మ్యూళ్ళలో (గ్రంథాలయాలు లేవు. ఉన్నా వాటినీ ఉపయోగించరు. గ్రంథ పఠనం వ్యక్తి వికాసానికి అవసరమనే విషయం ఎవరికీ నమ్మకం లేదు. అసలు లైబ్రరీ పీరియడే లేదు.

4. ఖాషా బోధనలో తప్పనిసరిగా వివిధ ప్రక్రియలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాసాలు, లేఖలు, నాటకీకరణ, ఏకాపాత్రాఖినయం, గేయాలు పాడుతూ అభినయించడం, పద్యాలను రాగయుక్తంగా చదవడం, వార్తలు, నీనాదాలు, ప్రకటనలు, కరపత్రాలు, పోస్టర్లు రూపొందించడం ఇవ్వన్నీ పిల్లలకు పరిచయం చేయాలని సూచించారు. దాదాపు 90 శాతం పిల్లలకు చెప్పరు.

5. స్వంతపని జట్టుపనీ ఇవేమి సక్రమంగా జరగవు. బాగారాసిన పిల్లల నోట్‌బుక్స్‌ చూసి రాయలేనీ పిల్లలచేత రాయిస్తారు.

'ప్రతీస్కూల్లో జరిగేది ఒక్కటే. ప్రశ్నలకు జవాబులు టీచర్‌ చెబుతారు. విల్లలు వాటినీ బట్టీ పదతారు. పరీక్షలు సెదతారు. మార్కులు చేస్తారు. ఏ సబ్దక్టయినా, ఏస్మూలైనా జరిగేది ఇదే.

మారాల్సింది పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదు. జోధన మారాలి. ముఖ్యంగా తెలుగు భాషాటోధన పాతధోరణినీ నుండి బయటపడాలి. తెలుగులో బోలెడన్నీ పుస్తకాలున్నాయి. పిల్లలు స్వయంగా వాటినీ చదవాలి. ఎందుకంటే భవిష్యత్తులో తెలుగు భాషను నిలబెట్టాల్సిన వారు తెలుగులో రచనలు చేయాల్చినవారు ఈనాటి విద్యార్థులే గదా! ఎలాగూ తెలుగు మీడియంకు ఎసరు పెట్టారు. ఒక్క సజ్జెక్టుగానైనా తెలుగు మిగులుతుందా!

తెలుగు భాషా బోధన మారకపోతే కష్టం.

తప్పెవరిది? టీచర్లమీద నెపం నెట్టేసి చేతులు దులుపుకోవడం సరికాదు. వాళ్లకు తెలిసింది, అనుభవంలో ఉన్నదేదో అదే చేస్తున్నారు. సిలబస్‌ పూర్తిచేయడం పరీక్షలకు సిద్దం చేయడమనే వత్తిడిలో ఉంటారు. తీరిగ్గా పిల్లల చేత చదివించి తరగతిలో చర్చపెట్టి పిల్లలే స్వయంగా ప్రశ్నలు జవాబులు రాసుకోవడం అనే కార్యక్రమం చాలా ఆలస్యమవుతుందనేది వాస్తవం. పిల్లలకు ఎంత ఉపయోగం అనేదానితో నీమిత్తంలేకుండా టీచర్లకు స్కూళ్ళకు ఏది సౌలభ్యమో అదే చేస్తున్నారు.

టీచరు 10 పాఠాలు చెప్పడం కంటే పిల్లలు స్వయంగా ఒక్క పాఠం చదివి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎక్కువ ప్రయోజనం.

పిల్లలకూ, సమాజానికీ, తెలుగు భాష భవిష్యత్తుకూ మేలైన

పద్దతులేవో అవి తెలుగు సమాజం గుర్తించాలి.

“దేశభాషాఖిమానము తోదిదే దేశాఖిమానము. ఏ కులమువారైనా, ఏ మతమువారైనా, ఏ దర్జావారైనా తెలుగు మాతృభాషగా గలవారందరూ ఒక్క సంఘమువారనిన్ని సంఘములోని వారందరూ అభివృద్ధిపొందితేనే కాన, పంఘము

అభివృద్ధిపొందదనిన్ని ఎవరు వెనుకబడ్దా సంఘమునకు నష్టమే అనిన్ని ఎవరు త్రికరణశుద్ధిగా భావిస్తారో వార దేశాఖిమానము


గలవారని చెప్పవలెను.”

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

- గిడుగు వేంకటరామమూర్తి (తెలుగు పత్రికల సంపాథకులకు వ్రాసిన లేఖలో)